amp pages | Sakshi

ఎంతమంది రోహిత్లను చంపుతారు: కన్హయ్య

Published on Wed, 03/23/2016 - 18:30

హైదరాబాద్ : లాఠీలతో తమ గొంతులు నొక్కలేరని జేఎన్యూ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్ అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చేరుకున్న ఆయనను బుధవారం సాయంత్రం పోలీసులు లోనికి అనుమతించలేదు. హెచ్సీయూ మెయిన్ గేటు వద్దే కన్హయ్య కుమార్ వాహనాన్ని అడ్డుకోవటంతో ఆయన వాహనం దిగి ఆవేశపూరితంగా ప్రసంగించారు. వేముల రోహిత్ కలలను సాకారం చేయడానికే తాము హెచ్సీయూకు వచ్చినట్లు చెప్పారు. అతనికి న్యాయం జరగాలని, రోహిత్ చట్టం వచ్చేవరకూ  తమ పోరాటం కొనసాగుతుందన్నారు. యూనివర్సిటీలో భయానక పరిస్థితులు సృష్టించారన్నారు.

 

తమను వర్సిటీలోనికి పోలీసులు అనుమతించడం లేదని, లాఠీలతో తమ గొంతులు నొక్కలేరన్నారు. లాఠీలు, తూటాలతో పోరాటాలు ఆపలేరని కన్హయ్య కుమార్ అన్నారు. ఇంకా ఎంతమంది రోహిత్లను చంపుతారని ఆయన ఉద్వేగంగా మాట్లాడారు. సామాజిక న్యాయం జిందాబాద్...యూనివర్సిటీలో ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అంటూ కన్హయ్య కుమార్ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆయనతో పాటు విద్యార్థులు గొంతు కలిపారు. కాగా వేముల రోహిత్ తల్లి రాధిక, అతడి సోదరుడుతో కలిసి కన్హయ్య కుమార్ హెచ్సీయూకు వచ్చారు.

 

కాగా తాము కన్హయ్య కుమార్ ను తాము అడ్డుకోలేదని, యూనివర్సిటీ భద్రతా సిబ్బందే అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు. వీసీ అప్పారావు ఆదేశాల మేరకు వర్సిటీ భద్రతా సిబ్బంది అడ్డుకున్నట్లు పేర్కొన్నారు.

Videos

బాబు కుట్రలు: సంక్షేమ పథకాల అమలును చంద్రబాబు అడ్డుకుంటున్నారు: అవంతి

చంద్రబాబు నడిచొస్తే ఒక కుట్ర.. నిలబడితే భూకంపం.. కన్నబాబు సెటైర్లు

చంద్రబాబుపై విద్యార్థుల కామెంట్స్

30 వేల కోట్ల ఆరోపణలపై పెద్దిరెడ్డి క్లారిటీ..!

జగన్ ప్రచార సభలో ఊహించని రెస్పాన్స్

చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలపై బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..!

పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుపుపై చిరంజీవి వీడియో..కొమ్మినేని స్ట్రాంగ్ రియాక్షన్

ఏపీ రాజధానిపై ఈనాడు తప్పుడు ప్రచారం ... కొమ్మినేని అదిరిపోయే కౌంటర్..

అదిరిపోయే ప్లాన్ వేసిన విజయ్ దేవరకొండ..!

చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?