amp pages | Sakshi

ఆశల చిగురు!

Published on Mon, 08/15/2016 - 01:56

మొదలైన ఖరీఫ్ పంటల సాగు
* సాగర్ కింద 4 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చేలా ప్రణాళిక
* నీటి విడుదల కోసం రేపు బోర్డుకు లేఖ రాయనున్న రాష్ట్రం
* ఎస్సారెస్పీ కింద 4.63 లక్షల ఎకరాలకు నీరివ్వాలని సీఎం ఆదేశం

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల కింద సాగు ఆశలు చిగురిస్తున్నాయి. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల్లోకి ఆశించిన స్థాయిలో నీరు వస్తుండటంతో రైతుల ఆశలు మొగ్గ తొడుగుతున్నాయి. ఇప్పటికే మధ్యతరహా ప్రాజెక్టులు, చిన్న నీటివనరుల కింద జోరుగా ఖరీఫ్ పంటల సాగు జరుగుతుండగా భారీ ప్రాజెక్టుల కింద సాగుకు రైతులు నడుం బిగిస్తున్నారు.

ప్రధాన ప్రాజెక్టులైన నాగార్జున సాగర్, శ్రీరాం సాగర్, నిజాం సాగర్, జూరాల, ఆర్డీఎస్, కడెం, మూసీ, ఎల్లంపల్లి తదితర ప్రాజెక్టుల పరిధిలో మొత్తంగా 21.29 లక్షల మేర ఆయకట్టు ఉంది. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితులతో ప్రాజెక్టుల్లోకి చుక్క నీరు చేరకపోవడంతో సాగు పరిస్థితి దారుణంగా తయారైంది. 2014-15లో మొత్తం లక్ష్యంలో కేవలం 7.90 లక్షల ఎకరాలే సాగవగా 2015-16 నాటికి అది 72 వేలకు పడిపోయింది. అయితే ఈ ఏడాది విస్తారంగా వర్షాలు కురవడం, ప్రాజెక్టుల్లోకి ఆశించిన మేర నీరు చేరుతుండటంతో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగనుంది.

ఇప్పటికే ఎగువ నుంచి భారీ ప్రవాహాలతో కృష్ణమ్మ వస్తుండటంతో జూరాల కింద పంటల సాగుకు నీటి విడుదల మొదలైంది. ప్రాజెక్టు కింద మొత్తంగా 1,04,741 ఎకరాల మేర ఉండగా ఇప్పటికే 80వేల ఎకరాలకు పైగా సాగు మొదలైనట్లు తెలుస్తోంది. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్‌ల కింద 4.60 లక్షల ఎకరాలకు నీరిచ్చేలా ప్రణాళిక సిద్ధమవగా ఇప్పటికే నీటి విడుదల ప్రక్రియ మొదలైంది. ఈ ప్రాజెక్టు కింద సుమారు 2.50 లక్షల ఎకరాల మేర సాగు పుంజుకున్నట్లు నీటిపారుదలశాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

శ్రీశైలం ప్రాజెక్టుకు స్ధిరంగా ప్రవాహాలు కొనసాగుతుండటం, ఇప్పటికే నీటి నిల్వ 165 టీఎంసీలకు పెరగడంతో మరో రెండు వారాల్లో శ్రీశైలం నుంచి సాగర్‌కు నీటిని విడుదల చేసే అవాకశాలున్నాయి. దీనివల్ల ఆలస్యంగా అయినా ఎడమ కాల్వ కింద ఉన్న 6.40 లక్షల ఎకరాల్లో కనీసం 4 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని అందించే అవకాశాలున్నాయని నీటిపారుదలశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే సాగర్ నుంచి ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో సాగు అవసరాలకు నీటిని విడుదల చేసేలా కృష్ణా బోర్డుకు లేఖ రాయాలని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ఈ మేరకు బోర్డుకు అధికారులు మంగళవారం లేఖ రాయనున్నారు.
 
ఎస్సారెస్పీ కింద ఖరీఫ్ కార్యాచరణ షురూ
రెండేళ్లుగా నిస్సారంగా ఉన్న ఎస్సారెస్పీలోకి ఈ ఏడాది 45 టీఎంసీల మేర నీరు రావడం, మరింతగా ప్రవాహాలు కొనసాగుతుండటం ఆయకట్టు రైతాంగానికి ఊరటనిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు కింద ఆయకట్టుకు నీరిచ్చేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

ప్రాజెక్టు నుంచి సాగు అవసరాలు 17.18 టీఎంసీలు విడుదల చేయడంతోపాటు లోయర్ మానేరు డ్యామ్‌కు 10 టీఎంసీలు, ఎత్తిపోతల పథకాలకు 3.95 టీఎంసీలు విడుదల చేయాలని సీఎం సూచించినట్లుగా తెలిసింది. మొత్తంగా ప్రాజెక్టు కింద 4.63 లక్షల ఎకరాలకు నీరివ్వాలని కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లుగా సమాచారం. ఎల్లంపల్లి ప్రాజెక్టు కింద ఉన్న ఆయకట్టు లక్ష్యం 1.65 లక్షల ఎకరాల్లో 30 వేల ఎకరాలకు సెప్టెంబర్ తొలి వారంలో నీరిచ్చేలా చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్‌రావు అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ క్రమంలో ప్రాజెక్టు కింద పంప్‌హౌస్‌ట్రయల్ రన్‌ను ఈ నెల చివరి వారంలో నిర్వహించనున్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)