amp pages | Sakshi

తెలంగాణను మోసం చేసింది 'ఆ ఇద్దరే'

Published on Tue, 04/15/2014 - 12:44

తెలంగాణను మోసం చేసింది టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్లే అని కాంగ్రెస్ పార్టీ ఎంపీలు గుత్తా సుఖేందర్ రెడ్డి జి.వివేక్లు ఆరోపించారు. మంగళవారం వారు హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ... తెలంగాణ పునర్నిర్మాణం కేసీఆర్తో సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఎన్నికల్లో కేసీఆర్ సీట్లు అమ్ముకున్నారని ఆరోపించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి ఉద్యమద్రోహులకు కేసీఆర్ టిక్కెట్లిచ్చారని వారు విమర్శించారు.

తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ను పార్టీలో విలీనం చేస్తామని టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీష్లు కాంగ్రెస్ అధిష్టానానికి మాట ఇచ్చారని గుత్తా, వివేక్లు గుర్తు చేశారు. ఇచ్చిన మాటను టీఆర్ఎస్ విస్మరించిందని అన్నారు. కానీ తెలంగాణ ఇస్తామన్న మాటకు తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా కట్టుబడి... తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసి ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్నారని తెలిపారు.

తెలంగాణ బొగ్గు గని కార్మిక సంస్థను సరిగ్గా నడపలేని కేసీఆర్.... తెలంగాణను ఎలా పునర్నిర్మిస్తాంటూ వివేక్ టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ను సూటిగా ప్రశ్నించారు. గుజరాత్ లోని గోద్రా అల్లర్లకు ముఖ్య కారకుడు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి  మోడీ అని గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారని వారు గుర్తు చేశారు. అలాంటి బాబు ప్రస్తుతం మతోన్మాద శక్తులకు ఎందుకు మద్దతిస్తున్నారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

Videos

ఇదా చంద్రబాబు మేనిఫెస్టో అని మోదీ కూడా కన్ఫ్యూజన్ లో ఉన్నాడు

అకాల వర్షం..అపార నష్టం

హైదరాబాద్ లో వర్ష బీభత్సం..సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

ఇచ్చాపురం జనసంద్రం..

పార్టీ పెట్టి పదేళ్ళయింది..ఏం పీకావ్..పవన్ కి ముద్రగడ పంచ్

పేదల నోట్లో మట్టి కొట్టిన సైకో.. రైతులు, విద్యార్థులపై బాబు కుట్ర

"పవన్ కళ్యాణ్ కు ఓటు వెయ్యం "..తేల్చి చెప్పిన పిఠాపురం టీడీపీ

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?