amp pages | Sakshi

వాట్సాప్‌ @ 500 కోట్ల డౌన్‌లోడ్లు

Published on Mon, 01/20/2020 - 01:31

శాన్‌ఫ్రాన్సిస్కో: దిగ్గజ మెసేజింగ్‌ ప్లాట్‌ఫాం వాట్సాప్‌ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్ల డౌన్‌లోడ్లను సాధించింది. ఈ ఘనత సాధించిన రెండో గూగుల్‌యేతర యాప్‌గా చరిత్ర సృష్టించింది. అయితే ఇది కేవలం ప్లేస్టోర్‌ నుంచి చేసుకున్న డౌన్‌లోడ్లు మాత్రమేగాక, వివిధ సంస్థలకు చెందిన మొబైల్‌ ఫోన్లలో ప్రీఇన్‌స్టాల్‌గా వచ్చే వాటితో కలిపి ఈ ఘనత సాధించింది. వాట్సాప్‌కు నెలకు 160 కోట్ల మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. ఫేస్‌బుక్‌కు 130 కోట్ల మంది, వియ్‌చాట్‌కు 110 కోట్ల మంది యాక్టివ్‌ యూజర్లు ఉన్నారు. సోషల్‌ నెట్‌వర్క్‌లలో ఫేస్‌బుక్, యూట్యూబ్‌ల తర్వాత వాట్సాప్‌ మూడో స్థానంలో నిలిచింది. గతేడాదిలో గూగుల్‌ 230 కోట్ల డౌన్‌లోడ్లను సాధించగా, ఫేస్‌బుక్‌ 300 కోట్ల డౌన్‌లోడ్‌లను సాధించింది. మరోవైపు టిక్‌టాక్‌ యాప్‌ 2019లో రెండో అత్యధిక డౌన్‌లోడ్‌లు సాధించిన యాప్‌గా నిలిచింది.  

వాట్సాప్‌ సేవల్లో అంతరాయం..
భారత్‌తో పాటు, పలు దేశాల్లో వాట్సాప్‌ స్తంభించింది. ఫొటోలు, వీడియోలు, స్టేటస్‌ అప్‌డేట్లు చేయలేకపోయామని పలువురు యూజర్లు ట్విట్టర్‌ వేదికగా ‘వాట్సాప్‌డౌన్‌’ హాష్‌టాగ్‌తో వెల్లడించారు. ఆదివారం సాయంత్రం 4:15 నుంచి ఈ సమస్య ఎదురైనట్లు యూజర్లు తెలిపారు. సందేశాలు అందుకోవడం, పంపడం వంటి వాటిల్లో కూడా సమస్యలు ఎదుర్కొన్నట్లు చెప్పారు. భారత్, యూరోప్, మలేసియా, ఇండోనేసియా, బ్రెజిల్‌లోని పలు చోట్ల ఈ సమస్య ఎదురైంది. దాదాపు మూడు గంటల తర్వాత ఈ సమస్యను వాట్సాప్‌ ఇంజనీర్లు పరిష్కరించారు.

Videos

సీఎం జగన్ సభలో ఆసక్తికర ఫ్లెక్సీలు

సీఎం జగన్ పంచులతో దద్దరిల్లిన రాజంపేట..

చరిత్రలో నిలిచిపోయేలా.. అన్నమయ్య జిల్లా ప్రజలకు శుభవార్త

చంద్రబాబు కూటమి ఉమ్మడి సభలు పై సీఎం జగన్ అదిరిపోయే సెటైర్లు

చంద్రబాబు కు అధికారం వస్తే "జిల్లా హెడ్ క్వార్టర్స్"

రాజంపేట లో అశేష ప్రజా స్పందన

కూటమిని నమ్మి మోసపోతే.. పేదలకు మళ్లీ కష్టాలు తప్పవు

గత ఐదేళ్ళలో ఏ ఏ వర్గాల ప్రజల సంపద ఎలా పెరిగింది... వాస్తవాలు

సీఎం జగన్ మాస్ ఎంట్రీ @ రాజంపేట

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @రాజంపేట (అన్నమయ్య జిల్లా)

Photos

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

హీరోయిన్‌తో స్టార్‌ క్రికెటర్‌ డ్యాన్స్‌.. నువ్వు ఆల్‌రౌండరయ్యా సామీ! (ఫోటోలు)

+5

సన్‌రైజర్స్‌ పరుగుల సునామీ.. కావ్యా మారన్‌ రియాక్షన్‌ వైరల్‌ (ఫొటోలు)

+5

రాయ్‌ లక్ష్మీ బర్త్‌డే సెలబ్రేషన్స్‌.. కళ్లలో టన్నుల కొద్దీ సంతోషం (ఫోటోలు)

+5

కల్యాణదుర్గంలో జనహోరు (ఫొటోలు)

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు