amp pages | Sakshi

అమెరికా వివరణ ఇవ్వాల్సిందే: చైనా

Published on Fri, 03/13/2020 - 09:28

బీజింగ్‌/వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న ప్రాణాంతక కోవిడ్‌-19(కరోనా వైరస్‌) చైనా, అమెరికా నాయకుల మధ్య మాటల యుద్ధానికి తెరతీసింది. వేలాది మంది ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ఈ మహమ్మారి పుట్టుక గురించి ఇరు దేశాల నేతలు పరస్పర ఆరోపణలకు దిగుతున్నారు. చైనాలోని వుహాన్‌లో తొలిసారిగా కరోనా వైరస్‌ లక్షణాలు బయటపడినపుడు ఆ దేశం సరైన జాగ్రత్తలు తీసుకోనందు వల్లే సమస్య ఇంత జటిలంగా మారిందని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రెయిన్‌ మండిపడగా... కరోనాను ‘వుహాన్‌ వైరస్‌’గా ఆ దేశ విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో అభివర్ణించారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్‌ అమెరికా నేతల వ్యాఖ్యలపై విరుచుకుపడ్డారు. అమెరికా సైన్యాధికారులే ఈ ప్రాణాంతక వైరస్‌ను చైనాలోకి తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. ఈ మేరకు అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజెస్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ బోర్డు డైరెక్టర్(సీడీసీ)‌, వైరాలజిస్ట్‌ రాబర్ట్‌ ఆర్‌.రెడ్‌ఫీల్డ్‌ హౌజ్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌లో చేసిన ప్రసంగ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. (ప్రపంచంపై కరోనా పడగ)

‘‘ఇన్‌ఫ్లూయెంజా(ఫ్లూ) కారణంగా సంభవించిన కొన్ని మరణాలకు కోవిడ్‌-19 కారణమని అమెరికా సీడీసీ డైరెక్టర్‌ చెప్పారు. ఇన్‌ఫ్లూయెంజా కారణంగా 34 మిలియన్ల మంది బాధపడుతున్నారని.. అదే విధంగా 20 వేల మంది మరణించారని పేర్కొన్నారు. అందులో కోవిడ్‌19 వల్ల సంభవించిన మరణాలు ఎన్ని? దయచేసి మాకు ఆ విషయం చెప్పండి. ఇంకో విషయం సీడీసీ చూడండి అక్కడే ఎలా దగ్గుతున్నారో.. అసలు అమెరికాలో ఎంతమంది వైరస్‌ బారిన పడిన పేషెంట్లు ఉన్నారు? వారికి చికిత్స అందిస్తున్న ఆస్పత్రుల పేర్లేంటి? బహుశా అమెరికా సైన్యమే ఈ ప్రాణాంతక వైరస్‌ను వుహాన్‌కు తీసుకువచ్చి ఉంటారు. పారదర్శకంగా వ్యవహరించండి! గణాంకాలను ప్రజలకు తెలియజేయండి! అమెరికా వివరణ ఇవ్వాల్సిందే’’ అని లిజియాన్‌ డిమాండ్‌ చేశారు.

కాగా ఆయన వ్యాఖ్యలను రాబర్ట్‌ ఒబ్రెయిన్‌ మరోసారి తిప్పికొట్టారు. కరోనా అమెరికాలో పుట్టలేదని.. కచ్చితంగా వుహాన్‌లోనే ఉద్భవించిందని చెప్పుకొచ్చారు. కాగా మొదటి కరోనా కేసును వుహాన్‌లో కనుగొన్నామని చైనా సీడీసీ గతంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఇక కరోనా కారణంగా దాదాపు 115 దేశాల్లో రెండున్నర లక్షల కేసులు నమోదు కాగా, గురువారం నాటికి 4వేలకు పైగా మంది మృత్యువాత పడ్డారు.(అలా కరోనా వైరస్‌ను జయించాను!)

చదవండి: ‘కరోనా’పై ట్రంప్‌ కీలక నిర్ణయం

కోవిడ్‌ దెబ్బ: భయపడవద్దన్న ట్రంప్‌!

Videos

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

వెళ్తూ వెళ్తూ...!

తన తోటి వయసున్న అవ్వాతాతలపై ప్రేమ లేదు చంద్రబాబుకు..!

"చంద్రబాబు పాపిష్టి కళ్ళు" అవ్వాతాతల పెన్షన్ కష్టాలపై సీఎం జగన్

పిఠాపురంలో పందుల గుంపు పవన్ కు యాంకర్ శ్యామల కౌంటర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @కనిగిరి (ప్రకాశం జిల్లా)

చంద్రబాబు మోసాలను ఓడించడానికి.. పల్నాడులో గర్జించిన సీఎం జగన్

వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే

ఇవి టీడీపీ ముఖ్యమైన హామీలు "పాపం చంద్రబాబు పరువు మొత్తం పాయే"

పోయిన సారి చెప్పినవి చేశాను ఈ సారి చేసేవి "మాటిస్తున్నాను "

సీఎం జగన్‌కు ఘన స్వాగతం..!

ఉష శ్రీ చరణ్ షాకింగ్ కామెంట్స్

హెలికాప్టర్ నుంచి సీఎం జగన్ గ్రాండ్ ఎంట్రీ

Watch Live: క్రోసూరులో సీఎం జగన్ ప్రచార సభ

అమలాపురంలో ఎలక్షన్ ట్రాక్

Photos

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)