amp pages | Sakshi

అపోలోలో అరుదైన చికిత్స

Published on Tue, 08/15/2017 - 03:27

ఛాతీపై కత్తిగాటు లేకుండానే గుండెవాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ 
- 80 ఏళ్ల వృద్ధుడికి విజయవంతంగా చికిత్స 
దేశంలోనే ఈ తరహా చికిత్స తొలిదని వైద్యుల వెల్లడి 
 
సాక్షి, హైదరాబాద్‌: కొంతకాలంగా హృద్రోగ సమస్యతో బాధపడుతున్న 80 ఏళ్ల వృద్ధునికి ఛాతీపై కత్తిగాటు పెట్టకుండా గుండె వాల్వ్‌ను విజయవంతంగా మార్చారు హైదరాబాద్‌లోని హైదర్‌గూడ అపోలో ఆస్పత్రి వైద్యులు. చికిత్స తర్వాత రెండో రోజే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. సోమవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్‌ సూర్యప్రకాశ్‌రావు,డాక్టర్‌ పీఎస్‌ఎన్‌ కపర్థి, డాక్టర్‌ శ్రీవాస్తవ్, డాక్టర్‌ విశ్వనాథ్, డాక్టర్‌ కాంతిలాల్‌ షా, డాక్టర్‌ సత్యజిత్‌ మహేత్రి, సీటీ సర్జన్‌ డాక్టర్‌ వెంకట్‌రెడ్డి, అనస్తీషియన్‌ డాక్టర్‌ శ్యామ్‌ చికిత్సవివరాలను వెల్లడించా రు. హైదరాబాద్‌ గాంధీనగర్‌కు చెందిన ప్రభాకర్‌ కొంత కాలంగా తీవ్ర హృద్రోగ సమస్యతో బాధపడుతున్నాడు.  ఇటీవల ఆయనకు శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో హైదర్‌గూడ అపోలోలో చేర్పించారు. కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్‌ సూర్యప్రకాశ్‌రావు నేతృత్వంలోని వైద్య బృందం ఆయన్ను పరీక్షించింది.

కాల్‌స్పిక్‌స్టేనోసిస్‌ బైకస్పిడ్‌ అరోటిక్‌ వాల్వ్‌(కాల్షియంతో నిండిన బృహద్ధ మని గుండె కవాటం గట్టిపడి కుంచించుకుపోవడం)వంటి సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించారు. అప్పటికే ఒక సారి బైపాస్‌ సర్జరీ చేయడం, వయసు పైబడటం, కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యలతో బాధపడుతుండ టంతో మళ్లీ సర్జరీ చేయడం ఆయన ఆరోగ్యానికి శ్రేయస్కరం కాదని భావించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞా నం ‘పర్క్యుటినియస్‌ టెక్నిక్‌’(సూదితో తొడ భాగంలో రంధ్రం చేయడం ద్వారా) సాయంతో బాధితుడికి విజయవంతంగా ఆరోటిక్‌ వాల్వ్‌ను మార్చారు. తక్కువ కోత, మత్తు మందును ఉపయోగించి చికిత్స చేశామన్నారు. ఈ తరహా చికిత్స దేశంలోనే తొలిదని కపర్థి వెల్లడించారు.  

#

Tags

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)