amp pages | Sakshi

అల్లరి చేస్తోందని వాతలు

Published on Wed, 12/03/2014 - 00:04

ఓ తల్లి ఘాతుకం బాపూజీనగర్‌లో ఘటన
 
బంజారాహిల్స్:  అల్లరి చేస్తున్న చిన్నారిని లాలించి.. బుజ్జగించాల్సిన తల్లే రాక్షసిలా మారింది... కన్నబిడ్డ అనే కనికరం లేకుండా గరిటెతో వాతలు పెట్టింది. తీవ్రగాయాలకు గురైన ఆ చిన్నారిని చూసి స్థానికులు కంటతడి పెట్టారు.  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... ఎస్పీఆర్ హిల్స్ బాపూజీనగర్‌లో నివసించే వాణి, ఆంజనేయులు దంపతులకు ఇద్దరు కూతుళ్లు. మద్యానికి బానిసైన భర్త ఇంటికి రాకుండా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. దీంతో వాణి  ఓ ఇంట్లో పని చేస్తూ పిల్లలను పోషిస్తోంది. పెద్ద కూతురు సోని (5) ఇదే బస్తీలో అంగన్‌వాడి కేంద్రంలో చదువుతోంది. ఈ చిన్నారి ఎక్కువగా అల్లరి  చేస్తుంది. చుట్టుపక్కల చిన్నారులతో ఆడుకొనే సమయంలో తన కొంటెతనాన్ని చూపించి తల్లికి తలనొప్పి తెస్తోంది. ఈ నేపథ్యంలో తల్లి సోనిని రోజూ దండిస్తోంది. ఇదిలా ఉండగా... సోమవారం ఉదయం తల్లి దిండు కింద దాచిన రూ. 100ను సోని తీసుకొని సమీపంలోని షాపులో తినుబండారాలు కొనుక్కుంది. తనకు తెలియకుండా  డబ్బులు తీసుకుందని, రోజు రోజుకూ కూతురు అల్లరి ఎక్కువైందనే కోపం.. భర్త ఇంటిపట్టున ఉండటం లేదన్న బాధ.. ఈనేపథ్యంలో సహనం కోల్పోయిన వాణి సోమవారం ఉదయం గరిటెను బాగా కాల్చి చిన్నారి సోని కాళ్లు, చేతులు, కడుపు, బుగ్గలపై రెండువైపులా వాతలు పెట్టింది. 

చిన్నారి పెద్దగా ఏడుస్తూ బయటకు పరుగు తీయబోగా... లోపలి నుంచి గడియపెట్టి మళ్లీ వాతలు పెట్టింది. దీంతో చిన్నారి కుప్పకూలిపోయింది. వెంటనే వాణి కూతురిని సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించి.. ఇంట్లోనే బంధించింది.  చిన్నారి పరిస్థితి చూసి చలించిన స్థానికులు ఈ విషయాన్ని మీడియాకు తెలియజేశారు. మీడియా పోలీసుల సహకారంతో బాలికకు విముక్తి కలిగించారు. బాలికను ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు.  తల్లిపై సుమోటోగా కేసు నమోదు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
 
అత్యంత దారుణం: బాలాల హక్కుల సంఘం

సిటీబ్యూరో: చిన్నారి సోనిపై తల్లి వాతలు పెట్టిన ఘటనను బాలల హక్కుల సంఘం తీవ్రంగా ఖండించింది. తల్లిదండ్రలే కన్న బిడ్డను హింసించడం అత్యంత దారుణమని సంఘం అధ్యక్షురాలు అనురాధరావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఇలాంటి ఘటనలపై పోలీసులు త్వరగా విచారణ జరిపి శిక్ష విధిస్తే మరొకరు నేరం చేయరని ఆమె పేర్కొన్నారు.
 
 

Videos

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)