amp pages | Sakshi

10 మంది డీసీలకు ఐఏఎస్‌ హోదా

Published on Tue, 01/23/2018 - 02:23

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రానికి చెందిన 10 మంది డిప్యూటీ కలెక్టర్ల(డీసీ)లకు  ఐఏఎస్‌ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం డిప్యూటీ కలెక్టర్‌ హోదాలో ఉన్న కొర్రా లక్ష్మి, కె.ధర్మారెడ్డి, చిట్టెం లక్ష్మి, టి.వినయ్‌ కృష్ణారెడ్డి, సీహెచ్‌ శివలింగయ్య, వి.వెంకటేశ్వర్లు, ఎం.హనుమంతరావు, డి.అమయ్‌కుమార్, కె.హైమవతి, ఎం.హరితకు ఐఏఎస్‌ హోదా (కన్ఫర్డ్‌ ఐఏఎస్‌) కల్పిస్తూ సోమవారం కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల విభాగం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ప్రమోషన్‌ కోటాలో రాష్ట్ర కేడర్‌కు చెందిన ఐఏఎస్‌ ఖాళీల్లో వీరిని భర్తీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను పరిశీలించిన కేంద్రం ఈ ప్రమో షన్ల జాబితాలను విడుదల చేసింది. 2014 బ్యాచ్‌ ఖాళీలకు అర్హులెవరూ లేరని, అందుకే ఆ జాబితాను తయారు చేయలేదని సెలెక్షన్‌ కమిటీ ప్రకటించినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. 2015 సంవత్సరపు ఖాళీల్లో కొర్రా లక్ష్మి, కె.ధర్మారెడ్డి, 2016 ఖాళీల్లో మిగతా 8 మందిని ఎంపిక చేసింది.

ఐఏఎస్‌ పదోన్నతులకు సంబం ధించి ఎ.వాణీప్రసాద్, వి.కరుణ, ఎం.ప్రశాంతి దాఖలు చేసిన కేసుల్లో కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్‌ (సీఏటీ) ఇచ్చిన తీర్పుపై కేంద్రం హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో సెలెక్షన్‌ కమిటీ సిఫారసులు హైకోర్టు ఇచ్చే తీర్పునకు లోబడి ఉంటాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కాగా, కేంద్ర ఉత్తర్వులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం 10 మంది అధికారులకు ఐఏఎస్‌ హోదా కల్పిస్తూ గెజిట్‌లో పొందుపరిచినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.  

Videos

పథకాలు ఆపగలరేమో.. మీ బిడ్డ విజయాన్ని ఎవరూ ఆపలేరు

దద్దరిల్లిన రాజానగరం

చంద్రబాబుపై నాన్-స్టాప్ పంచులు: సిఎం జగన్

కూటమిపై తుప్పు పట్టిన సైకిల్ స్టోరీ.. నవ్వులతో దద్దరిల్లిన సభ

వీళ్లే మన అభ్యర్థులు మీరేగెలిపించాలి..!

మళ్లీ వచ్చేది మీ బిడ్డ ప్రభుత్వమే..!

చంద్రబాబుకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు

పేదల పథకాలపై కూటమి కుట్ర..!

బాపట్ల లో టీడీపీ కి భారీ ఎదురుదెబ్బ.. YSRCPలో చేరిన కీలక నేత

చంద్రబాబు బెయిల్ రద్దు? సుప్రీంకోర్టులో విచారణ

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?