amp pages | Sakshi

వారిలో విభిన్న ఆలోచనలు..

Published on Fri, 11/13/2015 - 17:10

మనిషి సంఘజీవి. అతిని చుట్టూ రకరకాల అనుబంధాల తీగలను పెనవేసుకొని సమాజంలో మనుగడ సాగిస్తుంటాడు. అయితే కొందరి విషయంలో మాత్రం ఇది విభిన్నంగా ఉంటుంది. కుటుంబంతో పాటు ఎలాంటి సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఒంటరిగా జీవితాన్ని గడిపేస్తుంటారు. ఇలాంటి వారిపై అమెరికాలోని చికాగో యూనివర్సిటీకి చెందిన ఇద్దరు మానసిక శాస్త్రవేత్తలు విస్తృతమైన పరిశోధనలు జరిపి ఒంటరి వారి ఆలోచనలు సంఘజీవులతో పోల్చినప్పుడు చాలా విభిన్నంగా ఉంటాయని నిర్ధారించారు.

ఈ పరిశోధనలో ఒంటరిగా జీవించడానికి అలవాటు పడిన వారి మెదడు పనితీరు చాలా విభిన్నంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ముఖ్యంగా సమాజంలో తమకు ఎదురయ్యే ఆపదల పట్ల చాలా అప్రమత్తంగా ఉండేలా వారి మెదడు ట్యూన్ చేయబడి ఉంటుందని తెలిపారు. ఒంటరివారి ఆలోచనలు 'స్వీయ రక్షణ' అనే అంశానికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నట్లు గుర్తించారు. నిజంగానే తమకు ఏ విధమైన హాని లేకపోయినప్పటికీ స్వీయ రక్షణకు ఒంటరి వారు ఇచ్చినటువంటి ప్రాధాన్యతను కుటుంబాలతో గడిపే వారు ఇవ్వరని నిర్థారించారు.

పరిశోధనలో భాగంగా 'బిలాంగ్', 'పార్టీ', 'ఎలోన్', 'జాయ్' అనే పదాలను విన్పించినప్పుడు మిగతావారితో పోల్చితే ఒంటరివారిలో విపరీతమైన ప్రతిస్పందనలు గమనించినట్లు గుర్తించారు.  అయితే ఈ స్పందనలు వారికి తెలియకుండానే అసంకల్పితంగా వెలిబుచ్చారని తెలిపారు. సమాజంపై గల ప్రతికూల ఆలోచనల ఫలితంగానే వారి మెదడు ఇలా ట్యూన్ చేయబడుతుందని అందుకే ఇలాంటి స్సందనలు గమనించినట్లు శాస్త్రవేత్తలు కార్టెక్స్ జర్నల్లో తమ ఫలితాలను ప్రచురించారు.

పరిశోధనలో తేలిన మరో విషయం ఏమిటంటే.. ఒంటరితనం అనేది మనసులో తాము వేరు చేయబడ్డామని ఏర్పరుచుకునే ఒక భావన. కొందరు ఎంతో మంది స్నేహితులు, బంధువులను కలిగి ఉన్నప్పటికీ తాము ఒంటరివారిమనే భావనలోనే ఉంటారని తెలిపారు.

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌