amp pages | Sakshi

లిఫ్ట్ తలపై పడి ఒకరి మృతి

Published on Thu, 11/13/2014 - 01:15

హైదరాబాద్: సరిగా పనిచేయని లిఫ్ట్‌ను ఉపయో గించబోయి.. అది తలపై పడడంతో బుధవారం డి.శ్రీనివాస్ అనే వ్యాపారి మృతి చెందాడు. హైదరా బాద్ చింతల బస్తీలోని భవిష్య్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీనివాస్‌కు భార్య సునీత, ముగ్గురు పిల్లలు మౌనిక, రితిక, ముకుంద్ ఉన్నారు.  ఉదయం 7.30 గంటల సమయంలో తన కుమారుడు ముకుంద్‌ను స్కూల్‌కు పంపేందుకు శ్రీనివాస్ లిఫ్ట్ వద్దకు వచ్చారు. అక్కడి బటన్‌ను రెండు మూడు సార్లు నొక్కినా లిఫ్ట్ రాకపోవడంతో చెక్క తలుపు మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలోంచి లోపలకు తల పెట్టి చూశారు. అదే సమయంలో లిఫ్టు పైనుంచి వేగంగా కిందకు వచ్చి శ్రీనివాస్ తలపై పడడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
 
 దీనిని గమనించిన చుట్టుపక్కల ఫ్లాట్ల వారు వెంటనే ఆయనను అంబులెన్స్‌లో బంజారాహిల్స్‌లోని కేర్ ఆస్పత్రికి తరలించారు. కానీ, శ్రీనివాస్ అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.  కాగా.. ఈ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ సరిగ్గా పనిచేయడం లేదని, దానిని ఉపయోగించవద్దని  నిర్వాహకులు సూచించినట్లు తెలిసింది. అయినా కొందరు  ఉపయోగిస్తున్నారు.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?