amp pages | Sakshi

అక్రమాల ‘భండారం’!

Published on Fri, 07/07/2017 - 09:14

సాక్షి, సిటీబ్యూరో: నిజాంపేటలోని సర్వే నంబర్‌ 52, 53, 54లో ఓ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ 20కి పైగా విల్లాల నిర్మాణం చేపట్టింది. దాదాపు ఇవి పూర్తికావచ్చాయి. వీటికి హెచ్‌ఎండీఏ నుంచి బిల్డింగ్‌ పర్మిషన్‌ లేకుండానే అక్రమంగా సెల్లార్‌ను కూడా నిర్మించేశారు. గతేడాది డిసెంబర్‌లో ఈ అక్రమ నిర్మాణం విషయం హెచ్‌ఎండీఏ దృష్టికి రావడంతో పాక్షికంగా కూల్చివేసింది. ఆ తర్వాత కొంతకాలం పాటు ఈ నిర్మాణం ఆపేసి మళ్లీ  మొదలెట్టారు. దీంతో హెచ్‌ఎండీఏ అధికారులు గత జూన్‌ 30వ తేదీన ఇది అక్రమ నిర్మాణమంటూ మరోసారి నోటీసు జారీ చేశారు.

ఈ ఒక్కటే కాదు...ఇటువంటి అక్రమ భవన నిర్మాణాలు నిజాంపేట గ్రామ పంచాయతీ పరిధిలో కొకొల్లుగా పుట్టుకొస్తున్నాయి. అనుమతుల్లేవు...అడ్డగోలుగా అంతస్తుల మీద అంతస్తులు కట్టేశారు...కట్టిస్తూనే ఉన్నారు. వారికి గ్రామ పంచాయతీ నోటీసులు పట్టవు...హెచ్‌ఎండీఏ నోటీసులను కూడా బేఖాతరు చేస్తారు. రాజకీయ నేతల అండదండలు ఉండటంతో ఏకంగా నిబంధనలకే పాతరేస్తున్నారు. గతేడాది నవంబర్‌లో కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన నింజాంపేట భండారి లే అవుట్‌లో అక్రమ నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేసినా అవి ఇప్పుడు పూర్తిస్థాయిలో నిర్మాణాన్ని సంతరించుకున్నాయి. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ ఆ భవనాలను పూర్తిగా నేలమట్టం చేయాలని ఆదేశాలిచ్చినా  అమలుకాలేదు. అక్రమ భవన నిర్మాణాలు యథావిధిగా కొనసాగుతున్నాయి.  

అన్నిచోట్లా నిబంధనలకు పాతరే..
గతేడాది నవంబర్‌లో వరద ముంపునకు గురైన నిజాంపేటలోని భండారి లే అవుట్‌లో 12 మీటర్లకు మించి (జీప్లస్‌ 2 కంటే ఎక్కువ) భవనాన్ని నిర్మించాలంటే ఖచ్చితంగా హెచ్‌ఎండీఏ నుంచి అనుమతి తీసుకోవాలి. అనుమతి ఇచ్చే అధికారం గ్రామ పంచాయతీకి లేదు. అయితే అందుకు విరుద్ధంగా ఏకంగా ఆయకట్టు భూమిలో బహుళ అంతస్తుల భవనాలను నిర్మిస్తున్నారు. అయినా అధికారులెవరూ ఇటువైపు కన్నెత్తి చూడడం లేదు. ఈ వ్యవహారం నిజాంపేట బండారి లే అవుట్‌లో నిత్యకృత్యంగా మారింది. అయితే  నిర్మాణ సమయంలో నిబంధనలనైనా పాటించారా అంటే అదీ లేదు. ఎక్కడా సెట్‌బ్యాక్‌ను పట్టించుకోవడం లేదు. 30 అడుగుల అప్రోచ్‌ రోడ్ల జాడే కనపడదు. కొందరు గ్రామ పంచాయతీ నుంచి జీ ప్లస్‌ అనుమతులు తీసుకొని...ఏకంగా ఐదు, ఆరు, ఏడు అంతస్తుల్ని నిర్మించేశారు.

ఇదంతా పక్కన పెడితే...తురక చెరువు ఆయకట్టు భూముల్లోనే వెలిసిన ఈ లే అవుట్‌కు ఎగువన ఉండే బాచుపల్లి తదితర ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుంది. అది నిండగానే అక్కడి నుంచి కాలువ ద్వారా పాపయ్య కుంటకు వస్తుంది. బిల్డర్లు కాసుల కక్కుర్తితో నీటిని చేరవేసే ఆ కాలువనే పూడ్చి రోడ్లను నిర్మించారనే విషయం గతేడాది సెప్టెంబర్‌లో కురిసిన వర్షాల పుణ్యామా అని వెలుగుచూసింది. దీంతో గతేడాది డిసెంబర్‌లో హెచ్‌ఎండీఏ మొదలు పంచాయతీ, రెవెన్యూ ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం చుట్టి అనుమతుల్లేని భవనాలను గుర్తించి నోటీసులు జారీ చేశారు. దాదాపు 50 వరకు అక్రమ భవన నిర్మాణాలను పాక్షికంగా కూల్చేశారు. అయితే ఇప్పుడు ఆ నిర్మాణాలన్నీ పూర్తయ్యాయి. ఒక్క భవన నిర్మాణమూ ఆగిపోలేదు.  

వర్షం పడితే ముంపు తప్పదా...?
నిజాంపేట భండారీ లే అవుట్‌లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాల వల్ల మరోసారి ముంపు తప్పదా అన్న భయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. గతేడాది గుర్తించి పాక్షికంగానే కూల్చివేసిన భవనాలను మళ్లీ పూర్తిస్థాయిలో నిర్మిస్తుండడంతో వరద ముంపును ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. అక్రమ నిర్మాణాలు పుట్టుకొస్తున్నా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరించడం, పీకలమీదకు వచ్చాక నోటీసులు జారీ చేసి పాక్షికంగా కూల్చడం పరిపాటిగా మారిందని, పూర్తిస్థాయిలో చర్యలు తీసుకుంటేనే ఇక్కడ ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని స్థానికులు అభ్యర్థిస్తున్నారు. ఈ విషయంలో జాప్యం జరగకుండా వెంటనే రంగంలోకి దిగాలని కోరుతున్నారు.


గతంలో పాక్షికంగా కూల్చివేసిన ఓ భవనం...

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)