amp pages | Sakshi

ప్రతి ఏడాది కరోనా పలకరింపులు‌!

Published on Wed, 04/29/2020 - 08:41

బీజింగ్‌: కోవిడ్‌-19ను పూర్తిగా రూపుమాపలేమని చైనాకు చెందిన వైద్యశాస్త్ర నిపుణులు అభిప్రాయపడ్డారు. కరోనా వైరస్‌కు కారణమైన సార్స్‌-కోవ్‌-2 సీజనల్‌ ఫ్లూ మాదిరిగా ప్రతియేడు ఉనికి చూపెడుతుందని వెల్లడించారు. మనిషి జీవితంలో సుదీర్ఘకాలంపాటు కోవిడ్‌ ఉంటుందని చైనాలోని అత్యున్నత పరిశోధన సంస్థ పాథోజెన్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ జిన్‌కి పేర్కొన్నారు. ఇక ఇదే అభిప్రాయాన్ని అమెరికా నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అలర్జీ, ఇన్‌ఫెక్చువస్‌ డైరెక్టర్‌ ఆంథోని ఫాసీ కూడా వ్యక్తం చేశారు. కరోనా వైరస్‌ శీతాకాలం ఫ్లూగా మానవ జీవితంలో భాగమవుతుందన్నారు. ఇక ప్రతి సంవత్సరం ఫ్లూ కారణంగా మూడు లక్షల నుంచి 6 లక్షల 50 వేల మంది మరణిస్తారని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్న సంగతి తెలిసిందే.
(చదవండి: ఆకాశంలో అంతు చిక్క‌ని వ‌స్తువు!)

లక్షణాలు లేని కేసులతోనే చిక్కు...
భారత్‌లోని వైద్యశాస్త్ర నిపుణులు కూడా ప్రపంచ మానవాళిపై సార్స్‌-కోవ్‌-2 తిష్ట వేసుకు కూర్చుందని చెప్తున్నారు. అత్యధిక ట్రాన్స్‌మిషన్‌ రేటు కలిగిన కోవిడ్‌ చాలాకాలం మనుగడలో ఉంటుందని అంటున్నారు. లక్షణాలు లేకుండా పాజిటివ్‌గా ఉన్న వ్యక్తులను గుర్తించడం కష్టమవుతుందని, వారి ద్వారా వైరస్‌ వ్యాప్తి అధికంగా జరిగే అవకాశాలున్నాయిని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌ డాక్టర్‌ దిలీప్‌ మావ్లంకర్‌ తెలిపారు. వైరస్‌కు గురైన వ్యక్తుల్లో తొలివారం పాటు పెద్దగా లక్షణాలు బయటపడకపోవడంతో.. దాదాపు 44 శాతం వైరస్‌ వ్యాప్తి అలాంటి కేసుల వల్లే జరగుతుందని పలు అధ్యయనాలు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. రోగ నిరోధక శక్తి లేని వ్యక్తులపై కోవిడ్‌ మళ్లీ మళ్లీ దాడి చేస్తుందని భారత వైద్య పరిశోధన మండలిలో పనిచేసిన ఎపిడెమాలజిస్టు డాక్టర్‌ లలిత్‌ కాంత్‌ అభిప్రాయపడ్డారు. అయితే, సమర్థవంతమైన వ్యాక్సిన్‌తో కోవిడ్‌ చెక్‌ పెట్టొచ్చునని తెలిపారు. 
(చదవండి: భారత్‌లో వెయ్యి దాటిన కరోనా మరణాలు..)

Videos

అల్లుడి గురించి ఎవరికీ తెలియని విషయాలు...అంబటి సంచలన వ్యాఖ్యలు

మంగళగిరిలో లోకేష్ ప్రచారానికి కనిపించని జనాదరణ

భూములపై ప్రజలను భయపెట్టే కుట్ర..అడ్డంగా బుక్కైన అబ్బా కొడుకులు

అభివృద్ధికి కేరాఫ్ బుగ్గన...

వాడి వేడి ప్రసంగాలు..హోరెత్తిన జన నినాదం..

ప్రచార జోరు: వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులకు ప్రజల నుంచి అపూర్వ స్పందన

సీఐడీ నోటీసులు..దుష్ప్రచారాలపై విచారణ షురూ..

ఈరోజు సీఎం జగన్ షెడ్యూల్

వల్లభనేని వంశీ, భార్య ఎన్నికల ప్రచార జోరు..

చంద్రబాబు A1, లోకేష్ A2గా సీఐడీ ఎఫ్ఐఆర్ నమోదు

Photos

+5

Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియ‌ల్ న‌టి శోభా శెట్టి ఎంగేజ్‌మెంట్ (ఫోటోలు)

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌