amp pages | Sakshi

ఐ ఫోన్ల పౌచ్లో బండరాయి..ఇద్దరి అరెస్ట్

Published on Sat, 12/06/2014 - 12:02

హైదరాబాద్ : ఐ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు తక్కువ ధరకు విక్రయిస్తామని, దృష్టి మరలిచి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేసి, రూ. లక్షా 3 వేల నగదు, లక్షా 57 వేలు విలువ చేసే వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

పంజగుట్ట ఏసీపీ కార్యాలయంలో అదనపు డీసీపీ కె.ఆర్.నాగరాజు, ఏసీపీ వెంకటేశ్వర్లు, ఎస్ఆర్ నగర్ డీఐ శంకర్  వివరాల ప్రకారం... ఉత్తర్‌ప్రదేశ్ పసంద గ్రామానికి చెందిన మహ్మద్ అబ్బాస్(31), మహ్మద్ మెహందీ హసన్ (35) గతలో వస్త్రవ్యాపారం చేశారు. నగరంలో దుస్తులు కొని తమ స్వస్థలంలో విక్రయించేవారు. వీరి గ్రామంలో 80 శాతం మంది చోరీలు చేస్తూ జీవిస్తారు.

కాగా, వీరికి వ్యాపారంలో నష్టాలు రావడంతో తాము కూడా అదే బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. ఒక ఐఫోన్, యాపిల్ ల్యాప్‌టాప్ కొనుగోలు చేసి వాటిని పట్టుకొని నగరానికి వచ్చారు. దానిని విక్రయిస్తామని విద్యార్థులకు చూపిస్తారు.  డబ్బులు అత్యవసరమై రూ. 40 వేల ఫోన్‌ను రూ. 20 వేలకే విక్రయిస్తున్నామని చెప్తారు. కొనుగోలుదారుల దృష్టి మరల్చి ఐఫోన్ ఉన్న పౌచ్‌ను జేబులో పెట్టుకొని.. దాని స్థానంలో బండారాయి ఉన్న పౌచ్‌ను చేతిలో పెట్టి డబ్బు తీసుకొని ఉడాయిస్తారు.  ఇదే విధంగా ల్యాప్‌టాప్‌లు విక్రయిస్తామని మోసం చేస్తున్నారు.

నిన్న ఉదయం ఎస్ఆర్ నగర్ ప్రాంతంలో వాహన తనిఖీలు చేపట్టిన క్రైం ఎస్ రవికుమార్ ద్విచక్రవాహనంపై వెళ్తున్న వీరిపై అనుమానం కలిగి అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపెట్టారు. అబ్బాస్, హసన్‌ల నుంచి నగదు, బైక్, ల్యాప్‌టాప్, యాపిల్ ఫోన్, ఒక బండరాయి, పది ఖాళీ ఐఫోన్ పౌచ్‌లు స్వాధీనం చేసుకున్నారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌