amp pages | Sakshi

నకిలీ రైతులపై కఠిన చర్యలు

Published on Fri, 02/09/2018 - 01:14

సాక్షి, హైదరాబాద్‌: రైతుల ముసుగులో క్రయవిక్రయాలు జరిపే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని మార్కెటింగ్‌ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. ‘నకిలీ రైతుల’ పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఆయా జిల్లాల కలెక్టర్లు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని, అర్హులే లబ్ధిపొందాలని అన్నారు.

కొనుగోలు కేంద్రాలను వ్యవసాయ మార్కెట్‌ యార్డుల్లోనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మార్కెటింగ్‌ కార్యకలాపాలు, కందులు, శనగలు, వేరుశనగ కొనుగోలు కేంద్రాల అమలుతీరుపై మంత్రి హరీశ్‌రావు గురువారం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. బహిరంగ మార్కెట్‌లో ధరలు తగ్గిన వెంటనే శనగలు, వేరుశనగ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని మంత్రి సూచించారు.

ప్రస్తుతం కందుల కొనుగోలు కోసం ఏర్పాటు చేసిన సొసైటీల కొనుగోలు కేంద్రాలను సమీపంలోని మార్కెట్‌ కమిటీతో వెంటనే అనుసంధానించాలని సూచించారు. వ్యవసాయ విస్తరణ అధికారులతో ధ్రువీకరణపత్రం పొందిన రైతుల వద్ద నుంచి మాత్రమే కొనుగోళ్లు జరిగే విధంగా చూడాలని ఆదేశించారు. ధ్రువీకరణ పత్రాలపై నిఘా పెట్టి పారదర్శకతతో గుర్తింపు ఇచ్చేవిధంగా వ్యవసాయ విస్తరణ అధికారులకు జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేయాలని అన్నారు. 

రైతులకు అవగాహన కల్పించాలి..
వ్యవసాయ ఉత్పత్తులను మార్కెట్‌కు తీసుకురాకముందే నాణ్యతాప్రమాణాలపై రైతులకు అవగాహన కల్పించాలని హరీశ్‌ సూచించారు. కందుల కొనుగోళ్లపై కొన్నిచోట్ల ఆరోపణలు వచ్చాయని అన్నారు. ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్, ఆదిలాబాద్‌లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయని తెలిపారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

జిల్లాస్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలను ఏర్పాటు చేసి మార్కెట్‌ కమిటీల్లో జరిగే క్రయవిక్రయాలపై నిఘా పెట్టాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. 25 క్వింటాళ్ల కంటే ఎక్కువ పరిమాణంలో పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చిన వ్యక్తులపై నిఘా పెట్టాలని కోరారు. ఎంత విస్తీర్ణంలో సాగుచేశారో తనిఖీ చేయాలని కోరారు. వ్యవసాయశాఖ స్థానిక ఎగ్జిక్యూటివ్‌ అధికారుల నుంచి రైతులు ధ్రువీకరణపత్రం పొందాలని కోరారు. కొనుగోలు, చెల్లింపుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని మంత్రి ఆదేశించారు.

కొనుగోలు కేంద్రాల్లో పంటల సేకరణ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని అన్నారు. రైతులకు మద్ధతుధర కల్పించే విషయంలో పూర్తిస్థాయి చర్యలు తీసుకోవాలని, రైతుల పేరుతో ప్రభుత్వానికి నష్టం కలిగించేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. నిజమైన రైతులకు లబ్ధి చేకూర్చాలని కోరారు.   

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)