వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..
Breaking News
బిహార్‌లో ఎవరూ ఊహించని ఫలితాలు
చంద్రబాబు పుడింగి అయితే పొత్తులెందుకు?: సీఎం జగన్
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీ పోలీసుల నోటీసులు
ప్రధాని మోదీపై పిటిషన్.. ఢిల్లీ హైకోర్టు కీలక నిర్ణయం
Congress Party: ‘ముస్లిం ఓట్లు కావాలి కానీ.. అభ్యర్థులు అవసరం లేదా?’
జై శ్రీరామ్, క్రికెటర్ల పేర్లు రాసిన విద్యార్థుల పాస్.. చివరికి ఏమైందంటే!
75 ఏళ్లు వచ్చినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదు: సీఎం జగన్
విమానంలో పొగలు.. బయటకు దూకుతుండగా ప్రయాణికులకు గాయాలు
ఆ తిమింగలం మాంచి స్టిల్ ఇస్తే...
Published on Thu, 07/21/2016 - 03:20
ఏమండీ.. మీకో విషయం చెబుతా.. మనం అడవికి వెళ్లాం.. పులిని ఓసారైనా దగ్గర నుంచి చూద్దామని.. మనం చూడాల్సిన పులి మన పక్కకే వచ్చింది.. డ్యాన్సులేసింది.. వెళ్లిపోయింది.. మనం మాత్రం ఎటో దిక్కులు చూస్తూ.. ఇంతకీ పులెక్కడుందబ్బా అని బైనాక్యులర్ పెట్టుకుని మరీ వెతుకుతున్నాం.. ఇక్కడ సీన్ కూడా అలాంటిదే.. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో కొందరు పర్యాటకులు తిమింగలాన్ని చూద్దామని షిప్పేసుకుని బయలుదేరారు..
ఫొటో చూశారుగా.. వారంతా ఎటో దిక్కులు చూస్తున్నారు.. ఇటు ఓ భారీ తిమింగలం మాంచి స్టిల్ ఇచ్చి వెళ్లిపోయింది. సీనంతా అయిపోయాక.. ఇంత భారీ శబ్దమొచ్చిందేంటబ్బా అంటూ అందరూ ఇటు లుక్కేసారట. ఈ చిత్రాన్ని వెనుకనే మరో బోటులో వస్తున్న ఓ ఫొటోగ్రాఫర్ క్లిక్‌మనిపించాడు.
#
Tags