amp pages | Sakshi

పోస్టులు వందల్లో.. దరఖాస్తులు లక్షల్లో

Published on Thu, 10/29/2015 - 06:45

విద్యుత్ ఇంజనీర్ ఉద్యోగాలకు భారీగా దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విద్యుత్ ఇంజనీర్ పోస్టుల కోసం దరఖాస్తులు పోటెత్తాయి. పోస్టులు ఉన్నది వందల సంఖ్యలోనైతే.. దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్యలో లక్షను దాటిపోయింది. 856 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కోసం జెన్‌కో గత నెలలో దరఖాస్తులు ఆహ్వానించగా... ఏకంగా 1,09,308 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఒక్క ఎలక్ట్రానిక్స్ విభాగంలో చూస్తే ఉన్న పోస్టులు 70 కాగా.. ఏకంగా 37,078 దరఖాస్తులు వచ్చాయి. మొత్తంగా దరఖాస్తు గడు వు బుధవారంతో ముగిసిపోగా, ఒక్కో పోస్టు కు 127 మంది పోటీ పడుతున్నారు. వచ్చే నెల 14న రాతపరీక్ష నిర్వహించనున్నారు.
 
 ఎన్పీడీసీఎల్‌లో 35 వేల దరఖాస్తులు
 ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్)లోనూ ఏఈ పోస్టులకు తీవ్ర పోటీ నెలకొంది. 164 ఏఈ పోస్టులకు 35,623 మంది దరఖాస్తు చేసుకున్నారు. కేటగిరీల వారీగా చూస్తే 159 ఏఈ (ఎలక్ట్రికల్) పోస్టులకు 33,010 మంది, 3 ఏఈ (సివిల్) పోస్టులకు 1,316 మంది, 2 ఏఈ (సీఎస్/ఐటీ) పోస్టులకు 1,297 మంది పోటీ పడుతున్నారు. వచ్చే నెల 8న రాత పరీక్ష జరగనుంది.
 
 ట్రాన్స్‌కో, ఎస్పీడీసీఎల్‌లోనూ...
 ట్రాన్స్‌కో 206 ఏఈ (184 ఎలక్ట్రికల్, 22 సివిల్) పోస్టుల భర్తీకి ప్రకటన జారీ చేయగా ఇప్పటి వరకు 47 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వచ్చే నెల 4వరకు గడువున్న నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. వచ్చే నెల 29న రాతపరీక్ష నిర్వహించనున్నారు. ఇక దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎస్పీడీసీఎల్) 201 ఏఈ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ప్రకటన చేయగా.. ఇప్పటివరకు 30 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వీటికి దరఖాస్తు గడువు గురువారంతో ముగిసిపోనుండగా, వచ్చే నెల 22న రాత పరీక్ష జరుగుతుంది.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)