amp pages | Sakshi

కార్లు పార్క్ చేసినట్లుగా...

Published on Mon, 05/12/2014 - 02:30

ఫొటో చూడగానే మీకేం అనిపించింది. ఏదో ఎయిర్‌పోర్టు ఫొటో.. అందులో చాలా విమానాలు పార్క్ చేసి ఉన్నాయి. అంతేగా.. అయితే.. మీరు ఎగ్‌లో లెగ్ పెట్టినట్లే.. నిజం ఏమిటంటే.. ఇదో గేటెడ్ కమ్యూనిటీ.. ఇక్కడుండేవారు వారి వారి ఇళ్ల ముందు వాళ్ల విమానాలను పార్క్ చేసుకున్నారు!! అంటే..  మనం మన ఇళ్ల ముందు కార్లు లేదా బైక్‌లను పార్క్ చేసినట్లుగా అన్నమాట. అమెరికా ఫ్లోరిడాలోని స్ప్రూస్ పార్క్‌కు వెళ్లినోళ్లంతా దీన్ని చూసి డంగైపోవాల్సిందే.. ఇక్కడ 1500 ఇళ్లు ఉన్నాయి. మన దగ్గర అందరికీ బైక్ ఉన్నట్లుగా.. ఇక్కడ దాదాపు అందరికీ ఓ విమానం ఉంది.

కొందరి వద్ద అయితే.. యుద్ధ విమానాల్లాంటివీ ఉన్నాయి. ఇక్కడుండే వాళ్లలో ఎక్కువ మంది  పైలట్లే. అమెరికాలోని ఇది కాకుండా కొన్ని ఫ్లై ఇన్ కమ్యూనిటీలు ఉన్నా.. స్ప్రూస్ పార్క్ అన్నింటికన్నా పెద్దది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికాలో అవసరమైన దాని కన్నా ఎక్కువ సంఖ్యలో పైలట్లు, ఎయిర్ ఫీల్డ్స్ ఉండిపోయాయట. వాటిని సద్వినియోగం చేసే క్రమంలో ఎయిర్‌ఫీల్డ్స్ చుట్టూ ఇళ్లు కట్టి..  పైలట్లకు ఆవాసం కల్పించారు. తర్వాతి దశలో చాలా గేటెడ్ కమ్యూనిటీలు కనుమరుగైపోయినా.. స్ప్రూస్ పార్క్ లాంటివి ఇప్పటికీ అందరినీ అలరిస్తున్నాయి.  

Videos

విశాఖకే జై కొట్టిన టిడిపి

Watch Live: కర్నూలులో సీఎం జగన్ ప్రచార సభ

అంతా మాయ..సేమ్ 2 సేమ్.. 2024 మోదీ ఎన్నికల స్పీచ్ పై డిబేట్

కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం

ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం

పచ్చ మద్యం స్వాధీనం..

బాబును నమ్మే ప్రసక్తే లేదు..

మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)