amp pages | Sakshi

బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ రాయని డైరీ

Published on Sun, 04/08/2018 - 02:13

నాకింకా జైల్లోనే ఉన్నట్లుంది! జైల్లో నా గది పక్కనే పెద్దాయన గది. 
‘‘ఎలా ఉన్నారు బాపూజీ’’ అన్నాను.. ఆయన దాల్‌–సబ్జీ తింటుంటే.. వెళ్లి పక్కనే కూర్చొని. 
‘‘చల్లగా ఉండు సల్మాన్‌’’ అన్నారు బాపూజీ. 
‘‘నాకీ జోథ్‌పూర్‌ ఎండలొక లెక్క కాదు బాపూజీ. ముందు మీరెలా ఉన్నారో చెప్పండి’’ అన్నాను. 
‘‘నేనెలా ఉన్నా, నువ్వు చల్లగా ఉండాలి సల్మాన్‌’’ అన్నారు ఆయన. ఎందుకంత ఎమోషనల్‌ అయ్యారో అర్థం కాలేదు. 
‘‘ఇన్నేళ్లుగా జైల్లో ఉంటున్నానా.. ఒక్కరూ నన్ను బాపూజీ అని పిలవలేదు సల్మాన్‌. చిన్నాపెద్దా లేకుండా అంతా ఆశారాం అన్నవాళ్లే’’ అన్నారు పెద్దాయన కళ్లు తుడుచుకుంటూ. 
శుక్రవారం ప్రీతి, అల్విర, అర్పిత నన్ను చూడ్డానికి వచ్చారు. ‘‘ఎందుకు అంత దూరం నుంచి! ఈ అన్నయ్యను చూద్దామనేనా!’’ అన్నాను. అల్విర, అర్పిత దుఃఖం ఆపుకుంటున్నారు. 
ప్రీతి అంది, ‘‘ఓయ్‌.. వర్కవుట్‌లు మానకు’’ అని! నవ్వాను. ఈ స్నేహితురాళ్లలో ఏదో ఉంటుంది మాయ! కొట్టి మాట్లాడతారు. దెబ్బలు నయమైపోతాయి. ఒంటికి తగిలినవీ, మనసుకు తగిలినవీ!
ముగ్గురూ వెళ్లిపోయాక జైల్‌ సూపరింటెండెంట్‌ వచ్చాడు.. ‘‘భాయ్‌.. ఏమైనా కావాలా?’’ అన్నాడు. 
‘‘ఖైదీని భాయ్‌ అంటే మీ ఉద్యోగానికి ఏమీ ముప్పు కాదా మిస్టర్‌ విక్రమ్‌ సింగ్‌?’’ అని అడిగాను.. ఆయన యూనిఫారమ్‌ మీద ఉన్న విక్రమ్‌ సింగ్‌ అనే పేరును చూస్తూ. 
‘‘అవుతుంది. అయితే నా ఉద్దేశంలో మీరిప్పుడు ఖైదీ పాత్రను పోషిస్తున్నారు. మిమ్మల్ని ఖైదీ పాత్రలో చూస్తున్న ప్రేక్షకుడిని నేను’’ అన్నాడు!
‘‘అయితే మీరిప్పుడు మీ సూపరింటెండెంట్‌ పాత్రను పోషించడం లేదా?’’ అని పెద్దగా నవ్వాను. 
‘‘ప్రతి మనిషికీ పైకి ఒక పాత్ర ఉంటుంది, లోపల ఒక పాత్ర ఉంటుంది భాయ్‌. లోపలి పాత్ర అతడు ఇష్టపడి చేసే పాత్ర. పై పాత్ర ఎవరో ఇస్తే చేసే పాత్ర’’ అన్నాడు. 
‘‘మీరు ఫిలాసఫీ చదువుకున్నారా విక్రమ్‌ సింగ్‌?’’ అన్నాను. 
‘‘అంతకన్నా గొప్పవి.. మీ సినిమాలు.. వాటిని చూశాను భాయ్‌’’ అన్నాడు. 
బులెట్‌ దింపాడు గుండెల్లో! కన్నీళ్లకు చెప్పాను బయటికొస్తే చంపేస్తానని.  
మా ఇద్దరి మధ్యా ఊచలు అడ్డుగా లేవు. కానీ ఊచలు అడ్డుగా లేవని ౖజైలు అధికారిని హత్తుకోనిస్తుందా చట్టం?
లాయర్‌ రాగానే విక్రమ్‌ సింగ్‌ వెళ్లిపోయాడు. 
‘‘సల్మాన్‌జీ మనకు బెయిల్‌ వచ్చింది!’’ అన్నాడు లాయర్‌.
‘‘వచ్చిన బెయిల్‌ని తిరస్కరించే హక్కు ఖైదీకి ఉంటుందా మహేశ్‌జీ?’’ అని అడిగాను.
‘అదేంటి సల్మాన్‌జీ!!’ అన్నట్లు చూశాడు. 
‘‘ఊరికే.. అలా అనిపించింది’’ అన్నాను. 

మాధవ్‌ శింగరాజు

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)