amp pages | Sakshi

చిరునామా చెప్పారూ!

Published on Wed, 03/09/2016 - 00:13

నగరంలో  గందరగోళంగా ఇంటి నెంబర్లు గుర్తించేందుకు కష్టాలు
నిత్యం ఎంతోమందికి అవస్థలు

 
సిటీబ్యూరో: సురేష్ కొత్తగా నగరంలోకి వచ్చాడు. బంజారాహిల్స్‌లో ఉంటున్న అతని మిత్రుడు ఇచ్చిన చిరునామా ఆధారంగా ఇంటి నెంబర్ కనుక్కొనేందుకు బయలుదేరాడు. ఉదయం 8 గంటలకు వెతకడం ప్రారంభిస్తే...11 గంటలైనా చిరునామా కనుక్కోలేకపోయాడు. ఇంటి నెంబర్ గుర్తించలేకపోయాడు. చివరికి తన మిత్రుడు ఆఫీస్‌కు ఒక పూట సెలవు పెట్టి...స్వయంగా వచ్చి తీసుకెళ్లాల్సి వచ్చింది. ఒక్క సురేష్ మాత్రమే కాదు... నిత్యం ఎంతోమందికి ఇలాంటి పరిస్థితే ఎదురవుతోంది. పూర్తి చిరునామా కాగితం చేతిలో ఉన్నా.. మనం చేరాల్సిన ఇల్లు ఎక్కడ ఉందో తెలియక గంటలు గంటలు తిరగాల్సిన పరిస్థితి. ఒక ఇంటి నెంబరును చూసి.. తర్వాతి నెంబరు గల ఇల్లు పక్కనే ఉంటుందనుకుంటే పొరపాటే. గజిబిజి గల్లీలు... క్రమపద్ధతిలో లేని వీధి నెంబర్లు... గందరగోళంగా కాలనీలు... వరుస క్రమంలో లేని ఇళ్ల నెంబర్లు.. ఒక్క డోర్ నెంబరులోనే ఎన్నో బై (/) సంఖ్యలతో ఇళ్లు. వీటిలో అసలు చిరునామా కనుక్కోవడానికి నిత్యం ఎంతోమంది అవస్థలు పడుతున్నారు. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం నాటి నెంబర్ల వ్యవస్థే నేటికీ కొనసాగుతోంది.  ఈ   మధ్యకాలంలో లక్షల సంఖ్యలో ఇళ్లు పెరిగాయి. దాంతో అప్పటికే ఉన్న ఇంటి నెంబరుకు ‘బై’ (/) గుర్తును చేర్చి... వరుసగా నెంబర్లు రాసుకుంటూ పోవడమో లేక  ఏ..బీ..సీ.. డీ.. ఈ..లుగా పొడిగిస్తూ పోవడమో చేశారు. ఫలితంగా చిరునామాలు కనుక్కోవడం పరీక్షగా మారింది. ప్రజలకు ఈ అవస్థలు తప్పించేందుకు... సులభంగా చిరునామాలు తెలుసుకునేందుకు వీలుగా పద్ధతి ప్రకారం ఉండేలా కొత్త ఇంటి నెంబర్ల ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. కానీ.. ముందుకు సాగడం లేదు.

ప్రత్యేక విభాగం
ఇళ్లు, రోడ్లు, వీధుల పేర్లు, నెంబర్లకోసం జీహెచ్‌ఎంసీలో ఒక విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. డెరైక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో ఇది పని చేస్తుంది. గతంలో అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నయ్ నగరాల్లోని ఇంటినంబర్ల విధానాన్ని పరిశీలించి.. సులభంగా ఉండేలా లొకాలిటీల (ప్రాంతాలు) విధానంతో ఇంటి నెంబర్లు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ మేరకు నిబంధనలు రూపొందించారు. ఏళ్లకేళ్లు గడుస్తున్నాయే తప్ప ప్రజలు సులభంగా ఇంటి చిరునామా కనుక్కునే అవకాశం మాత్రం కలుగలేదు.  
 
కొత్త పద్ధతి ఇలా..
కొత్త ఇంటి నెంబర్ల విధానానికి నగరాన్ని ‘లొకాలిటీ’లు.. ప్రధాన రహదారులుగా విభజించారు. బాగా వాడుకలో ఉన్న ప్రాంతాల పేర్లనే ‘లొకాలిటీ’లకు వినియోగించాలని నిర్ణయించారు. వీటిలో వీధి నెంబర్లు .. ఇంటి నెంబర్లను నిర్ణయించారు. నిర్మాణ అనుమతులు ఉన్నదీ లేనిదీ... సంబంధం లేకుండా అన్ని ఇళ్లకూ.. ఖాలీ స్థలాలుంటే ఆవరణలకు (ప్రెమిసెస్) సైతం నెంబర్లు ఇవ్వాలని యోచించారు. అపార్టుమెంట్లు, వాణిజ్య కాంప్లెక్సుల్లో ఆవరణ నెంబర్/ఇంటి నెంబరు రెండూ కేటాయించే ప్రయత్నం చేశారు. తద్వారా చిరునామా కనుక్కోవడం సులభమవుతుందని భావించారు.

కొత్త విధానంలో వీధి ప్రారంభంలోనే ఆ ప్రాంతంలోని ఇంటి నెంబర్లను సూచిస్తూ సైన్‌బోర్డులు ఉంటాయి. ప్రాంతం (లొకాలిటీ) పేరు, వీధి నెంబరు, అక్కడ ఎన్ని ఇళ్లు ఉన్నాయో వివరాలు ఉంటాయి. ఇంటి నెంబరు ప్లేటుపై లొకాలిటీ (ఉదా: బాగ్ లింగంపల్లి ), వీధి నెంబరు (ఉదా: 3), ఇంటి నెంబరు (ఉదా:15) ఉంటాయి. ఇదంతా ఒకటి, రెండు చోట్ల ప్రయోగాలకే పరిమితమైంది.
 
కొత్త ప్రభుత్వంలోనైనా సమస్య తీరేనా?
నాలుగేళ్ల క్రితం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఇళ్ల నెంబర్ల కార్యక్రమాన్ని అప్పటి మున్సిపల్ మంత్రి మహీధర్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. అప్పటి ప్రభుత్వంతో పాటు రాష్ట్రం కూడా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం నగరానికి సంబంధించిన వివిధ అంశాలపై దృష్టి సారించినప్పటికీ... ఇంటి నెంబర్లపై మాత్రం ఇంతవరకూ శ్రద్ధ చూపలేదు. దాంతో పరిస్థితిలో మార్పులేకుండాపోయింది.
 
కాంట్రాక్ట్ ఇచ్చినా...
జీహెచ్‌ఎంసీ సిబ్బందితో పని కాకపోవడంతో కాప్రా, ఉప్పల్, ఎల్‌బీనగర్, రాజేంద్రనగర్, మల్కాజిగిరి, కూకట్‌పల్లి సర్కిళ్ల బాధ్యతలను కాంట్రాక్టుకు ఇచ్చారు. అయినా అదే పరిస్థితి. శివార్లలో కాప్రా, మల్కాజిగిరి సర్కిళ్లలో సర్వే పూర్తయింది. ఎల్‌బీనగర్, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి సర్కిళ్లలో లొకాలిటీ ప్రణాళికల పనులు జరుగుతున్నాయి. ఇవి పూర్తయితే ప్రణాళికబద్ధ నగరమైన చండీగఢ్‌లా ఉంటుందని భావిస్తున్నారు. కానీ.. ఎప్పటికో మరి.. ?!
 
టెండర్లకు సిద్ధం?

శివార్లలోని శేరిలింగంపల్లి-1, శేరిలింగంపల్లి-2, పటాన్‌చెరు-ఆర్‌సీపురం, కుత్బుల్లాపూర్, అల్వాల్‌సర్కిళ్లలో సర్వే లొకాలిటీ ప్రణాళిక పనులను కాంట్రాక్టు ఏజెన్సీలకు ఇచ్చారు. ప్రణాళికలు ఇంకా పూర్తి కాలేదు. కోర్ ఏరియాలోని ఖైరతాబాద్, మెహదీపట్నం (సర్కిల్7) సర్కిళ్ల సర్వే సైతం కాంట్రాక్టుకు ఇవ్వాలని యోచిస్తున్నారు.
 
సిబ్బంది కొరత
జీహెచ్‌ఎంసీలో తగినంతమంది సర్వేయర్లు, ఇతర సిబ్బంది లేరు. దాంతో పనులు పూర్తి కాలేదు. రెండు సర్కిళ్లలో(సర్కిల్-9, సర్కిల్-8) మాత్రం ఇంటి నెంబర్ ప్లేట్లు బిగించారు. నాలుగు, ఐదు సర్కిళ్లలో సర్వే పూర్తయింది.
 
 

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)