amp pages | Sakshi

మూడు వేల ప్రాంతాల్లో ఉచిత వైఫై

Published on Sun, 04/03/2016 - 01:53

త్వరలో కన్జర్వెన్స్ పోర్టల్  
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు స్థల సేకరణ
అధికారుల సమన్వయ సమావేశంలో నిర్ణయం

సాక్షి, సిటీబ్యూరో:  జీహెచ్‌ఎంసీ పరిధిలోని మూడు వేల ప్రాంతాల్లో ఉచిత వైఫై కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య పూర్తి స్థాయి సమన్వయం కోసం కన్జర్వెన్స్ పోర్టల్‌ను అందుబాటులోకి తేనున్నారు. రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి అవసరమైన స్థలాలను వీలైనంత త్వరగా సేకరించనున్నారు. బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ కార్యాలయంలో శనివారం వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారుల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ నగరంలోని 200 ఉచిత వైఫై కేంద్రాలను రోజుకు సగటున 21 వేల మంది వినియోగించుకుంటున్నారని తెలిపారు.

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో సమస్యలను పరిష్కరించేందుకు చేపట్టిన కన్జర్వెన్స్ పోర్టల్‌కు సంబంధించిన సాఫ్ట్‌వేర్ పనులు పూర్తయ్యాయని తెలిపారు. త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్టు చెప్పారు. ఈ పోర్టల్ ద్వారా తమ దృష్టికి వచ్చే సమస్యలను గుర్తించి, వెంటనే పరిష్కరించేందుకు ప్రతి శాఖ ప్రత్యేకంగా ఒక్కో నోడల్ అధికారిని నియమించుకోవాలని ఆయన సూచించారు. వేసవి దృష్ట్యా నీటిని పొదుపుపై ప్రజలకు చైతన్య కార్యక్రమాలు నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. హెచ్‌ఎండీఏ కమిషనర్ చిరంజీవులు మాట్లాడుతూ మూసీకిఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, వివరాలు అందజేయాల్సిందిగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లను కోరారు.

ఈ భూముల్లో పర్యాటక, వాణిజ్యపరమైన భవనాలు నిర్మించనున్నట్లు తెలిపారు. జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తయిందని, వాటిలో కనీస సదుపాయాలు కల్పించాలని రెండు జిల్లాల కలెక్టర్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డిని కోరారు. రోడ్లపై విద్యుత్ స్తంభాలను యుద్ధ ప్రాతిపదికన తొలగించాల్సిందిగా ట్రాఫిక్ అధికారులు సూచించారు. సింగిల్ లేన్ రోడ్లపై బస్‌బేల కోసం స్టీల్ బారికేడ్లు ఏర్పాటు చేయవద్దని కోరారు. సమావేశంలో హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రాహుల్ బొజ్జా, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, కంటోన్మెంట్ సీఈఓ సుజాత గుప్తా, ట్రాఫిక్ డీసీపీ ఎల్ ఎస్ చౌహాన్, వివిధ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)