amp pages | Sakshi

రోజుకు మరో గంట పెరుగుతుంది...

Published on Fri, 06/08/2018 - 00:43

రోజుకు 24 కంటే ఎక్కువ గంటలుంటే బాగుండేదని మీకెప్పుడైనా అనిపించిందా? మీ ఆశ ఇప్పుడు కాకపోయినా ఇంకో రెండు వేల ఏళ్లకైనా నిజం కానుంది! అదేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే అంటున్నారు శాస్త్రవేత్తలు. భూమి నుంచి జాబిల్లి నెమ్మదిగా దూరం జరగడం దీనికి కారణమవుతోందని.. భవిష్యత్తులో రోజుకు 25 గంటలు ఉంటాయన్నది వీరి అంచనా. 

కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ విస్‌కాన్సిస్‌–మాడిసన్‌ పరిశోధకులు దాదాపు తొమ్మిది కోట్ల ఏళ్ల క్రితం నాటి రాళ్లను పరిశీలించినప్పుడు కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. పురాతన కాలంలో... కచ్చితంగా చెప్పాలంటే  140 కోట్ల ఏళ్ల క్రితం రోజుకు సగటున 18 గంటలు, గంటకు 41 నిముషాలు మాత్రమే ఉండేవని తెలిసింది.. 

భూమండలం కక్ష్య నుంచి చందమామ నెమ్మదిగా పక్కకు జరుగుతున్న కొద్దీ రోజులో గంటలు పెరుగుతున్నాయని తేల్చారు. ఈ విధంగా చంద్రుడు దూరం జరుగుతున్న కొద్ది భూభ్రమణం కూడా నెమ్మదిస్తుందని విస్‌కాన్సిన్‌–మాడిసన్‌ విశ్వవిద్యాలయ జియోసైన్స్‌ ప్రొఫెసర్‌ స్టీఫెన్‌ మేయర్స్‌ వెల్లడించారు.

భూమి నుంచి చందమామ ఏడాదికి 3.82 సెంటీ మీటర్ల చొప్పున దూరం జరుగుతున్నట్టు అంచనా. జాబిల్లితోపాటు అనేక ఇతర గ్రహాలు, నక్షత్రాల గురుత్వాకర్షణ శక్తి ప్రభావం భూమిపై ఉంటుందని.. ఇది కాస్తా భూభ్రమణ వేగాన్ని ప్రభావితం చేస్తాయని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. సౌరవ్యవస్థలో వచ్చే మార్పుచేర్పులకు అనుగుణంగా రోజులో పగటి వేళల్లో మార్పులు సంభవిస్తున్నాయి. 

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)