amp pages | Sakshi

ట్రంప్‌కు చైనా కౌంటర్‌ టారిఫ్‌ వార్‌

Published on Fri, 03/23/2018 - 11:51

బీజింగ్‌:  ప్రపంచంలోని రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా  చైనాల మధ్య  ట్రేడ్‌వార్‌ ముదురుతోంది. "తమలపాకు తొ నువ్వొకటి అంటె తలుపు చెక్కతో నేనొకటి అంటా’’ అన్నచందాన పెద్దన్నకు గట్టి రిటార్ట్‌ ఇచ్చేందుకు  సిద్ధమవుతోంది.  అమెరికాలో చైనా దిగుమతులకు  ట్రంప్‌ సర్కార్‌ చెక్‌ పెడితే.. చైనాలో అమెరికా వస్తువుల దిగుమతులకు చెక్‌ పెట్టేందుకు జీ జిన్‌పింగ్‌ ప్రభుత్వం ప్రణాళికలు  ప్రకటించింది.  ఈ చర్యలతోపాటు అమెరికాతో వాణిజ్య యుద్ధంపై తమకు  ఎలాంటి భయాలు  లేవని స్పష్టం చేసింది. స్టీల్‌, అల్యూమినియం దిగుమతులపై  అమెరికా  దిగుమతి సుంకానికి ప్రతిస్పందనగా, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యుటిఓ)ను ఆశ్రయించనుంది. అమెరికాపై చట్టపరమైన చర్యలను కోరనున్నామనీ,  ఈ వివాదాన్ని పరిష్కరించేందుకు జోక్యం  చేసుకోవాలని డబ్ల్యుటిఓని కోరునున్నట్టు  చైనా ఒక ప్రకటనలో తెలిపింది.

చైనా ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై దిగుమతి సుంకం విధిస్తూ ట్రంప్‌   ప్రభుత్వం గురువారం సంతకం చేసింది.  చైనా వస్తువులపై 60 బిలియన్ డాలర్ల వరకు సుంకాలను ప్రతిపాదించింది.  30-రోజుల సంప్రదింపులు జరిపిన తరువాత మాత్రమే  ఈ నిర్ణయాన్ని అమలు  చేయనునున్నట్టు  ట్రంప్‌ సర్కార్‌ వెల్లడించింది. దీనికి చైనాకూడా కౌంటర్‌ ఎటాక్‌గా అమెరికానుంచి దిగుమతి అయ్యే డ్రై ఫ్రూట్స్‌,  వైన్, స్టీల్  పైప్స్‌లపై 15శాతం, పంది మాంసం ఉత్పత్తులపై 25 శాతం సుంకం, రీసైకిల్ చేసిన అల్యూమినియంపై  సుంకాలను చైనా పరిశీలిస్తోందని వాణిజ్య మంత్రిత్వ శాఖ   తెలిపింది.  రెండు దేశాల వాణిజ్య సమస్యలపై ఒప్పందం కుదరని పక్షంలో 3 బిలియన్ డాలర్ల   మేర సుంకం విధించనుంది. ఇందుకు  అమెరికాకు చెందిన  మొత్తం 128 ఉత్పత్తులతో కూడిన  జాబితాను సిద్ధం చేసింది.
 

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)