amp pages | Sakshi

నయవంచనపై నాలుగో సమరభేరి

Published on Thu, 11/29/2018 - 02:41

ఒక వైపు తెలుగుదేశం మరోవైపు బీజేపీ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రజల ప్రాణాధార మైన ప్రత్యేక హోదాను పూర్తిగా పక్కన పెట్టేశాయి. ఈ నేపథ్యంలో తొలినుంచి ప్రత్యేక హోదా అవసరాన్ని నొక్కి చెబుతూ వైఎస్సార్‌ సీపీ సాగించిన అలుపెరగని పోరాటం చారిత్రక ప్రాధాన్యతను సంతరించు కుంది. ఈ నేపథ్యంలో కేంద్రప్రభుత్వంపై ధర్మ పోరాటం ముసుగులో చంద్రబాబు సాగిస్తున్న నయ వంచక రాజకీయాలను తూర్పారపడుతూ వైఎస్సార్‌ సీపీ కాకినాడలో రేపు గర్జన  సభను నిర్వహస్తోంది.  
   
ఈ నెల 30న ‘నయవంచన’ పై గర్జన కాకి నాడలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలనే వైఎస్సార్‌ సీపీ గోదావరి జిల్లాల సమన్వయకర్త మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. ప్రత్యేక హోదా కోసం లోక్‌సభలో మోడీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన పంచపాండవులలాంటి ఎంపీలలో ఒక రైన వైవీ సుబ్బారెడ్డి సభను పర్యవేక్షించడం ఈ సంద ర్భంగా ప్రస్తావించుకోవాలి. ఢిల్లీ ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ వేదికగా వైఎస్సార్‌సీపీ ఎంపీలు ఆమరణ నిరాహార దీక్ష చేసిన సందర్భంగా ప్రస్తుత పరిస్థితులలో ప్రాధా న్యత సంతరించుకుంది. మోదీ ప్రభుత్వంపై రాజీ లేని పోరాటం హోదా కోసం జరుపుతున్న క్రమం లోనే ఆమరణ నిరాహార దీక్ష సైతం ఢిల్లీ వేదికగా నిర్వహించి సమరశీలంగా పోరాడిన పార్టీ వైఎస్సార్‌ సీపీ. విభజన హామీల అమలు కొరకు పోరాటం అంటూ చంద్రబాబు దొంగ దీక్షలను మనం గుర్తుం చుకోవాలి. విభజన హామీలు, ప్రత్యేక హోదాపై పోరు, కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమ, విశాఖలో రైల్వే జోన్, పోలవరం, నాణ్యతతో అవినీతి రహితంగా నిర్మించాలని చెబుతూనే రాజధాని పేరుతో సాగి స్తున్న అవినీతి, అక్రమాలు రైతుల భూములు ప్రభు త్వం కబ్జా చేసుకోవడం లాంటి సమస్యలపై జగన్‌ నేతృత్వంలో వైఎస్సార్‌సీపీ పోరాటాలు చేసింది. 

జగన్‌ సంవత్సర కాలంపైగా జరుపుతున్న ప్రజా సంకల్ప యాత్రకు ప్రజలు అపూర్వ మద్దతు ప్రకటించారు. ప్రజలలో తన పాలన పట్ల వ్యతిరేకత స్పష్టంగా వ్యక్తం కావడం జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రజలు సంఘీభావం ప్రకటించడంతో చంద్ర బాబు కూడా ప్రత్యేకహోదాపై యూటర్న్‌ తీసుకో వడం, విభజన హామీలు అమలు పరచాలని మోదీ ప్రభు త్వంపై పోరాటం అంటూ నయవంచన ఉద్య మాలు చేయడం మనం గమనించాం. మైనార్టీలకు దగ్గర అయ్యేందుకు గుంటూరులో మైనార్టీలతో సదస్సు పెట్టి అభాసుపాలయ్యారు. ఆ సభలో మైనార్టీ సమ స్యలను ప్రస్తావించిన ముస్లిం యువకులపై దేశ ద్రోహ నేరం బనాయించడం చంద్రబాబు దిగజారు డుతనానికి నిదర్శనం. నాలుగు సంవత్సరాల పాల నలో నలుగురు రాష్ట్ర చీఫ్‌ సెక్రెటరీలు కృష్ణా రావు, అజయ్‌కల్లామ్, ఎస్పీ టక్కర్, దినేష్‌ కుమార్‌ బాబు పంపిన అనేక ఫైళ్లలో సంతకాలు చేయడానికి గానీ, తమ ఆమోద ముద్ర వేయడానికి గానీ తిరస్క రించారు. తెలుగుదేశం పార్టీకి కంచు కోటలాగా ఉన్న ఉత్తరాంధ్రలో జగన్‌ ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల విశేష స్పందన, మద్దతు లభించడంతోపాటు, ప్రతి పక్ష నాయకుడిపై హత్యాయత్నం సంఘటనను పాల కులే ప్రేరేపించారు అని నేడు ప్రజలు అర్థం చేసు కున్నారు. 

జగన్‌ ప్రత్యేక హోదా కోసం విశాఖలో జరప బోయిన సభను అడ్డుకోవడం కోసం విశాఖ ఎయిర్‌ పోర్టులోనే నియనిబంధనలకు వ్యతిరేకంగా జగన్‌తో పాటు మరో ఇద్దరు ఎంపీలను నిర్బంధించి పోలీ సులు హైదారాబాద్‌కు వెనుతిరిగేటట్లు చేయడం మనం గుర్తు పెట్టుకోవాలి. ప్రతిపక్ష నేతపై విమానా శ్రయంలో జరిగిన హత్యా ప్రయత్నాన్ని రాష్ట్ర ముఖ్య మంత్రి స్థాయిలో బాబు కోడి కత్తి అంటూ  వెటకా రంగా ఖండించడం సరైనది కాదని, కనీసం ప్రతిపక్ష నాయకుడిని ఫోన్‌లో అయినా పలకరించకపోవడం పెద్ద తప్పు అని నిన్ననే సీనియర్‌ సీపీఐ నాయకుడు నారాయణ ప్రకటించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి పక్ష నాయకుడికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోవడం, అసలు ప్రతిపక్షాన్నే లేకుండా చేయాలని 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను అనేక మంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలను కొనుగోలు చేయడం ఎంతటి బరితెగింపో మనం గమనించవచ్చు.

ఈ పరిస్థితుల నేపథ్యంలో వైఎస్సార్సీపీ గర్జన కాకినాడలో 30 తేదీన చేపడుతోంది. ప్రత్యేక హోదాపై, విభజన హామీలపై ఎంతో నిర్ణయాత్మ కమైన పోరాటాన్ని పరిపక్వతతో, విజ్ఞతతో, దూర దృష్టితో వైఎస్‌ జగన్‌ నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీ జరుపుతున్న పోరాటం చారిత్రకత ప్రాధాన్యత సంత రించుకుంది. వైఎస్సార్‌సీపీ జరుపుతున్న నయ వంచన దీక్ష చంద్రబాబు మోసాలను, కుట్రలను, కుతంత్రాలను ఎండగట్టడంలో ప్రముఖ పాత్ర వహిస్తుందని అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. కాకినాడ సభకు జేజేలు. (నవంబర్‌ 30న కాకినాడలో వైస్సార్‌సీపీ గర్జన సందర్భంగా)

వ్యాసకర్త : ఇమామ్‌,  కదలిక సంపాదకులు
మొబైల్‌ : 99899 04389

 

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్