amp pages | Sakshi

'ఇదేనా టీఆర్ఎస్ మార్క్ రాజకీయం'

Published on Sun, 07/03/2016 - 12:12

హైదరాబాద్ : కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ నాయకుడు నాగం జనార్దన్రెడ్డి ఆదివారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తే  దాడులు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఇదేనా టీఆర్ఎస్ మార్క్ రాజకీయం అని ఆ పార్టీ నాయకులను ఆయన సూటిగా ప్రశ్నించారు. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రజాకార్ల సంఘమా అని ఎద్దేవా చేశారు.

మిషన్ కాకతీయ, మిషన్ భగీరధ, ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతుందని ఆయన మండిపడ్డారు. పిలిచిన టెండర్లులో వ్యవస్థను బ్రేక్ చేసి తన ఇష్టం వచ్చినట్లు.. తన క్యాంపు ఆఫీస్లో కూచొని పనులు పంచుతున్నాడని కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. గతంలో 30 శాతం లెస్ టెండర్లు పోయినాయి. మరి ప్రస్తుతం కేవలం 2 కంటే తక్కువలో టెండర్లు పొతున్నాయని నాగం చెప్పారు.

మీ ప్రాజెక్ట్స్ సలహదారే... డిజైన్ మారుస్తున్నారని... ఈ పద్దతి మంచిది కాదని లేఖ రాశారని నాగం ఈ సందర్భంగా గుర్తు చేశారు. సలహాదారు మాట పక్కన పెట్టి మెగా, నవయుగ కంపెనీలకు కట్టబెట్టారని తెలిపారు. గతంలో నేనే వేసిన కేసు బెంచ్ మీదకే రాలేదన్నారు. అలాగే సర్వేలకు, భూసేకరణకు, అడ్డు పడలేదు.. కోర్ట్ కు వెళ్తే పనులకు అడ్డుపడ్డట్టా? అని కేసీఆర్ను నాగం నిలదీశారు. 4 నెలలలో పూర్తి చేస్తామని చెప్పి.. ఎనిమిదేళ్ల అయినా పూర్తి చేయని వారికీ పనులు కట్టబెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.తెలంగాణ రజాకార్ల సంఘంగా తెరాస తయారయ్యిందని ఎద్దేవా చేశారు.

ప్రజల పక్కన నిలబడి పోరాటం చేస్తే .. నీ అనుయాయులతో దాడులు చేయిస్తున్నావు... రూ. 80 వేల కోట్లలో ... రూ.75  వేల కోట్లు ఆంధ్ర వాళ్లకు కట్టబెట్టావు ఇది తప్పుకాదు అని నాగం వ్యంగ్యంగా అన్నారు. దోచి పెట్టడానికి ఆంధ్ర కాంట్రాక్టర్స్ కావలి కానీ దోపిడీని ప్రశ్నిస్తే మాత్రం ఆంధ్ర లాయర్ ఉండొద్దా అని కేసీఆర్ని నిలదీశారు. కాంట్రాక్టర్స్ దోపిడీ లో సగం నీదే.. నీ దాడులకు బయపడను అని నాగం స్పష్టం చేశారు. కేవలం 4 ప్యాకేజీల మీద మాత్రమే కోర్ట్ వెళ్లిన.. మరి మిగిలిన 14 ప్యాకేజీల పని  ఎందుకు ఆగింది అని నాగం సందేహం వ్యక్తం చేశారు.

జనవరిలో టెండర్లు పిలిచి ఇంతవరకు భూసేకరణ చెయ్యని మీరు 36 నెలల్లో ఎట్లా ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు అని ప్రశ్నించారు. నీ దోపిడీని ప్రశ్నించాను కానీ ప్రాజెక్ట్లు అడ్డుకోలేదన్నారు. నమస్తే తెలంగాణ, టీ న్యూస్లో తప్పుడు, అనైతిక కథనాలు రాస్తారన్నారు.  నా వ్యక్తిత్వాన్ని దెబ్బ తీస్తే ఊరుకొను అని నాగం హెచ్చరించారు. 1969లో తెలంగాణ ఉద్యమకారుడిని అని తాను చెప్పారు.

అవినీతి లేని దినం కెసిఆర్ చరిత్రలో లేదన్నారు. కాంగ్రెస్ బిల్ పెట్టినా, బీజేపీ, సుష్మ వల్లనే బిల్ పాస్ అయిందని నాగం గుర్తు చేశారు. సామాన్యునికి తావు లేకుండా పరిపాలన చేస్తున్నావని ... సెక్రటేరియట్ మరిచిపోయావు అని మండిపడ్డారు.  అయితే నేను ప్రాజెక్టులు ఆపినట్లు చేస్తున్న ఆరోపణలకు కెసిఆర్, తెరాస సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రేపు గవర్నర్, డీజీపీ , సీఎస్ను కలుస్తామన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం మా రక్షణకు ఇవ్వలేక పోతే కేంద్రం వద్దకు వెళ్తామన్నారు. సీఎంకు లేఖ రాస్తే ఉలుకు పలుకు లేదన్నారు. నా నెక్స్ట్ టార్గెట్ నీ సెకండ్ అవినీతి మిషన్ భగీరాధ మీదే అని తెలిపారు.మిషన్ భగీరధ లో అవినీతి గల గల పారుతోందని నాగం మండిపడ్డారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌