amp pages | Sakshi

కోలుకోని రిజిస్ట్రేషన్లు!

Published on Tue, 02/14/2017 - 02:09

జనవరిలో 25 శాతం పడిపోయిన ఆదాయం

సాక్షి, హైదరాబాద్‌: పెద్దనోట్ల రద్దు దెబ్బ నుంచి రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఇంకా కోలుకోలేదు. కేంద్రం పాత రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేసి మూడు నెలలైనా రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం ఇంకా మెరుగుపడలేదు. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోళ్లు, అమ్మకాల జోరు తగ్గడంతో ఈ జనవరిలో రిజిస్ట్రేషన్ల ఆదాయం గతేడాది జనవరి కంటే భారీగా తగ్గింది. గతేడాది జనవరిలో రూ.232.53 కోట్ల ఆదాయం రిజిస్ట్రేషన్ల శాఖకు సమకూరగా, ఈ ఏడాది కేవలం రూ.175.04 కోట్ల ఆదాయమే వచ్చింది.

ఆదాయంలో పెరుగుదల శాతం –24.72గా నమోదు కావడం గమనార్హం. పాతనోట్ల మార్పిడితో వినియోగదారుల సొమ్మంతా బ్యాంకుల్లోనే ఉండిపోవడం, ఆస్తుల అమ ్మకం ద్వారా వచ్చిన సొమ్ముపై క్యాపిటల్‌ గెయిన్స్‌ కింద అమ్మకందారు భారీ మొత్తంలో పన్ను చెల్లించాల్సి రావడం కూడా క్రయవిక్రయాల తిరోగమనానికి కారణాలు గా కనిపిస్తున్నాయి. క్యాపిటల్‌ గెయిన్స్‌పై 30 శాతం దాకా పన్ను ఉండడంతో కొనుగోళ్లు, అమ్మకాలపై తీవ్రమైన ప్రభావం పడింది.

గత సెప్టెంబర్‌ వరకు 32 శాతం పెరుగదలతో దూసుకెళ్లిన రిజిస్ట్రేషన్ల ఆదా యం తాజాగా జనవరిలో 24 శాతం తగ్గడం గమనార్హం. ఆర్థిక సంవత్సరం ముగింపునకు మరో నెలన్నర రోజులే గడువు ఉండడంతో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల శాఖకు నిర్ధేశించిన ఈ ఏడాది వార్షిక లక్ష్యం రూ.4,292 కోట్లను చేరుకోవడం దాదాపు అసాధ్యమేనని ఆ శాఖ అధికారులు అంటున్నారు.

భయమే కారణమా..!
ఏ వ్యక్తి పేరిటనైనా ఒకటి కన్నా ఎక్కువ ఫ్లాట్‌లు, ఇళ్లు, ఇతర స్థిరాస్తులు ఉన్నట్లయితే వాటిని విక్రయించేప్పుడు తప్పనిసరిగా క్యాపిటల్‌ గెయిన్స్‌ కింద పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దీంతో అమ్మకందారులు బెంబే లెత్తుతున్నారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తనకున్న రెండు ఫ్లాట్లలో ఒకదాన్ని రూ.కోటికి అమ్మినట్లయితే, తొలి మూడేళ్ల లోనైతే అమ్మకం ద్వారా వచ్చిన మొత్తంలో 30 శాతం అంటే దాదాపు రూ.30 లక్షల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్ల తర్వాత అయినట్లయితే 20 శాతం అంటే రూ.20లక్షలు ఆదాయపుపన్నుగా చెల్లించాలి. అయితే, కేంద్రం ఇటీవల క్యాపిటల్‌ గెయిన్స్‌పై పన్ను విధానాన్ని సడలించిన నేపథ్యంలో ఏప్రిల్‌ ఒకటి నుంచి కాసింత సాంత్వన లభించనుంది.

30 శాతం పన్ను స్లాబ్‌ను మూడేళ్ల నుంచి రెండేళ్లకు కేంద్రం తగ్గించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్‌ విలువను ప్రభుత్వం మూడేళ్లుగా సవరించకపోవడంతో బహిరంగ మార్కెట్‌ విలువకు, రిజిస్ట్రేషన్‌ విలువకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. బహిరంగ మార్కెట్లో భూమి ధర చదరపు గజం రూ.3 వేలు ఉంటే, రిజిస్ట్రేషన్‌ విలువ రూ.వెయ్యికి మించి లేదు. దీంతో బహిరంగ మార్కెట్‌ ధర మేరకు సదరు ఆస్తిని రిజిస్ట్రేషన్‌ చేయాల్సి వస్తే, చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్‌ ఫీజు గతంలో చెల్లించే దానికంటే చాలా ఎక్కువ అవుతుం డడం కూడా కొనుగోలుదారులు మొగ్గు చూపకపోవడానికి కారణంగా తెలుస్తోంది.

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు