amp pages | Sakshi

ఇదే మా వీడియో ఆహ్వానం

Published on Sun, 02/28/2016 - 02:26

నిన్నటి ఆనందం... నేటి కల... రేపటి జీవితం....పెళ్లి. విడి విడిగా పుట్టి, విడి విడిగా పెరిగి ఒకటిగా మారాలనుకుంటున్న రెండు జీవితాలు ఆ శుభవేళకు బంధుమిత్రులు రావాలని కోరుకుంటున్నాయి. ఆ క్రమంలో ఎన్నెన్నో చిత్ర విచిత్రాలను సమర్పిస్తున్నాయి. వెడ్డింగ్ ఇన్విటేషన్ తయారీ కోసం ఇంకా కార్డులు, బోర్డులు వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో ఇన్వైట్‌లు గురించి మీరు తెలుసుకోవాల్సిందే.  - ఓ మధు

 లేటెస్ట్ వీ-ఇన్వైట్
వీడియోలతో పెళ్లికి ఆహ్వానించటం ముందు నుంచే ఉన్నప్పటికీ, ఆహ్వానంలో తమ పెళ్లికి సంబంధించిన కథను సైతం జోడించి ఆహ్వాన వీడియోలు ఆసక్తి కరంగా తయారు చెయ్యటం ఇప్పుడు కొత్త ట్రెండ్. లింక్ షేర్ చేసి ‘ఈ కార్’్డ ద్వారా వెడ్డింగ్ ఇన్విటేషన్ పంపడం చాలా ఏళ్లుగా ఉంది. అయితే మొబైల్స్‌లో సోషల్ నెట్‌వర్కింగ్ హవా పెరిగిన తర్వాత ఈ కార్‌‌డ కన్నా వీడియో ఇన్వైట్‌ల ట్రెండ్ ఇప్పుడు  ఆకట్టుకుంటోంది.               - శ్రీకౌండిన్య, వెడ్డింగ్ వీడియో ప్రొఫెషనల్,  జోటికస్ ప్రొడక్షన్స్

‘ఇలా జరుగుతుంది అనుకోలేదు.. కానీ జరిగింది. పలకరింపు నుంచి గంటలతరబడి మాటలు.. అలా మాట్లాడుతూ... ప్రేమలో ఎప్పుడు పడిపోయామో తెలియనేలేదు. షాపింగ్‌లు, కోపాలు, బుజ్జగింపులు, ప్రపోజ్ చేసుకోవటం జరిగిపోయింది. ఫలాన తేదీన మా పెళ్లికి రండి’ అంటూ ఇద్దరూ ఒక్కటిగా పలికే ఆహ్వానం.. (ఒకటిన్నర నిమిషాల్లో ఒక్క మాట కూడా చెప్పకుండా తమ పెళ్లికి దారిచూపిన ప్రేమను పరిచయం చేస్తూ పెళ్లికి ఆహ్వానం పలికే వీడియో)

 ‘అందమైన రంగులతో మా జీవితాన్ని కలర్‌ఫుల్ చేసుకోవాలని ఆశిస్తున్నాం... ఈ నెల ఫలానా తేదీ తప్పుకుండా రండి.. ఇదే మా పెళ్లికి ఆహ్వానం’ (1 నిమిషం నిడివితో క్రియేటివ్ వీడియో ఇన్విటేషన్). మచ్చుకు ఇవి కొన్నే.. ఇంతకన్నా కనువిందు చేసే వీడియో వెడ్డింగ్ ఇన్వైట్‌లు సిటీలో సందడి చేస్తున్నాయి. తమ పెళ్లికి బంధుమిత్రులను సాదాసీదాగా ఆహ్వానించడం కాదు... వారిలో తమ జంటపై క్యూరియాసిటీ పెంచి తప్పనిసరిగా పెళ్లికి వచ్చేలా చేయడానికి కూడా ఈ వీడియోలను వధూవరులు ఉపయోగించుకుంటున్నారు.

 ‘చిత్ర’ పత్రం... ఆసక్తికరం...
వధూవరులు ప్రాధాన్యమివ్వాలనుకున్న అంశం ఆధారంగా ఈ వీడియో థీం ఎంచుకుంటారు. ఉదాహరణకు ప్రేమ వివాహం అయితే  మొదటిసారి కలుసుకున్న చోటు నుంచి, వారి ప్రేమ జర్నీలో ముఖ్యమైన సంఘటనలు జరిగిన ప్రాంతాలు ఈ వీడియో తియ్యడానికి అనువైన ప్రదేశాలు ఎంచుకుంటుంటారు. అలా కుదరకపోతే, అందమైన చోటుకి వెళ్లి వారి కథను అందంగా చూపించడానికి ప్రయత్నిస్తారు.

 ఇలా రూపుదిద్దుకుంటాయి...
అయితే ఈ వీడియోలు అన్నీ ప్లాన్ చేసి, స్క్రిప్ట్ ప్రకారం కాకుండా కపుల్‌కి కావలసిన ప్రైవసీ ఇచ్చి, కొంత సర్‌ప్రైజ్‌తో వీటిని రూపొందిస్తారు. అలా ఈ ఇన్వైట్ వీడియో మొదటిసారి చూసుకున్నప్పుడు కపుల్స్ ముందుగా థ్రిల్ అవుతుంటారు. ఇక షేర్ చేసుకున్న ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ అయితే వీడియో చూసిన నెక్ట్స్ మూమెంట్ నుంచే వారిని బ్లెస్ చేయటం మొదలు పెట్టేస్తారు. కపుల్ ఎలాంటి రిలేషన్ షేర్ చేసుకుంటారు అనేది ఈ వీడియోలో ముఖ్యమైన ఎలిమెంట్. ఎవరూ లేనప్పుడు ఆ కపుల్ షేర్ చేసుకునే హ్యాపీ మూమెంట్స్ ఈ వీడియోకి మూలం. దాని చుట్టూ చిన్న కథతో ఈ వీడియోలు రూపొందిస్తారు. వారి ఎక్స్‌ప్రెషన్స్, ఎమోషన్స్ నేచురల్‌గా అందిపుచ్చుకుంటారు. ఇక ఈ వెడ్ ఇన్వైట్ వీడియోలను వెడ్డింగ్ కవర్ చేసే వాళ్లతోనే చేయించుకుంటుంటారు, లేదా విడిగా కూడా చేయించుకోవచ్చు.

లైటింగ్ వుుఖ్యం...
ఇప్పుడు చాలా మంది కపుల్స్ వీడియో ఇన్వైట్‌లను ప్రిఫర్ చేస్తున్నారు. వీటిని షూట్ చేసేందుకు చక్కటి ప్లేస్‌తో పాటు, అనుకూలమైన వాతావరణం, లైటింగ్  చాలా ముఖ్యం. అందుకు ఉదయం, సాయంత్రం వేళల్లో ఉండే లైట్ ప్లెజెంట్‌గా, పర్‌ఫెక్ట్‌గా ఉంటుంది.
                                                              - శ్రీనివాస్, వెడ్డింగ్ వీడియోగ్రాఫర్

చక్కటి అనుభూతి...

ఫస్ట్‌టైం ఇలాంటి వెడ్డింగ్ వీడియో చూసినప్పుడు చాలా కొత్తగా, ఇన్నోవేటివ్‌గా అనిపించింది. ఎనిమిదేళ్ల లవ్ స్టోరీని ఒకటిన్నర నిమిషాల్లో స్టాప్ మోషన్‌లో చూసుకోవటం, అది ఫ్రెండ్స్‌తో షేర్ చేసుకోవటాన్ని  బాగా ఎంజాయ్ చేశాం. అచ్చం అలాగే నా పెళ్లికి కూడా వీడియో ఇన్వైట్ తప్పకుండా చేయించుకోవాలని డిసైడ్ అయ్యాను. - అంజలి, బుల్లితెర నటి

Videos

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

ప్రశాంత్ కిషోర్ పై విరుచుకుపడ్డ అనలిస్ట్ KS ప్రసాద్

కవిత ఛార్జ్ షీట్ పై నేడు విచారణ..

వైఎస్సార్సీపీ నేతల ఇళ్లకు నిప్పు పెట్టిన టీడీపీ..

అట్టహాసంగా మోడీ నామినేషన్

అక్కడ రీ-పోలింగ్ ?

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)