amp pages | Sakshi

ఎమ్‌డీ కోసం గలాటా కాదు...

Published on Fri, 02/12/2016 - 00:04

డాక్టర్ శశికుమార్ సోదరుడు రవి

సిటీబ్యూరో: తన సోదరుడు డాక్టర్ శశికుమార్ ఇప్పటికే రెండు ఆస్పత్రుల్లో ఉన్నత పదవుల్లో ఉన్నాడని... అలాంటప్పుడు లారెల్ హాస్పిటల్స్‌లో ఎమ్‌డీ కావాలని ఎందుకు గొడవ పడతాడని మృతుడి సోదరుడు, ఓ ప్రైవేట్ ఎయిర్‌లైన్స్ పైలట్ రవి అన్నారు. ఈ గొడవకు మరేదో కారణం ఉండొచ్చని... కేసు వెనుక ఉన్న మిస్టరీని పోలీసులు ఛేదించాల్సిన అవసరముందన్నారు. చైతన్యపురి ప్రభాత్‌నగర్‌లోని నివాసంలో ‘సాక్షి ’ మీడియాతో గురువారం మాట్లాడారు. ముగ్గురు మంచి మిత్రుల మధ్య ఇటువంటి గొడవ జరుగుతుందని ఎన్నడూ ఊహించలేదన్నారు. ఇప్పటి వరకు అటువైపు కుటుంబాల నుంచి తమకు ఎలాంటి ఫోన్ కాల్స్ రాలేదని తెలిపారు.

హిమాయత్‌నగర్‌లో గలాటా జరిగిన వెంటనే  చంద్రకళ వద్దకు శశికుమార్ వెళ్లడం... ఆమె మెయినాబాద్‌లోని నక్కలగుట్ట ఫాంహౌస్‌లో దింపడం... ఇంటికి వచ్చి టీవీలో వార్తలు చూశాక పంజగుట్ట పోలీసుల వద్దకు వెళ్లడం... ఇదంతా చూస్తుంటే ఏదో జరిగిందన్న అనుమానం ఉందన్నారు. పదేళ్లుగా చంద్రకళ స్నేహితురాలిగ తెలుసని...వృత్తిపరంగా ఎలాంటి లావాదేవీలు లేవన్నారు. శశికుమార్ పేరుమీద ఆ ఫామ్‌హౌస్ ఉందని వస్తున్న వదంతులు వాస్తవం కాదన్నారు. గురువారం ఉదయం నారాయణగూడ పోలీసులు పిలిస్తే... వెళ్లి కారు, బ్రీఫ్‌కేసు తీసుకొచ్చామన్నారు. బ్లాక్ కలర్ షర్ట్ లేదు. పోస్టుమార్టం నివేదిక ఇప్పటివరకు అందలేదన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి తమ కుటుంబానికి న్యాయం చేస్తారని అనుకుంటున్నామని తెలిపారు.  
 
 
 
 

Videos

టీడీపీ, జనసేనకు బిగ్ షాక్...వైఎస్సార్సీపీలో భారీ చేరికలు

జగనన్న కోసం సింగపూర్ నుంచి వచ్చి ఎన్నారైల ప్రచారం

జోరుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం

అవ్వ కాళ్ళు కడిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌