amp pages | Sakshi

అటు నుంచి ఇటు... ఇటు నుంచి అటు

Published on Mon, 08/21/2017 - 04:00

  • తెలంగాణ–ఏపీల మధ్య ఉద్యోగుల పంపకానికి అంగీకారం
  • సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ, ఏపీల్లోని ఉద్యోగుల పరస్పర మార్పిడిపై కసరత్తు మొదలైంది. రాష్ట్ర విభజన అనంతరం కమలనాథన్‌ కమిటీ అధ్వర్యంలో చేపట్టిన ఉద్యోగుల  పంపిణీ ప్రక్రియ ముగిసింది. దామాషా పద్ధతి, పోస్టుల సంఖ్య, ఉద్యోగుల ఆప్షన్లు, స్థానికతను  పరిగణనలోకి తీసుకోవటంతో తెలంగాణ స్థానికత ఉన్న ఉద్యోగులు కొందరు ఏపీకి, ఏపీ స్థా నికతకు చెందినవారు తెలంగాణ కు పంపిణీ అయ్యారు.

    కమలనాథన్‌ కమిటీ ఇచ్చిన తుది  కేటాయింపులు కావటంతో రెండు రాష్ట్రాలు ఆమోదించినా స్థానికేతర రాష్ట్రాలకు పంపిణీ అయిన  ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. తమను సొంత రాష్ట్రానికి పంపాలని కమిటీకి అర్జీలు పెట్టుకున్నారు. ఇటీవల రెండు రాష్ట్రాలు మంత్రుల ఆధ్యర్యంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీలు  గవర్నర్‌ సమక్షంలో జరిపిన చర్చల్లో ఈ అంశం చర్చకొచ్చింది. తుదిసమావేశ నిర్ణయం వే ురకు ఏపీ నుంచి ఎంతమంది ఉద్యోగులొస్తే.. తెలంగాణ నుంచి అంతమందిని పంపాలని ఇరు రా ష్ట్రాలు ఓ అంగీకారానికొచ్చాయి. అంటే సమాన సంఖ్య లో పరస్పర మార్పిడి. సంబంధిత విధివిధా నాలపై  అధికారులు కసరత్తు చేస్తున్నారు.

    13 మంది గెజిటెడ్‌ అధికారుల మార్పిడి..
    వచ్చిన అర్జీల ప్రకారం.. ప్రస్తుతం ఏపీ స్థానికత ఉండి తెలంగాణలో పనిచేస్తున్న గెజిటెడ్‌ అధికారుల్లో 117 మంది ఏపీకి వెళ్లేం దుకు దరఖాస్తు చేసుకున్నారు. ఏపీలో పని చేస్తున్న గెజిటెడ్‌  అధికారుల్లో తెలంగాణకు చెందిన వారు 13 మంది. సమాన సర్దుబాటు ప్రకారం ఏపీలో ఉన్న 13మం దిని తెలంగాణకు పంపి, తెలంగాణలోని 117 మందిలో 13 మందిని ఏపీ తీసుకోవాల్సి ఉంటుంది. నాన్‌ గెజిటెడ్‌  అధికారుల్లో 61 మంది ఏపీకి చెందిన వారు తెలంగాణలో పనిచేస్తుండగా, 240 మంది తెలంగాణ వాళ ్లు ఏపీలో పనిచేస్తున్నా రు.

    61 మందిని తీసుకుని 240 మందిలో 61 మందిని ఏపీకి పంపించాలి. నాలుగో తరగతి  ఉద్యోగుల్లో ఏపీవాళ్లు నలుగురే తెలంగాణలో పనిచేస్తుండగా, 800 మంది తెలంగాణ స్థానికతున్నవారు ఏపీలో ఉన్నారు. ఆ 800 మందిలో ఎవరిని పంపాలన్న విషయంలో సినియారిటీని పరిగణనలోకి తీసుకునే అవకా శాలున్నాయి. కొత్తగా రెండు రాష్ట్రాలు తీసుకున్న ఈ నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Videos

ఫ్రెండ్‌ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్‌ (ఫోటోలు)

రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి

పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు

నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్

చంద్రబాబుపై రైతుల ఆగ్రహం

టీడీపీ నేతల రౌడీయిజం.. YSRCP నేతలపై దాడులు

దాడులకు పబ్లిక్ గా బరితెగించిన లోకేష్

అట్టర్ ప్లాప్ .. పవన్ కళ్యాణ్ స్పీచ్ పబ్లిక్ జంప్

బాబు షర్మిల సునీతల అసలు ప్లాన్ ఇదే..!

Photos

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)