amp pages | Sakshi

మాటలుండవు ‘చేతలే’!

Published on Sat, 04/02/2016 - 00:15

స్నాచింగ్ సమయంలో తెలివిగా వ్యవహరించే గ్యాంగ్
షామ్లీ జిల్లాలో 12 గ్రామాల్లో నివసిస్తున్న బవరియాలు
సోని పోలీసు కస్టడీలోకి తీసుకోవాలని అధికారులు నిర్ణయం

 

సిటీబ్యూరో: చిరునామా చెప్పమని అడుగుతూనో... మంచి నీళ్లు కావాలనో..  దుకాణంలో సరుకులు కావాలంటూ నో... ఇలా ఏదో ఒక రకంగా బాధితులతో మాటలు కలిపి గొలుసు దొంగతనాలు చేయడం స్నాచర్ల నైజం. అయితే నగరంపై విరుచుకుపడి మూడు రోజుల్లో 14 నేరాలు చేసిన బవరియా గ్యాంగ్ స్టైలే వేరు  టార్గెట్ చేసుకున్న మహిళలతో అసలు మాట్లాడరు. ఈస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేసిన సోను ఈ ముఠాకు చెందిన సభ్యడన్న విషయం విదితమే. ఈ గ్యాంగ్ లీడర్ మన్‌ప్రీత్ అలియాస్ మంగళ్ సహా మరికొందరి కోసం జంట కమిషనరేట్ల అధికారులు వేట కొనసాగిస్తున్నారు.

 
ఒక చోట మాత్రమే డైలాగ్స్...

గత నెల 13, 14, 15 తేదీల్లో జంట కమిషనరేట్ల పరిధిలోని 14 ప్రాంతాల్లో పంజా విసిరిన ఈ ముఠా సభ్యులు కేవలం ఒక్క చోటే బాధితురాలితో మాట కలిపారు. మిగిలిన 13 ఉందంతాల్లోనే సంజ్ఞలతోనే ‘పని’ పూర్తి చేసుకుపోయారు. రెండు బృందాలుగా వేర్వేరు వాహనాలపై బయలుదేరే మంగళ్ గ్యాంగ్ ‘పెలైట్’, ‘హిట్’ పంథాలో రెచ్చిపోతుంది. నగరంలో పంజా విసిరిన మూడు రోజుల్లో టార్గెట్‌గా చేసుకున్న ఓ మహిళ వద్దకు వెళ్లిన ముఠా సభ్యుడు సమీపంలో ఉన్న చెట్టు వైపు చెయ్యెత్తి చూపించాడు. అక్కడ ఏముందా అని ఆ మహి ళ అటు చూడగా... గొలుసు లాక్కుని బైక్ ఎక్కి పారిపోయాడు.  మరో ఉదంతంలో మార్నింగ్ వాక్ పూర్తి చేసుకుని వచ్చి అరుగుపై కూర్చున్న మహిళ వద్దకు వెళ్లిన గ్యాంగ్ మెంబర్ ఆమె సమీపంలో నేలపై రాయడం మొదలెట్టాడు. అదేంటో చూద్దామని ఆ మహిళ కిందికి వంగగా... మెడలోని పుస్తెల తాడు లాక్కొని ఉడాయిం చాడు. మిగిలిన నేరాలనూ ఇలానే చేసిందీ బవరియా గ్యాంగ్.

 
భాషతో ప్రాంతం తెలుస్తుందని...

ఉత్తరప్రదేశ్ షామ్లీ జిల్లాలోని 12 గ్రామాల్లో బవరియా తెగవారు నివసిస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో చైన్ స్నాచింగ్స్‌తో పాటు ఇతర నేరాలు చేయడమే వీరి వృత్తి. బడాకాన్పూర్, జఠాన్‌పూర్, రామ్‌పుర, సూక్రా, నవబస్, ధూద్దీ, మసద్‌ఘడ్, ఛోటా కాన్పూర్, బైరాహియాం, హ్మద్‌ఘడ్, ఖేడీ, లాధీపూర్‌ల్లో ఈ తెగ విస్తరించి ఉంది. నాగరికత ఆనవాళ్లు పూర్తిగా కనిపించని ఆ గ్రా మాల్లోని యువత ఎప్పటికప్పుడు వేర్వేరు ముఠాలు కడుతూ నేరాలు చేయడమే వృత్తిగా చేసుకున్నారు.  ఇలా దేశ వ్యాప్తంగా నేరాలు చేసే వీరు బాధితులతో మాట్లాడితే... తమ భాష, యాస ఆధారంగా తాము ఏ ప్రాంతం వారిమో అనేది పోలీసులు పసిగట్టి పట్టుకుం టారనే భయంతో దొంగలు సాధ్యమైనంత వరకు మా టలకు దూరంగా ఉండి ‘చేతల’తో రెచ్చిపోతుంటారు.

 
స్థానికంగా ఏ నేరాలు చేయరు...

ఎంపిక చేసిన నగరాల్లో ఇళ్ల అద్దెకు తీసుకుని డెన్లు ఏర్పాటు చేసుకుంటూ రోజుల తరబడి మకాం వేసి మరీ పంజా విసురుతాయి బవరియా ముఠాలు. తమ సొంత ప్రాంతంలో మాత్రం ఎలాంటి నేరాలు చేయవు. దీనికితోడు స్థానిక పోలీసులతో వీరికి ‘ములాఖత్’ ఉంటుంది. బయటి ప్రాంతాల నుంచి పోలీసులు వస్తే ఆ విషయాన్ని అక్కడి పోలీసులే బవరియాలకు చేరవేస్తారు. ఇలా చేసినందుకు వారికి భారీ ‘పారితోషికాలే’ ముడతాయట. బవరియాలు నివసించే 12 గ్రామాలూ పక్కపక్కనే ఉండటంతో ఓ గ్రామంలోని వారికి విషయం తెలిస్తే చాలు.. చాలా తేలిగ్గా మిగిలిన వారికీ పాకి అందరూ అప్రతమత్తం అవుతారు. అలాగని స్థానిక పోలీసుల సహకారం లేకుండా బయటి పోలీసులు గ్రామాల్లోకి ప్రవేశిస్తే వారిపై దాడులకూ వెనుకాడరు.

 
ఒకే ఒక్కడు నుంచి ముఠాలుగా...

షామ్లీ జిల్లాలోని బవరియా తెగకు ఒకప్పుడు ఛత్రసేన అనే వ్యక్తి నాయకుడిగా ఉండేవాడు. ఇతడే పదుల సంఖ్యలో ముఠాలు నిర్వహిస్తూ నేరాలు చేయించేవాడు. దేశ వ్యాప్తంగా నేరాలు ఇతడి నేతృత్వంలోనే జరిగేవి. కాలక్రమంలో ఎవరికి వారు ముఠాలు ఏర్పాటు చేసుకుని రెచ్చిపోవడం ప్రారంభించడంతో మన్‌ప్రీత్ అలియాస్ మంగళ్ లాంటి వాళ్లు పెరిగిపోయారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులకు మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మన్‌ప్రీత్ ఇల్లు బడా కాన్పూర్‌లో పెద్ద కోటను తలపిస్తూ గేటులతో ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. దేశంలో ఏ ప్రాంతంలో నేరాలు చేయడానికి వెళ్లినా.. ముఠా సభ్యులకు అవసరమైన అన్ని ఖర్చులూ అతడే భరిస్తాడు. నివాసం, ఆహారం, ఇతర ఖర్చులు మాత్రమే కాదు... ఎవరైనా పోలీసులకు చిక్కితే బెయిల్ తదితర వ్యవహారాలు పర్యవేక్షిస్తాడు. ఈ నేపథ్యంలోనే చోరీ సొత్తులో అధిక మొత్తం అతడే తీసుకుంటాడు. ముఠా సభ్యులకు మాత్రం సొత్తు విలువను బట్టి ఒక్కో చోరీకి రూ.10 నుంచి రూ.15 వేల చొప్పున ఇస్తాడని పోలీసులు చెప్తున్నారు. గురువారం అరెస్టు చేసిన సోనును కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకున్న తర్వాత నగర పోలీసులు మరోసారి షామ్లీకి వెళ్లాలని నిర్ణయించారు.

 

Videos

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

టీడీపీ మేనిఫెస్టో చూసి మైండ్ సెట్ మార్చుకున్న ఉద్యోగులు

కాసేపట్లో హిందుపూర్ కి సీఎం జగన్ ఇప్పటికే అశేష జన ప్రవాహం

Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ

డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.

కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు

జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది

నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)