amp pages | Sakshi

ఫోర్బ్స్‌ బిలియనీర్లు : మన ముగ్గురు

Published on Fri, 06/07/2019 - 20:19

భారత సంతతికి  చెందిన ముగ్గురు మహిళలు అమెరికాలోని టాప్ సెల్ఫ్‌మేడ్ మహిళా బిలియనీర్ల  ఫోర్బ్స్‌ జాబితాలో చోటు సంపాదించారు.  అమెరికాలో  స్వయం ప్రకాశితమైన 80 మంది మహిళల జాబితాలో ముగ్గురు  ప్రముఖంగా నిలిచారు. ప్రముఖ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ రూపొందించిన ఈ లిస్ట్‌లో కంప్యూటర్ నెట్‌వర్కింగ్ సంస్థ అరిస్టా నెట్‌వర్క్స్ ప్రెసిడెంట్, సీఈవో జయశ్రీ ఉల్లాల్, ఐటీ కన్సల్టింగ్ అండ్ ఔట్‌సోర్సింగ్ సంస్థ సింటెల్ సహ వ్యవస్థాపకురాలు నీరజా సేథి, స్ట్రీమింగ్ డేటా టెక్నాలజీ కంపెనీ కంఫ్యూయెంట్ సీటీవో నేహా నర్కెడే, తమ సత్తా చాటారు. ఫోర్బ్స్ అమెరికా రిచెస్ట్ సెల్ఫ్‌మేడ్ ఉమెన్ 2019 జాబితాలో స్థానాన్ని దక్కించుకున్నారు.  

జయశ్రీ ఉల్లాల్‌ (58) :  ఫోర్బ్స్ జాబితాలో 18వ స్థానంలో నిలిచిన జయశ్రీ ఉల్లాల్ సంపద విలువ 1.4 బిలియన్ డాలర్లు.  లండన్‌లో పుట్టిన ఈమె భారత్‌లో పెరిగారు. ఇప్పుడు అమెరికాలో సంపన్నురాలిగా కొనసాగుతున్నారు.  

నీరజా సేథి (64) : 1980లో తన భర్త భరత్ దేశాయ్‌తో కలిసి కేవలం 2వేల డాలర్ల పెట్టుబడితో తన అపార్ట్‌మెంట్లో సింటెల్‌ కంపెనీ ప్రారంభించారు. ప్రస్తుత నికర విలువ 1 బిలియన్ డాలర్లు. 2019 అక్టోబర్‌లో ఫ్రెంచ్ ఐటీ కంపెనీ ఎటోస్ ఎస్ఈ సింటెల్‌ను 3.4 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ కంపెనీలో ఈమె వాటా నికర విలువ 510 మిలియన్‌ డాలర్లుగా అంచనా.  ఫోర్బ్స్‌ జాబితాలో ఈమె ర్యాంకు 23. 

నేహా నర్కెడే  (34) : 60వ స్థానంలో నిలిచిన నేహా  సంపద విలువ 360 మిలియన్ డాలర్లు. లింక‍్డిన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేసిన ఆమె 2014లో సొంత కంపెనీని ప్రారంభించారు. గోల్డ్‌మాన్‌ సాచీ, నెట్‌ఫ్లిక్స్‌  ఉబెర్‌  లాంటి దిగ్గజాలను వినియోగారదారులుగా ఉన్నకంఫ్యూయెంట్ కంపెనీ నికర విలువ 2.5బిలియన్‌ డాలర్లు.

ఇక ఈ జాబితాలో డయాన్ హెన్‌డ్రిక్స్ టాప్‌లో ఉన్నారు. ఏబీసీ సప్లై అనే కంపెనీ చైర్మన్ అయిన ఈమె సంపద విలువ 7 బిలియన్ డాలర్లు.  మీడియా మొఘల్‌ ఒపెరా విన్‌ ప్రే 10వ ర్యాంకును సాధించగా ఫేస్‌బుక్‌ ఛీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (12), రియాల్టీ టీవీ స్టార్ కైలీ జెన్నర్ (23), ఫ్యాషన్ డిజైనర్ టోరీ బుర్చ్ (29), పాప్ స్టార్ రిహన్న (37), మడోన్నా (39), గాయకుడు బెయోన్స్ (51), రచయిత డేనియల్ స్టీల్ (56), టీవీ షో ఎల్లెన్ డెజనేర్స్ (63), టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ 80 వ స్థానంలో నిలిచారు.

21- 92 సంవత్సరాల వయస్సున్న సభ్యులకు ఈ జాబితాలో చోటు కల్పించగా, వీరి మొత్తం  సంపద  81.3 బిలియన్ డాలర్లు.  కనీస నికర విలువ 225 మిలియన్ డాలర్లుగా నిర్ణయించగా,  రికార్డు స్థాయిలో 25 మంది  బిలియనీర్లుగా నిలిచారు. గతంతో పోలిస్తే కొత్త వ్యాపారం సృష్టించడంతోపాటు మహిళలు  వ్యాపారంలో బాగా రాణిస్తున్నారని ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సంపద సృష్టిస్తున్నారని ఫోర్బ్స్‌  వ్యాఖ్యానించింది.
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌