amp pages | Sakshi

ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ బదిలీ

Published on Mon, 11/03/2014 - 01:14

‘సాక్షి’ వరుస కథనాలతో కదలిన సర్కారు
టెండరు లేకుండా రూ.3 కోట్ల ఫర్నిచర్ కొనుగోలు
వెంటిలేటర్ల టెండర్లపైనా విమర్శలు
మందుల నాణ్యత డొల్లే

 
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్‌ఐడీసీ)లో జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’ వరుస కథనాలతో ప్రభుత్వం స్పందించింది. మందులు, యంత్రాల కొనుగోలు, కాంట్రాక్టర్ల నుంచి నాసిరకం ఔషధాలు తీసుకోవడం, హెచ్‌ఐవీ కిట్‌లు, వెంటిలేటర్లు కొనుగోలులో అవకతవకలపై సర్కారు కదలింది. ఆదివారం జరిగిన ఐఏఎస్‌ల బదిలీలలో ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఎం.రవిచంద్రను బదిలీ చేశారు. అయితే ఎండీ ద్వారా అనూహ్యంగా మేనేజర్ స్థాయి పదవులు పొందిన లాజిస్టిక్ మేనేజర్‌ను బదిలీ చేస్తారా లేక ఇక్కడే కొనసాగిస్తారా? అనే చర్చ జరుగుతోంది.

లాజిస్టిక్ మేనేజర్‌పై ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఏపీఎంఎస్‌ఐడీసీలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులకు వైద్య పరికరాల కొనుగోలు తీరే దీనికి నిదర్శనం. హెచ్‌ఐవీ కిట్ల కొనుగోలుపై తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న సంస్థ అధికారులు, ఇరు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా ఎలాంటి టెండరు లేకుండా ప్రభుత్వాసుపత్రులకు రూ.3 కోట్ల విలువైన ఫర్నిచర్ కొనుగోలు చేశారు. డ్రగ్స్ అండ్ డిస్పోజబుల్స్ పేరుతో నేరుగా కొన్నారు. టెండరు ద్వారా కొంటే కనీసం 50 శాతం రేటు తగ్గే అవకాశమున్నా తమకు అనుకూలమైన వ్యక్తికి కాంట్రాక్టు కట్టబెట్టారు.

తెలంగాణ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు
ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులపై చాలామంది వైద్యులు తెలంగాణ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వైద్యుల కమిటీకి ఎలాంటి ప్రాధాన్యం లేదని, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీతో పాటు మరో ఫార్మసిస్ట్ తమ నివేదికలను బుట్టదాఖలు చేస్తున్నారని, అలాంటప్పుడు కమిటీలు ఎందుకని ఫిర్యాదు చేశారు. ఓ ఫార్మసిస్ట్‌కు లాజిస్టిక్ మేనేజర్‌గా పదవులు కట్టబెట్టడంపై ఆ శాఖకు చెందిన అధికారులే ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.తమను ఇతర విభాగానికి బదిలీ చేయాలని కోరినట్లు తెలిసింది. ఎండీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకుఫిర్యాదులు రావటంతో బదిలీ వేటు పడినట్లు తెలిసింది.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)