amp pages | Sakshi

తేనెటీగలా మజాకానా?

Published on Wed, 07/08/2015 - 14:00

మాస్కో:  మన దేశంలో వీఐపీ కల్చర్ విమానాల ఆలస్యానికి కారణమవుతోంటే. రష్యాలో మాత్రం అనుకోని అతిథుల వల్ల విమానం సుమారు గంటసేపు నిలిచిపోయింది. అవును.. మాస్కో విమానాశ్రయంలో తేనెటీగలు హల్చల్ చేశాయి. ఒక్కసారి సమూహంగా విమానంపై విరుచుకుపడి ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశాయి.


రోసియా ఎయిర్ లైన్స్కు చెందిన విమానం ఎయిర్ బస్-319 మరికొద్ది సేపట్లో  గాల్లోకి ఎగురుతుందనగా గుంపులు గుంపులుగా తేనెటీగలు వచ్చిపడ్డాయి.  వేలాదిగా వచ్చిన తేనెటీగలు ఒక్కసారిగా విమానాన్ని చుట్టుముట్టి విమాన రెక్కలను పూర్తిగా కవర్ చేసేశాయి. ప్రయాణికులపై దాడికి దిగాయి. దీంతో సిబ్బంది అప్రమత్తమై అధికారులకు సమాచారం అందించారు. వెంటనే రెండు అంబులెన్స్లను రంగంలోకి దించారు. ఊహించని ఈ పరిణామంతో మాస్కో నుంచి  సెయింట్ పీటర్స్ బర్గ్  వెళ్లాల్సిన విమానం గంటసేపు నిలిచిపోయింది. ఇంకా ఎక్కడైనా తేనెటీగలు దాక్కున్నాయేమోననే  భయంతో క్యాబిన్ లోపల కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేశారు.

కాగా గత నెలలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నట్టు సమాచారం. యూకే నుంచి డబ్లిన్కు పయనమై విమానమొకటి తేనెటీగల కారణంగా  అత్యవసరంగా ల్యాండ్ అయినట్టు తెలుస్తోంది.

Videos

ఇది అభివృద్ధి అంటే.. సీఎం జగన్ స్ట్రాంగ్ కౌంటర్

పొరపాటున బాబుకు ఓటేస్తే పథకాలకు ముగింపే..!

జగనన్న రాకతో దద్దరిల్లిన గాజువాక సభ

గాజువాకలో జనజాతర

బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!

విశాఖ నుంచే ప్రమాణస్వీకారం చేస్తా

వీళ్లే మన అభ్యర్థులు.. ఈసారి ఢిల్లీ పీఠం కదలాలి

ఇచ్ఛాపురం బహిరంగ సభలో సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్

చంద్రబాబు చేసిన మోసాలు లైవ్ లో వినిపించిన సీఎం జగన్

బాబును చీల్చి చెండాడిన మహిళలు

Photos

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

Sania Mirza: ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?