amp pages | Sakshi

లైఫ్ సర్టిఫికెట్ ఇస్తేనే ఇకపై ‘ఆసరా’!

Published on Sat, 04/09/2016 - 00:20

♦ మూడు నెలలకోమారు తప్పనిసరి చేస్తూ సర్కారు నిర్ణయం
♦ 4,500 మీ సేవాకేంద్రాలకు బయోమెట్రిక్ విధానానికి అనుమతి
♦ మే 1నుంచి 20లోగా ఇవ్వకుంటే జూన్ నెలలో పెన్షన్ రానట్లే
♦ తొలిదశలో పట్టణ ప్రాంతాల్లోని 10 లక్షలమంది పెన్షనర్లకు వర్తింపు
 
 సాక్షి, హైదరాబాద్: ఆసరా పెన్షనర్లు పింఛన్ పొందాలంటే తాము బతికి ఉన్నట్లుగా ధ్రువీకరణను తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35.85 లక్షలమంది పెన్షనర్ల లో సుమారు 10 లక్షల మందికి పెన్షన్ సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారు. దీంతో సరైన సమాచారం లేక మరణించిన పెన్షనర్ల ఖాతాలకు కూడా పింఛన్ సొమ్ము వెళుతున్నట్లు పలు జిల్లాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.

ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్‌ను తీసుకుంటున్నవారు ఇకపై  ప్రతి మూడు నెలలకోమారు తాము బతికే ఉన్నట్లుగా  ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. మే నెల 1నుంచి 20వ తేదీలోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పిం చిన పెన్షనర్లకే జూన్‌లో పింఛన్ అందుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తొలిదశలో ఈ విధానాన్ని పట్టణ ప్రాంతాల్లోని సుమారు 10 లక్షలమంది పెన్షనర్లకు వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. పోస్టాఫీసులు, పంచాయతీ కార్యాల యాల నుంచి పెన్షన్ పొందుతున్నవారికి కూడా త్వరలోనే పెన్షన్‌ను బ్యాంకు ఖాతాల ద్వారా అం దించే ఏర్పాటు చేస్తామని, అప్పట్నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని పెన్షనర్లకు కూడా లైఫ్ సర్టిఫికెట్ నిబంధనను వర్తింపజేస్తామని చెబుతున్నారు.

 4,500 మీసేవా కేంద్రాలకు అథెంటికేషన్
 ఆసరా పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు మూడు నెలలకోమారు లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చేం దుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,500 మీసేవాకేంద్రాలకు బయోమెట్రిక్, ఐరిస్ అథెం టికేషన్ సదుపాయాన్ని కల్పించింది. లబ్ధిదారులు  మీసేవా కేంద్రానికి వెళ్లి ఐరిస్ ద్వారా కనుపాపలను సరిపోల్చడంతోగానీ, వికలాంగులు(అంధులు) బయోమెట్రిక్(వేలిముద్ర) ద్వారాగానీ తమ ధ్రువీకరణను సమర్పించాలి. ధ్రువీ కరణ కోసం మీసేవ కేంద్రానికి లబ్ధిదారులు ఆధార్ గానీ, పెన్షన్ ఐడీ నెంబరునుగానీ వెంట తీసికెళ్లాలి. ఈ ప్రక్రియ పూర్తికాగానే మీసేవా సిబ్బంది లబ్ధిదారుకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించి నట్లుగా  రశీదు అందజేస్తారు. దీనికిగాను 20 రూపాయలు చెల్లించాలి. ఇలా ఏడాదికి రూ.80 మీసేవా కేంద్రానికి సమర్పించుకోవాల్సిందే.
 
 పెన్షనర్లకు ఇది ఇబ్బందికరం..
 ఆసరా పింఛన్‌దారులు మీ సేవాకేంద్రాలకు వెళ్లి లైఫ్ సర్టిపికెట్లు సమర్పించడం ఇబ్బం దికరమే. అంధులైన పెన్షనర్లకు ఐరిస్‌తో ధ్రువీకరణ, చాలామంది(లెప్రసీ వంటి) వికలాంగులు, వృద్ధులకు బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలను సరిపోల్చడం వీలుకాదు. పింఛ న్ సొమ్ము నుంచి ప్రతిసారి రూ.20 మీసేవాకేంద్రానికి  ఇవ్వడం ఇబ్బందికరమే. దానిని ప్రభుత్వమే భరించాలి.
     - కొల్లి నాగేశ్వరరావు, వికలాంగుల హక్కుల సంఘం నేత

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)