amp pages | Sakshi

నా భార్య నాకన్నా ఎత్తుంటే తప్పేముంది?

Published on Sun, 05/31/2015 - 00:28

ఈడు జోడు మారింది చూడు
 కాంబినేషన్‌లో కొత్త మార్పులు

 ‘అమ్మాయి ఆకాశంలో ఉంటే వీడేమో భూమ్మీద. పెళ్లంటే ఈడూ జోడూ కుదరకపోతే ఎలా?’ ఇలాంటి ప్రశ్నలకు కాలం చెల్లింది. ఈతరహాపాత తరపు అభిప్రాయాలను పట్టించుకోని నవతరం.. ఈడు విషయంలో అబ్బాయి కన్నా అమ్మాయి చిన్నగా ఉండాలంటూ పెట్టిన ఆంక్షలను ఇప్పటికే స్పష్టంగా తిప్పికొట్టేసింది. అదే వేగంతో ఇప్పుడు జోడు విషయంలోనూ మార్పులకు సై అంటోంది. తనకన్నా ఎత్తున్న అమ్మాయిలను తలెత్తుకుని చూడడానికి మాత్రమే కాదు ఆమెతో కలిసి ఏడడుగులు నడవడానికి కూడా అబ్బాయిలు ముందుంటున్నారు. పెళ్లి అనే వ్యవస్థలో పురుషుడికి ఎక్కువ అధికారాలు కట్టబెట్టిన సంప్రదాయం.. వయసులోనూ, ఆకారంలోనూ.. కూడా పురుషాధిక్యతకే పెద్ద పీట వేసింది. అమ్మాయికన్నా అబ్బాయి వయసు, ఎత్తు ఎక్కువుండాలని నిర్ధేశించింది. ప్రస్తుత తరం ఈ కాంబినేషన్ రూల్‌ని తోసిరాజంటోంది.     
 
 హైటెక్కినా.. ఓకే
 ‘నా భార్య నాకన్నా ఎత్తుంటే తప్పేముంది? అందులో నాకు చిన్నతనం అనిపించాల్సిన అవసరం ఏముంది?’ అని ప్రశ్నించారు పంజ గుట్టలో నివసించే మల్లీశ్వరరావు. తనకన్నా ఎత్తున్న శ్రీదేవిని ఆయన భార్యగా చేసుకున్నారు. ఈ విషయంలో ఆయన బంధువుల్లో కొందరు గుసగుసలాడకపోలేదు. అయితే దీన్ని ఆయన తేలిగ్గా తీసుకున్నారు. ‘మాది చింతపల్లి అనే పల్లెటూరు. అక్కడ భార్యకన్నా భర్త ఎత్తు తక్కువ ఉండడం అనేది నవ్వుకునే విషయమే. అయితే ఇదంతా తొలినాళ్లలోనే. ఇప్పుడు వాళ్లు కూడా ఈ విషయాన్ని పట్టించుకోవడం లేదు. మనసులు కలిసిన జంటలకు ఇవన్నీ చాలా చిన్న విషయాలు’అని చెప్పారాయన. అత్యాధునిక పోకడలను మోసుకొచ్చే ఫ్యాషన్ ర్యాంప్ మీద తరచూ మెరిసే సిటీ జంట ఆయేషా లఖోటియా, అజహర్ లఖోటియాలు సైతం ఈ విషయాన్ని ఎంతమాత్రం పట్టించుకోరు. ‘నా భార్య నాకన్నా హైట్ అనే విషయం నాకు గర్వంగానే అనిపిస్తుంది. నిజానికి షి ఈజ్ వెరీ గుడ్ లుకింగ్’ అంటారు అజహర్. ‘నేను హైట్ తక్కువున్నాను. నా కంటే తక్కువ హైట్ ఉన్న అమ్మాయిని చేసుకుంటే ఇద్దరికీ పుట్టే పిల్లలు మరీ పొట్టిగా పుట్టే అవకాశముంది. అందుకే నాకన్నా రెండు అంగుళాలు ఎక్కువున్న అమ్మాయిని పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నా’నన్నాడు శశాంక్.
 
 సినిమాలూ స్ఫూర్తి..
 ‘నా హైట్ చూసి హీరోలు నా పక్కన నటించడానికి ఇబ్బంది పడుతున్నారు. అదే నాకు మైనస్ అయింది’ అంటూ వాపోయింది కొంత కాలం క్రితం మాజీ మిస్ యూనివర్స్ సుస్మితాసేన్. అయితే, ఇప్పుడా పరిస్థితి పూర్తిగా తలకిందులైంది. దీపికా పదుకునే వంటి పొడుగుకాళ్ల బ్యూటీతో షారూఖ్, రణవీర్‌సింగ్ తదితర హీరోలు, సోనాక్షి సిన్హాతో షాహిద్ కపూర్ హాయిగా జట్టు కట్టేస్తున్నారు. ఆమీర్‌ఖాన్  (5.6 ఫీట్స్) కత్రినాకైఫ్ (5.9 ఫీట్స్)తో జంటగా నటనను పండిస్తున్నారు. రియల్ లైఫ్‌లోనూ ఒకరికొకరు అంటుకు తిరిగే సల్మాన్ (5.7), కత్రినాకైఫ్‌లు ఈ తరహా కాంబినేషన్‌కు నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు. ఇప్పుడు టాలీవుడ్ కూడా అదే బాట పట్టింది. కృతి సనన్ (5.9 ఫీట్స్) వంటి టాల్‌గాళ్‌తో నాగచైతన్య (5.7 ఫీట్స్) లాంటి కుర్ర హీరోలు హైట్‌ను పక్కన పెట్టి మరీ జోడి కట్టారు.
 
 ప్రముఖుల పెళ్లిళ్లూ...
 తనకన్నా వయసు, హైట్ కూడా ఎక్కువున్న అమ్మాయిని పెళ్లాడిన సచిన్ టెండూల్కర్ జంట కూడా ఈ విషయంలో యూత్‌కి ఇన్‌స్పిరేషనే. ‘నా భార్య నాకన్నా ఎత్తు ఎక్కువుండడం వల్ల నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది’ అని చెప్పే రాజ్‌పాల్ యాదవ్ లాంటి బాలీవుడ్ నటులు ఈ తరహా ట్రెండ్‌కు ప్రమోటర్లుగా మారారు. ఇక సినీనటి దేవయాని, డెరైక్టర్ రాజకుమరన్‌ల జంట కూడా మరో ఎగ్జాంపుల్. రానున్న కాలంలో ఈడు జోడు అనేది రివర్స్ అయి అబ్బాయికన్నా అమ్మాయే ఎక్కువ వయసుండాలని, ఎత్తుండాలని కొత్త సంప్రదాయం పుట్టుకొచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
 
 పొడవుతో గుడ్ లుక్..
 చిన్న తనం నుంచే పొడుగున్న అమ్మాయిలంటే ఇష్టం. వాళ్లలో కనబడే కాన్ఫిడెన్స్, గుడ్‌లుక్స్ బాగా ఇష్టం. అందుకేనేమో నాకన్నా ఎత్తుగా ఉందని అందరూ అంటున్నా వెనుకాడకుండా ఆయేషాని పెళ్లి చేసుకున్నాను. మీ వల్ల హైహీల్స్ వేసుకోవాలనే నా కోరిక తీరడం లేదు.. అంటూ ఆయేషా అనే సరదా మాటలు తప్ప మా మధ్య  మరే సమస్య లేదు.
 - అజహర్ లఖోటియా
 
 ఆదివారం ఆర్గానిక్ సందడి
 ఆర్గానిక్ ఫ్రూట్స్, కూరగాయలు, ఇంట్లో చేసిన బ్రెడ్స్, హ్యాండీక్రాఫ్ట్స్, హ్యాండ్‌మేడ్ జ్యువెలరీ.. ఇలా ఎన్నో ఆదివారం అంగట్లో లభిస్తాయి. అలాగే టై గార్డెనింగ్, క్రియేటివ్ డిజైన్ స్పేస్ గురించి తెలుసుకోవచ్చు. బంజారాహిల్స్‌లోని లామకాన్‌లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 2.30 వరకు ఇది కొనసాగుతుంది.
 
 వీర్‌దాస్ షో...
 ప్రసిద్ధ భారతీయ స్టాండప్ కమెడియన్ వీర్‌దాస్ నగరంలో తన ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ‘అన్‌బిలీవబులిష్-ట్రూ వర్డ్స్ ఫ్రమ్ ది మౌత్ ఆఫ్  ఎ లయర్’ పేరుతో నిర్వహించే ఈ ప్రదర్శన  ఆదివారం రాత్రి 8 గంటలకు శిల్పకళావేదిక లో ఉంటుంది.
 
 బాటిల్ ఆఫ్ బ్యాండ్స్..
 నగరానికి చెందిన పలు రాక్ బ్యాండ్స్ పోటాపోటీగా తమదైన శైలి సంగీతంతో హోరెత్తిస్తూ సాగే బాటిల్ ఆఫ్ బ్యాండ్స్... కార్యక్రమం పంజాగుట్టలోని సెంట్రల్‌మాల్‌లో జరుగనుంది. ఈ బ్యాండ్స్ వార్ ఆదివారం సాయంత్రం 5గంటలకు ప్రారంభమవుతుంది.
 
 ఎంబ్రాయిడరీ వర్క్‌షాప్
 బంజారా ఎంబ్రాయిడరీతో చేసే చేతి సంచులు, పర్సులు, రకరకాల గృహాలంకారాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది.  ఈ కలర్‌ఫుల్ ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలనుకునే వారి కోసం వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు.
 ఎప్పుడు: మే 30, 31
 ఎక్కడ: సికింద్రబాద్ అవర్ సేక్రెడ్ స్పేస్
 
 ఉర్దూ గజల్స్‌కి ప్రాముఖ్యత ఎందుకు..!
 ఈ అంశం గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం జూన్ 2న సాయంత్రం 7 గంటలకు లామకాన్‌లో జరగనుంది. హైదరాబాద్, లక్నోకి చెందిన ప్రముఖ ఉర్దూ ప్రొఫెసర్లు పాల్గొంటున్న ఈ కార్యక్రమానికి ప్రవేశం ఉచితం.
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)