amp pages | Sakshi

పథకాలను త్వరగా పూర్తిచేయాలి

Published on Wed, 05/25/2016 - 02:59

‘ఎత్తిపోత’లపై మంత్రి హరీశ్‌రావు సమీక్ష
 
 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి అభివృద్ధి సంస్థ(ఐడీసీ) ఆధ్వర్యంలో చేపట్టిన ఎత్తిపోతల పథకాలన్నీ నిర్వీర్యం అయ్యాయంటూ ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. మంగళవారం ఎత్తిపోతల పథకాలపై జిల్లాల వారీగా ఐడీసీ కార్యాలయంలో సుదీర్ఘంగా సమీక్షించారు. ఇప్పటికే చేపట్టిన ఎత్తిపోతలు, పునరుద్ధరణ చేస్తున్నవి, కొత్త గా మంజూరైన ఎత్తిపోతల పథకాల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే చేపట్టిన  73 ఎత్తిపోతల పథకాల ద్వారా 1.20లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉందని.. దీని కోసం రూ.542 కోట్లు ఖర్చు చేశామ ని అధికారులు తెలిపారు.

మిగతా పనులకు మరో రూ.162.12 కోట్లు అవసరమవుతాయని వివరించారు. వివిధ కారణాల వల్ల పూర్తిగా విని యోగం లేకుండా పోయిన 117 ఎత్తిపోతల పథకాలను పునరుద్ధరించాలని, దీని ద్వారా 49,376 ఎకరాల కు ఆయకట్టు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, దీనికి రూ.76.84 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశామన్నారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. పథకాల పరిధిలోని లబ్ధిదారులైన రైతులను భాగస్వాములను చేయాలని, పనుల వేగవంతానికి శాసనసభ్యులు చొరవ చూపాలన్నారు. పనులు సకాలంలో పూర్తి చేయని కాంట్రాక్టర్లను సస్పెండ్ చేసి అవసరమైతే కొత్తగా టెండర్లు పిలవాలని సూచించారు. ఈ సమావేశంలో శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎస్‌కే జోషి, ఈఎన్‌సీ మురళీధర్, ఐడీసీ ఎండీ శ్రీదేవి, ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండేలు పాల్గొన్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌