amp pages | Sakshi

‘జీ’ అని ఉంటే ప్రభుత్వ భూమేనా?

Published on Thu, 03/22/2018 - 01:01

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నాంపల్లి మండలం ఆగాపురలోని ఓ ప్రైవేటు ఆస్తి విషయంలో రెవెన్యూ అధికారుల తీరును హైకోర్టు తప్పుపట్టింది. ప్రైవేటు ఆస్తి అని చెబుతున్న దానికి సంబంధించి టౌన్‌ సర్వే ల్యాండ్‌ రికార్డుల్లో (టీఎస్‌ఎల్‌ఆర్‌)లో ‘జీ ’అని ఉందని, జీ అంటే గవర్నమెంట్‌ ల్యాండ్‌ అని ప్రభుత్వం వాదించడం పట్ల విస్మయం వ్యక్తం చేసింది. ‘‘రేపు మీరు నా ఇంటి విషయంలో కూడా రికార్డుల్లో జీ అని రాసేస్తే, నేను నా ఇంటిపై యాజమాన్య హక్కులను నిరూపించుకునేందుకు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలా?’’అని నిలదీసింది.

ఆ ఆస్తి మీది(ప్రభుత్వం) అని భావిస్తే సివిల్‌ కోర్టుకెళ్లి తేల్చుకోవాలంది. 4 నెలల్లో సివిల్‌ కోర్టును ఆశ్రయించకుంటే, ప్రైవేటు వ్యక్తికి అనుకూలంగా సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ఆగాపురలో కమల్‌కిషోర్‌ అగ ర్వాల్‌ అనే వ్యక్తికి చెందిన 558.5, 870 చదరపు గజాల స్థలాన్ని అధికారులు టీఎస్‌ఎల్‌ఆర్‌లో ప్రభుత్వ భూమిగా పేర్కొన్నారు. దీనిప్రకారం కిషోర్‌ను భూ ఆక్రమణదారుగా పేర్కొంటూ, ఆ భూమిని ఖాళీ చేసి వెళ్లాలని నోటీసులు ఇచ్చారు. దీనిపై కమల్‌కిషోర్‌ 2011లో హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన సింగి ల్‌ జడ్జి ప్రభుత్వ నోటీసులను రద్దు చేశారు.

దీనిపై రెవెన్యూ అధికారులు గతేడాది ధర్మాసనం ముందు అప్పీల్‌ చేశారు. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం రెవెన్యూ శాఖ న్యాయవాది వాదనలను తోసిపుచ్చింది. ప్రభుత్వాన్ని సివిల్‌ కోర్టుకెళ్లి తేల్చుకోవాలనడం సరికాదన్న వాదననూ తోసిపుచ్చింది. 4 నెలల్లో సివిల్‌ కోర్టుకెళ్లాలని, లేనిపక్షంలో సింగిల్‌ జడ్జి తీర్పు అమల్లోకి వస్తుందని చెప్పింది.

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)