amp pages | Sakshi

బ్రిటన్ తొలి క్లోనింగ్ డాగ్.. మినీ విన్నీ!

Published on Thu, 04/10/2014 - 00:57

ఇంకా కళ్లు కూడా తెరవని ఈ బుజ్జి కుక్కపిల్ల బ్రిటన్‌కు చెందిన తొలి క్లోనింగ్ డాగ్. పశ్చిమ లండన్ మహిళ రెబెక్కా స్మిత్ పెంపుడు కుక్క విన్నీ చర్మ కణాలతో దక్షిణ కొరియాలోని ఓ ల్యాబ్‌వారు దీనిని సృష్టించారు. పొట్టికాళ్లు, పొడవాటి శరీరం ఉండే డాక్‌శాండ్ జాతికి చెందిన 12 ఏళ్ల విన్నీ అంటే రెబెక్కాకు చాలా ఇష్టం. ఒకవేళ అది చనిపోతే? అన్న ఆలోచనతో దిగులు చెందిన ఆమె.. అచ్చం దానిలాగే ఉండే క్లోన్డ్ కుక్కను సృష్టించుకోవాలని భావించింది. దక్షిణ కొరియాలోని సోయామ్ బయోటెక్ ల్యాబ్‌వారిని సంప్రదించింది. వారు విన్నీ చర్మకణాలను సేకరించారు. ఆ కణాల్లోంచి ఒకదానిని ఎన్నుకుని దానిలోంచి కేంద్రకాన్ని వేరుచేశారు. తర్వాత డాక్‌శాండ్ జాతికే చెందిన మరో శునకం అండంలో కేంద్రకాన్ని తొలగించి, విన్నీ కేంద్రకాన్ని ఆ కుక్క అండంలో ప్రవేశపెట్టి విద్యుత్ షాక్‌తో ఫలదీకరణం చెందించారు.

అనంతరం మరో కుక్కను ఎంచుకుని దాని గర్భంలో ఈ పిండాన్ని ప్రవేశపెట్టారు. ఇంకేం.. గత నెల 30వ తేదీన మినీ విన్నీ ఈ లోకంలోకి వచ్చేసింది. దీన్ని క్లోన్ చేసేందుకు ల్యాబ్‌వారు 60 వేల పౌండ్లు (రూ. 60 లక్షలు) వసూలుచేశారట. అయితే 1996లో ప్రపంచంలోనే తొలిసారిగా క్లోనింగ్ ద్వారా డాలీ అనే గొర్రెను సృష్టించి చరిత్రకెక్కిన సర్ ఇయాన్ విల్మట్ మాత్రం కుక్కల క్లోనింగ్‌పై పెదవి విరుస్తున్నారు. ఇంత డబ్బు తగలేసి వాటిని సృష్టించినా.. అవి రూపంలో ఒకేలా  పుట్టినప్పటికీ, వాటి ప్రవర్తన వివిధ కారణాల వల్ల మారిపోవచ్చని, అప్పుడు యజమానులకు తీవ్ర నిరాశ తప్పదని అంటున్నారు.
 
 

Videos

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

తండ్రీ కొడుకులపై CID FIR నమోదు..

సీఎం జగన్ సవాల్ కు బాబు నో ఆన్సర్..

ప్రజ్వల్ రేవన్న అశ్లీల వీడియో వ్యవహారంలో షాకింగ్ నిజాలు..

ఎలక్షన్ ట్రాక్..కాకినాడ ఎన్నికలపై ప్రజా నాడి

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బాబు, పవన్ విష ప్రచారం చేస్తున్నారు

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు అపోహలు సృష్టిస్తున్నారు

టీడీపీది కావాలనే దుష్టప్రచారం..

బాబుకు రోజా స్ట్రాంగ్ కౌంటర్

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌