amp pages | Sakshi

గింజ గుట్టు విప్పేస్తుంది

Published on Wed, 05/02/2018 - 02:32

సాక్షి, హైదరాబాద్‌: ఎంఆర్‌ఐ స్కానింగ్‌ చేయ డం ద్వారా శరీర అంతర్భాగంలోని లోపాలను గుర్తించినట్లుగానే, ఇప్పుడు ఆహార ధాన్యాల నాణ్యతను గుర్తించేలా కొత్త స్కానింగ్‌ పరిజ్ఞా నం వచ్చింది. ఎంఆర్‌ఐ రిపోర్టు ఇచ్చినట్లుగానే ఇది కూడా ధాన్యం గింజలోని లోపాలను గుర్తిం చి రిపోర్టు ఇస్తుంది.

అటువంటి పరికరాన్ని ఇద్ద రు ఐఐటీయన్లు సృష్టించారు. కేంద్ర ప్రభుత్వం దానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ ఆ పరిజ్ఞానాన్ని ప్రయోగాత్మకంగా మహబూబ్‌నగర్, బాదేపల్లి వ్యవసాయ మార్కెట్లలో ప్రవేశపెట్టింది. పైలెట్‌ ప్రాజెక్టు విజయవంతమవడంతో ఇతర మార్కెట్లలోనూ ప్రవేశ పెట్టాలని మార్కెటింగ్‌శాఖ నిర్ణయించింది. త్వరలో టెండ ర్లు పిలిచేందుకు ఏర్పాట్లు చేస్తుంది.  

సేంద్రీయ లక్షణాలను గుర్తించవచ్చు
రైతులు పండించిన ఆహార పంటల్లో నాణ్యతను గుర్తించడానికి ప్రస్తుతం సాధారణ పద్ధతులనే ఉపయోగిస్తున్నారు. తేమ శాతం, వాటిలోని నాణ్యతను సక్రమంగా నిర్ధారించకపోవడంతో సరైన ధర రాక రైతులు నష్టపోతున్నారు. పూర్తిస్థాయి శాస్త్రీయ పద్ధతులు లేకపోవడంతో దళారులు రైతులను దోపిడీ చేస్తున్నారు.

దీనికి చెక్‌ పెట్టే పరిజ్ఞానాన్ని మార్కెటింగ్‌ శాఖ ప్రవేశపెట్టింది. ‘మ్యాట్‌’ అనే ఈ పరికరం ద్వారా వరి, పప్పులు సహా ఇతర అన్ని ధాన్యాల నాణ్యతను గుర్తించవచ్చు. ధాన్యం రాశిలోని నమూనా గింజలను ఈ పరికరంలోని స్కానర్‌పై పెడితే కంప్యూటర్‌ మానిటర్‌పై గింజలోని లక్షణాలు, లోపాలు ప్రత్యక్షమవుతాయి. ఆ ధాన్యంలో పురుగు మందులు, తేమ శాతం, సేంద్రీయ లక్షణాలు, ప్రొటీన్లు, విటమిన్లూ ఏ స్థాయిలో ఉన్నాయో గుర్తిస్తుంది. నిముషాల్లో స్కానింగ్‌ చేసి రిపోర్టు ఇస్తుంది.

ఆ రిపోర్టు ఆధారంగా దాని నాణ్యతను నిర్ధారించి, దానికి తగ్గట్లు గ్రేడింగ్‌ చేసి ధరను నిర్ణయిస్తారు. అంతేకాదు సేంద్రీయ లక్షణాలు, నాణ్యత సరిగా ఉంటే అటువంటి ధాన్యాన్ని పెద్ద పెద్ద కంపెనీలు కొనుగోలు చేసే అవకాశముంది. వాటి ధర కూడా గణనీయంగా పెరిగి రైతుకు లబ్ధి చేకూరనుందని అధికారులు చెబుతున్నారు.  

ధర ఎక్కువే అయినా...
ఈ పరికరం ద్వారా ధాన్యం నాణ్యతను గుర్తించేందుకు ఖర్చు అధికంగానే ఉందని మార్కెటింగ్‌ శాఖ డైరెక్టర్‌ లక్ష్మీబాయి ‘సాక్షి’కి చెప్పారు. ‘ఒక నమూనాను స్కానింగ్‌ చేయాలంటే రూ.180 వరకు వసూలు చేస్తున్నారు. సాధారణ పద్ధతులకంటే ఇది ఖరీదైనది.

అయినా ఈ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకో వాలని భావిస్తున్నాం’ అని తెలిపారు. టెండ ర్లు పిలిచి ఈ పరిజ్ఞానాన్ని ఇతర మార్కెట్లలో ప్రవేశపెడతామన్నారు. సమగ్రమైన నాణ్యత రిపోర్టు వస్తున్నందున ఖరీదైనప్పటికీ రైతుకు లాభం చేకూర్చుతుందన్నారు. పత్తి, మిరప, పసుపు, పండ్లను స్కానింగ్‌ చేసే పరిస్థితి లేకపోవడం ఇందులో ప్రధాన లోపం.

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)