amp pages | Sakshi

ఏ గ్రూపు రక్తమైనా ఇక ఒక్కటే!

Published on Thu, 04/30/2015 - 14:18

టొరాంటో: అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన గ్రూపు రక్తం దొరక్క ఎంతోమంది రోగులు, ముఖ్యంగా యాక్సిడెంట్ కేసుల్లో క్షతగాత్రులు మృత్యువుబారిన పడుతున్న విషయం తెల్సిందే. ఇలాంటి పరిస్థితిని అధిగమించి ఎవరికైనా ఎవరి రక్తమైనా (ఏ గ్రూపు రక్తమైనా) సరిపోయాలా....ఏ దాత నుంచి తీసుకున్న రక్తాన్నైనా యూనివర్సల్ గ్రూప్ రక్తంగా మార్చడంలో సైంటిస్టులు విజయం సాధించారు. బ్రిటన్‌లోని కొలంబియా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ ఎంజైమ్‌ను సృష్టించారు. ఇది ఏ గ్రూపు రక్తాన్నైనా యూనివర్సల్ గ్రూప్ రక్తంగా మార్చేస్తుంది. ‘ఓ’ గ్రూపు రక్తాన్ని మాత్రమే యూనివర్సల్ గ్రూప్ రక్తంగా వ్యవహరిస్తున్న విషయం తెల్సిందే. ఈ రక్తాన్ని ఏ గ్రూప్ వారికైనా ఎక్కించవచ్చు.

ఈ గ్రూప్ రక్తం అవసరమవుతున్న స్థాయిలో అందుబాటులో ఉండడం లేదు. పైగా ఓ గ్రూపులో ఓ నెగిటివ్, పాజిటివ్ అనే రెండు రకాలు ఉంటాయి. ఆ గ్రూపు రక్తం వారికి మాత్రం ఆ గ్రూపు రక్తాన్ని మాత్రమే ఎక్కించాల్సి ఉంటుంది. రక్తం గ్రూప్‌లతో సంబంధం లేకుండా ఓ మనిషి రక్తం మరో మనిషికి సరిపడేలా చేయాలనే ఉద్దేశంతో ఆ దిశగా శాస్త్రవేత్తలు కొన్ని దశాబ్దాలుగా ప్రయోగాలు చేస్తున్నారు. అయితే ప్రతి వ్యక్తి రక్తంలో యాంటిజెన్స్ ఉంటాయన్న విషయం తెల్సిందే. అంటే ఈ యాంటీజెన్స్ బ్యాక్టీరియా, వైరస్‌లాంటివే కాకుండా ఏ ఫారిన్ బాడీని ర క్తంలోనికి అనుమతించదు. ఏ, బీ రక్తం గ్రూపుల్లో ఈ యాంటిజెన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటి కారణంగానే ఇతర గ్రూపుల రక్తాన్ని ఏ, బీ గ్రూపుల రక్తం శరీరంలోనికి అనుమతించదు.

ఇప్పుడు శాస్త్రవేత్తలు సృష్టించిన కొత్త ఎంజైమ్ అన్ని గ్రూపుల రక్తంలోని యాంటిజెన్స్‌ను సమర్థంగా అరికడతాయి. తాము సృష్టించిన ఈ కొత్త ఎంజైమ్ సమర్థంగా పనిచేస్తున్నట్టు తమకు ప్రయోగాల్లో తేలిందని, ఓ ఐదు తరాలపాటు దీన్ని ఉపయోగిస్తే ఎంజైమ్ పనితీరు 170 రెట్లు పెరుగుతుందని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న భారత సంతతి శాస్త్రవేత్త జయచంద్రన్ వివరించారు. రక్తంలో నుంచి యాంటిజెన్స్ లేదా షుగర్స్‌ను అరికట్టడం లేదా తొలగించడం వల్ల భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వస్తాయా? అన్న ప్రశ్నకు ప్రస్తుతం వారివద్ద సమాధానం లేదు. ఆ దిశగా ఇంకా ప్రయోగాలు జరగాల్సి ఉంది.
 

Videos

సీఎం జగన్ కాన్ఫిడెన్స్..ప్రమాణస్వీకారానికి సిద్ధం

పోలింగ్పై పోస్టుమార్టం..

ఏలూరులో చల్లారని రగడ...

బస్సు ప్రమాదం జరగటానికి అసలు కారణాలు

చంద్రబాబు ఎత్తులు ఫలించాయా !..సక్సెస్ రేట్ ఎంత..?

ఉప్పెనలా ఏపీలో ఓటింగ్.. రాబోయేది 'ఫ్యాన్' టాస్టిక్ రిజల్ట్స్

తాడిపత్రిలో టెన్షన్ టెన్షన్..!

పల్నాడులో టీడీపీ విధ్వంసకాండ

ఏపీకి వాతావరణ శాఖ వర్ష సూచన

టీడీపీ దాడులపై అబ్బయ్య చౌదరి స్ట్రాంగ్ రియాక్షన్

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)