amp pages | Sakshi

నెలకో వంట నూనె శ్రేయస్కరం

Published on Tue, 09/03/2013 - 01:49

సాక్షి, హైదరాబాద్: వంటలలో దీర్ఘకాలం ఒకే రకం నూనె వినియోగించడం అనర్థదాయకమని జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్) మాజీ డెరైక్టర్ డాక్టర్ బి.శశికిరణ్ హెచ్చరించారు. నిత్యం ఒకే వంటనూనె వాడటం వల్ల గుండె, కాలేయం, పొట్ట ఇతర శరీర భాగాల్లో కొవ్వు పేరుకు పోయి అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ పోషకాహార వారోత్సవాల సందర్భంగా సోమవారం ‘ఈట్ రైట్ విత్ లివర్ డిసీజ్-13’ అనే అంశంపై ఇక్కడ ఏర్పాటైన ఎగ్జిబిషన్‌ను ఆయన ప్రారంభించారు. ఒక నెల వేరుశనగ నూనె వాడితే, మరో నెల సన్‌ఫ్లవర్ నూనె, ఇంకో నెల సోయాబీన్ ఆయిల్ వాడడం మంచిదన్నారు. రెండు, మూడు రకాల నూనెలను కలిపి వాడటం ఆరోగ్యానికి అంత శ్రేయస్కరం కాదన్నారు. ఈ నూనెలతో పోలిస్తే ఆలివ్ ఆయిల్‌లో కొవ్వు శాతం చాలా తక్కువైనప్పటికీ, అధిక ధర వల్ల సామాన్యులకు అందుబాటులో లేదన్నారు. పోషకాహార లోపం వల్ల గర్భిణులు తక్కువ బరువుతో కూడిన పిల్లలకు జన్మనిస్తున్నారని, బిడ్డ త్వరగా ఎదగాలని నూనె పదార్థాలు ఎక్కువ మోతాదులో తినిపిస్తున్నారన్నారు.
 
 దీంతో పిల్లలు స్థూలకాయులుగా మారుతున్నారని చెప్పారు. ప్రముఖ ఉదరకోశ వ్యాధుల నిపుణుడు డాక్టర్ రాజేష్ గుప్తా మాట్లాడుతూ మద్యం, మాంసం అధికంగా వాడడం, వ్యాయామం లోపించడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయన్నారు. క్లినికల్ న్యూట్రిషనిస్ట్ సీఎస్ మధులిక మాట్లాడుతూ, పిజ్జాలు, బర్గర్లు, ఎనర్జీ డ్రింక్స్ వల్ల నష్టాలే అధికమన్నారు. ఆహారంలో విధిగా తాజా కూరలు, పాలు, పండ్లు ఉండేలా చూసుకోవాలన్నారు. ఏసియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి, డాక్టర్ పి.ఎన్.రావు తదితరులు పాల్గొన్నారు.

Videos

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)