amp pages | Sakshi

నిర్మాణ రంగ కార్మికులకూ ఈఎస్‌ఐసీలో చోటు

Published on Sun, 05/28/2017 - 01:56

► రాష్ట్రవ్యాప్తంగా 44,468 కుటుంబాలకు లబ్ధి
► ఈఎస్‌ఐసీ ప్రాంతీయ సంచాలకులు అరుణ్‌పాండే


సాక్షి, హైదరాబాద్‌: ఈఎస్‌ఐ పథకంలో కేంద్రం చేపట్టిన సంస్కరణలతో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగిందని కార్మిక రాజ్య బీమా సంస్థ(ఈఎస్‌ఐసీ) ప్రాంతీయ సంచాలకుడు అరుణ్‌పాండే పేర్కొన్నారు. ఈఎస్‌ఐసీ ద్వారా కార్మికులకు అందిస్తున్న సేవలు, సంక్షేమ పథకాల పురోగతిని శనివారం ఆయన మీడియాకు వివరించారు. ఈ ఏడాది భవన నిర్మాణ రంగ కార్మికులకూ ఈఎస్‌ఐలో చోటు కల్పించామని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 44,468 కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు.

అదేవిధంగా వేతన గరిష్ట పరిమితిని రూ.15వేల నుంచి రూ.21వేలకు పెంచడంతో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగిందన్నారు. అదేవిధంగా యాజమాన్యాల వాటాను 4.75 శాతంనుంచి 3 శాతానికి తగ్గించి కంపెనీలకు వెసులుబాటు కల్పించినట్లు చెప్పారు. అంతేకాకుండా ఉద్యోగుల వాటాను 1.75 శాతం నుంచి ఒక శాతానికి తగ్గించి ఉద్యోగిపై కూడా భారం తగ్గించామన్నారు. ఈ ఏడాది జనవరి 20 నుంచి మహిళా ఉద్యోగులకు ఇచ్చే ప్రసూతి సెలవులను 12వారాల నుంచి 26 వారాలకు పెంచడం జరిగిందన్నారు.

రాష్ట్రంలో పలు ఈఎస్‌ఐసీ ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామని, మేడ్చల్‌ జిల్లా జీడిమెట్లలో ఈఎస్‌ఐసీ మోడల్‌ డిస్పెన్సరీ కమ్‌ డయాగ్నొస్టిక్‌ సెంటర్‌ను తెరిచామన్నారు. అదేవిధంగా గోషామహల్‌లో వంద పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేశామని, తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా మొబైల్‌ డిస్పెన్సరీలు ఏర్పాటు చేసి కార్మికులకు మెరుగైన సేవలను ముంగిట్లో అందిస్తున్నామన్నారు. అత్యవసర సేవలకు సూచనలిచ్చేందుకు ప్రత్యేకంగా 1800 11 3839 టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌