amp pages | Sakshi

కందిపప్పు టెండర్లపై కదిలిన సర్కార్

Published on Tue, 01/26/2016 - 20:05

- తక్కువ ధరలకే కోట్ చేసేలా మిల్లర్లతో చర్చలు

హైదరాబాద్

 రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా రేషన్ లబ్ధిదారులకు సరఫరా చేసే రాయితీ కందిపప్పు సేకరణపై ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. వచ్చే మూడు నెలల కాలానికి పప్పు సేకరణ, తక్కువ ధరకే టెండర్లు వేసేలా దాల్ మిల్లర్లతో చర్చలు ఆరంభించింది. మంగ ళవారం రాష్ట్ర ఆర్ధిక, పౌరసరఫరాల శాఖా మంత్రి ఈటల రాజేందర్, పౌర సరఫరాల శాఖ కమీషనర్ రజత్‌కుమార్‌లు దాల్ మిల్లర్లతో సచివాలయంలో చర్చలు జరిపారు. రెండు, మూడు రోజుల్లో కందిపప్పు టెండర్లు పిలువనున్న నేపథ్యంలో మంత్రి మిల్లర్లతో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గతంతో పోలిస్తే కంది సాగు విస్తీర్ణం పెరగడం, మార్కెట్‌లో ధర తగ్గిన దృష్ట్యా తక్కువ ధరలకే టెండర్ కోట్ చేసి ప్రభుత్వానికి సహకరించేలా మిల్లర్లకు విజ్ఞప్తి చేశారు. సరైన సమయానికి పప్పు అందించడంతో మిల్లర్లు విఫలమవుతున్నందున ప్రస్తుత టెండర్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ నిర్నయం చేసినట్లు మంత్రి వారికి వివరించినట్లుగా తెలిసింది. ఇదే సందర్భంగా..ప్రభుత్వం నిరుపేదలకు రాయితీతో కూడిన పప్పును ఇస్తున్నందున మిల్లర్లు ప్రభుత్వానికి సరసమైన ధరకు పప్పు అందివ్వాలని కోరారు.

ధర విషయంలో మిల్లర్లు ఆలోచించి నిర్ణయం చేయాలని విన్నవించారు. నాణ్యత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, లోకల్ క్వాలిటీని సరఫరా చేయాలని సూచించారు. నాసిరకం పప్పును సరఫరాచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. పేదలకు అందాల్సిన పప్పును పక్కదారి పట్టించినా, రీ సైక్లింగ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Videos

టీడీపీపై ఈసీ సీరియస్..

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సజ్జల కామెంట్స్

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)