amp pages | Sakshi

పంజగుట్టలో అక్రమ నిర్మాణాలు కూల్చివేత

Published on Sat, 10/01/2016 - 17:03

బంజారాహిల్స్ : బంజారాహిల్స్ రోడ్ నెం.3 ఖైరతాబాద్ మండల పరిధిలోని పంజగుట్ట హిందూ శ్మశాన వాటికలో నిర్మించిన అక్రమ కట్టడాలను శనివారం భారీ పోలీసు బందోబస్తు మధ్య జీహెచ్‌ఎంసీ అధికారులు కూల్చివేశారు. శ్మశాన వాటికలో అమ్మవారి గుడిని అడ్డుగా పెట్టుకొని నిర్మించిన పది గదులను నేలమట్టం చేశారు. కొంతకాలంగా అమ్మవారి గుడి పక్కన అక్రమ నిర్మాణాలు జోరుగా వెలుస్తుండగా పంజగుట్ట హిందూ శ్మశానవాటిక కమిటీతోపాటు స్థానికులు కొందరు జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు చేశారు. గత నాలుగేళ్ల నుంచి ఫిర్యాదులు చేస్తున్నా అధికారులు స్పందించలేదు. ఇటీవల నాలాలు, చెరువుల ఆక్రమణలను కూల్చివేయాలని స్వయంగా మంత్రి కేటీఆర్ ఆదేశించడంతో ఇదే అదనుగా జీహెచ్‌ఎంసీ సర్కిల్-10(బి) అధికారులు శ్మశాన అక్రమ నిర్మాణాల తొలగింపుకు రంగంలోకి దిగారు.

బంజారాహిల్స్ పోలీసులు వంద మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేయగా అధికారులు బుల్డోజర్లు, జేసీబీల సహాయంతో గదులన్నింటిని నేలమట్టం చేశారు. అమ్మవారి గుడికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఆక్రమణలను తొలగించారు. ఈ సందర్భంగా అక్రమ నిర్మాణాల కూల్చివేతను అడ్డుకునేందుకు ఒకరిద్దరు ప్రయత్నించగా పోలీసులు వారిని వారించారు. మూడు రోజుల నుంచి శ్మశానంలో అక్రమ నిర్మాణాలు కూల్చివేసేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రయత్నించగా స్థానికులు తీవ్రంగా ప్రతిఘటించడంతో వాయిదా పడుతూ వచ్చినా ఎట్టకేలకు కూల్చివేతల కార్యక్రమం పూర్తయింది. ఈ ప్రాంతాన్ని జీహెచ్‌ఎంసీ అధికారులు ఫెన్సింగ్ వేసి రక్షిస్తారా, మళ్లీ గాలికొదిలేస్తారా అన్నది చూడాల్సి ఉంది.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)