amp pages | Sakshi

ఖమ్మం కలెక్టర్, ఎస్పీపై సీఈసీ వేటు

Published on Wed, 04/27/2016 - 03:54

ఖమ్మం కలెక్టర్, ఎస్పీపై బదిలీ వేటు
కాంగ్రెస్ ఫిర్యాదు నేపథ్యంలో చర్యలు చేపట్టిన ఎన్నికల సంఘం
పాలేరు రిటర్నింగ్ ఆఫీసర్ కూడా తొలగింపు

 
సాక్షి, హైదరాబాద్: పాలేరు ఉప ఎన్నికలో అధికారులు, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ టీపీసీసీ చేసిన ఫిర్యాదుతో ఖమ్మం జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతోపాటు పాలేరు ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిపై బదిలీ వేటు పడింది. వారిని ఆయా స్థానాల నుంచి తొలగించి, వేరే అధికారులను నియమించాలని కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశించింది. ఈ మేరకు వారిని బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. సీఈసీ సూచనల మేరకు ఖమ్మం కలెక్టర్‌గా దానకిశోర్, ఎస్పీగా రమారాజేశ్వరి, రిటర్నింగ్ అధికారిగా బి.శంకర్‌లను నియమిస్తూ మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
 
 టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగం..
 టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ రేణుకా చౌదరి, పలువురు రాష్ట్ర నేతలు మంగళవారం ఢిల్లీలో ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) నసీమ్ జైదీని కలిశారు. ప్లీనరీ పేరిట టీఆర్‌ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఫిర్యాదు చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, కేంద్ర బలగాలను రంగంలోకి దింపి ఎన్నికలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై వెంటనే స్పందించిన సీఈసీ... జిల్లా కలెక్టర్, ఎస్పీ, రిటర్నింగ్ అధికారిని బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆయా స్థానాల్లో  అధికారుల నియామకానికి పేర్లను సూచించాలని కోరింది. ఈ మేరకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎస్పీగా నియమించేందుకు ఐపీఎస్‌లు వై.ప్రకాశ్‌రెడ్డి, విక్రమ్‌జిత్‌సింగ్ దుగ్గల్, రమా రాజేశ్వరిల పేర్లతో కూడిన జాబితాను, కలెక్టర్‌గా నియమించేందుకు ఐఏఎస్‌లు రాహుల్ బొజ్జా, సందీప్ సుల్తానియా, దానకిశోర్‌ల పేర్లతో జాబితాను సీఈసీకి పంపించింది.
 
 వీరిలో సీఈసీ సూచనల మేరకు కలెక్టర్‌గా దానకిశోర్, ఎస్పీగా రమారాజేశ్వరి, రిటర్నింగ్ అధికారిగా బి.శంకర్‌లను నియమించింది. ఖమ్మం కలెక్టర్‌గా ఉన్న లోకేశ్‌కుమార్, ఎస్పీగా ఉన్న షానవాజ్ ఖాసీం, ఉప ఎన్నిక రిటర్నింగ్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ (రైల్వేస్) సీహెచ్ గణేశ్‌లను బదిలీ చేసింది. ఖమ్మం కలెక్టర్‌గా నియామకమైన దానకిశోర్ ప్రస్తుతం మున్సిపల్ పాలన, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌గా, జలమండలి డెరైక్టర్‌గా... ఎస్పీగా నియామకమైన రమా రాజేశ్వరి రంగారెడ్డి జిల్లా ఎస్పీగా, బి.శంకర్ వరంగల్ డిప్యూటీ కలెక్టర్ గా ఉన్నారు.

Videos

నా స్నేహితుడి కుమారుడు కిట్టు.. మనసున్న మంచి డాక్టర్ చంద్రశేఖర్..!

టీడీపీ మేనిఫెస్టో చూపించి సీఎం జగన్ అడిగే ప్రశ్నలకు ప్రజలు ఏం చెప్పారో చూస్తే..!

2 లక్షల కోట్ల డ్రగ్స్ కంటైనర్ వదినమ్మ బంధువులదే..!

ఈనాడు ఆ వీడియో ఎందుకు తీసేసింది ? ల్యాండ్ టైటిలింగ్ చట్టంపై సీఎం జగన్..

పీవీ రమేష్ ల్యాండ్ బండారాన్ని బయటపెట్టిన పేర్ని నాని

మచిలీపట్నం బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌

తుస్సుమన్న చంద్రబాబు సభ మందుబాబుల రచ్చ..మహిళలతో

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై పీవీ రమేష్ ట్వీట్ దేవులపల్లి అమర్ ఓపెన్ ఛాలెంజ్

AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా

పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల

Photos

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)