amp pages | Sakshi

స్టెరాయిడ్స్‌తో పా‘పాలు’!

Published on Sun, 03/06/2016 - 02:38

*  పాడి పశువుల్లో పాల దిగుబడి పెంపునకు తయారీ
*  ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు ముగ్గురు నిందితుల అరెస్ట్
* వెయ్యి స్టెరాయిడ్ బాటిళ్ల స్వాధీనం

 హైదరాబాద్: పాడి పశువుల్లో అధిక పాల దిగుబడి కోసం నగరంలో (హైదరాబాద్) ఆక్సిటోసిన్ ఉత్ప్రేరకాల (స్టెరాయిడ్)ను తయారు చేసి మార్కెట్‌లో చెలామణి చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ముఠాలోని ముగ్గురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. నిందితుల నుంచి వెయ్యి స్టెరాయిడ్ బాటిళ్లతోపాటు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా కార్యకలాపాల వివరాలను నగర టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ ఎన్.కోటిరెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం...బహదూర్‌ఫురా కిషన్‌బాగ్ ప్రాంతానికి చెందిన వ్యాపారి లచ్చు రాయి (34) అనే వ్యక్తి ఏడాదిగా ఆక్సిటోసిన్ స్టెరాయిడ్ తయారు చేస్తున్నాడు.

దీనిపై విశ్వసనీయ సమాచారం అందుకున్న దక్షిణ మండలం టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ ఠాకూర్ సుఖ్‌దేవ్‌సింగ్ , చార్మినార్ జోన్ డ్రగ్ ఇన్‌స్పెక్టర్ మహ్మద్ రఫీలు సంయుక్తంగా దాడులు చేసి శనివారం బహదూర్‌పురాలో రెండు కాటన్లతో తచ్చాడుతున్న లచ్చు రాయిని అదుపులోకి తీసుకోగా అతని వద్ద 40 బాటిళ్ల ఆక్సిటోసిన్ స్టెరాయిడ్స్ లభ్యమయ్యాయి. సులభంగా డబ్బు సంపాదించేందుకు ఈ వ్యాపారం చేస్తున్నానని పోలీసుల విచారణలో నిందితుడు ఒప్పుకున్నాడు. లెసైన్స్ కలిగిన ఔషద దుకాణం నుంచి రసాయనాలు కొనుగోలు చేసి 150 మిల్లీ లీటర్ల బాటిళ్లలో స్టెరాయిడ్‌ను తయారు చేస్తున్నట్లు నిందితుడు తెలిపాడు. ఇలా తయారు చేసిన ఒక్కో స్టెరాయిడ్ బాటిల్‌ను చార్మినార్ ప్రాంతానికి చెందిన ముఖేశ్ అగర్వాల్(40)కు రూ. 10 చొప్పున విక్రయిస్తున్నట్లు వివరించాడు.

ఫలక్‌నుమాలో డెయిరీ ఉత్పత్తుల దుకాణం నిర్వహించే ముఖేశ్ తన వద్దకు వచ్చే వినియోగదారులకు ఒక్కో బాటిల్‌ను రూ. 20 నుంచి రూ. 25కు వరకు విక్రయిస్తున్నాడు. లచ్చు రాయి అందించిన వివరాల ఆధారంగా ముఖేశ్ అగర్వాల్, ఈద్‌బజార్‌లో మెడికల్ షాప్ నిర్వహిస్తున్న షేక్ అబ్దుల్ ఖలీద్ అలియాస్ అఫ్రోజ్ అలియాస్ నాసర్ అలీ అలియాస్ నానబా (30)లను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. యూపీకి చెందిన మోసిన్ అనే దళారీ నుంచి స్టెరాయిడ్ తయారీ ముడిసరుకును అబ్దుల్ ఖలీద్ కొనుగోలు చేసి స్టెరాయిడ్స్‌ను విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు మోసిన్ పరారీలో ఉన్నట్లు చెప్పారు.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)