amp pages | Sakshi

ప్రపంచంలో ఏ దగ్గుమందూ పనిచేయదు

Published on Tue, 05/10/2016 - 18:41

లండన్‌: నేడు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కాఫ్‌ సిరప్‌ (దగ్గుమందు)లు అందుబాటులో ఉన్నాయి. ఓ మోస్తరు దగ్గు వచ్చినా, ఊపరి సలపని దగ్గు వచ్చినా డాక్టర్‌ దగ్గరకు వెళతాం. ఏ డాక్టరైనా యాంటీ బయాటిక్స్‌తోపాటు ఏదో కాఫ్‌ సిరప్‌ రాసిస్తారు. కాఫ్‌ సిరప్‌ తాగితే గానీ రోగులకు సంతృప్తి ఉండదు. వాస్తవానికి ఏ కాఫ్‌ సిరప్‌ పని చేయదట. అది ఒట్టి భ్రమ మాత్రమేనని బ్రిటన్‌కు చెందిన వైద్య నిపుణులు తేల్చి చెబుతున్నారు. ఒక్క బ్రిటన్‌లోనే ఏడాదికి నాలుగువేల కోట్ల రూపాయలను దగ్గు మందుల కోసం ఖర్చు పెడుతున్నారట.

ఒక్క దగ్గుమందే కాదు. ఎముకలు గట్టిపడేందుకు తీసుకునే కాల్షియం మాత్రలు, రక్తంలో చెడు కొలస్ట్రాల్‌ లేదా ట్రైగ్లిజరైడ్స్‌ను తగ్గించేందుకు తీసుకునే ఒమేగా త్రీ (మంచి ఫ్యాట్‌) చేప నూనె మాత్రలు, చెవి నొప్పికి వాడే యాంటీబయాటిక్స్, లయ తప్పిన గుండెకు తీసుకునే ఆస్ప్రిన్‌ మాత్రలు, వెన్ను నొప్పి, మొకాలి నొప్పులకు తీసుకునే పారాసిటమాల్‌ ట్యాబ్లెట్లు, చెడు కొలస్ట్రాల్‌ లేదా ఎల్‌డీఎల్‌ తగ్గేంచేందుకు వాడే స్టాటిన్స్, వెన్నునొప్పికి ఇచ్చే ఆక్యుపంక్చర్‌ చికిత్స ఇవి ఏవీ కూడా ఫలితం ఇవ్వవని, ఇవి కేవలం రోగుల భ్రమ, డాక్టర్ల అపోహ మాత్రమేనని వైద్య నిపుణులు అంటున్నారు.

డెక్స్‌ట్రోమెథార్ఫాన్‌ లేని ఏ దగ్గు మందు కూడా పనిచేయదని, దగ్గును తగ్గించలేదని హల్‌ యూనివర్సిటీలోని రెస్పిరేటరీ నిపుణుడు ప్రొఫెసర్‌ అలిన్‌ మొరైస్‌ తెలిపారు. డెక్స్‌ట్రోమెథార్ఫాన్‌ ఉన్న దగ్గుమందును కూడా 60 మిల్లీ గ్రాములను డాక్టర్‌ ప్రిస్క్రైబ్ చేస్తారు కనక అది కూడా పనిచేయదని ఆయన అంటున్నారు. ఎక్కువ మోతాదులో అంటే పావు సీసా తాగితే గానీ అది పనిచేయదట. తాను ఐదువేల మంది రోగులపై జరిపిన ఔషధ ప్రయోగంలో ఈ విషయం తేలిందని ఆయన చెబుతున్నారు. వైరస్‌ వల్ల వచ్చే దగ్గు దానంతట అదే తగ్గిపోతుందని, బ్యాక్టీరియా వల్ల వచ్చే దగ్గు యాంటీబయాటిక్స్‌ వల్ల తగ్గిపోతుందని ఆయన అంటున్నారు.

కాల్షియం మాత్రల వల్ల ఎముకలు గట్టిపడ్డాయనడానికి ఇంతవరకు ఎలాంటి ఆధారాలు లేవని లండన్‌లోని లీడ్స్‌ టీచింగ్‌ ఆస్పత్రిలో కార్డియోలజిస్ట్‌గా పనిచేస్తున్న క్లాస్‌ విట్టీ చెబుతున్నారు. పాలు, వెన్న రూపంలో వచ్చే కాల్షియం శరీర అవసరాలకు సరిపోతుందని ఆయన అంటున్నారు. నడుము నొప్పికి ఆక్యుపంక్చర్‌ చికిత్స పనిచేయదని సౌత్‌ఆంప్టన్‌ యూనివర్శిటీలో హెల్త్‌ రిసర్చర్‌గా పనిచేస్తున్న ప్రొఫెసర్‌ జార్జి లెవిత్‌ చెబుతున్నారు. గుండె జబ్బులకు ఇచ్చే ఒమకార్‌ (ఒమేగా 3 ఫిష్‌ ఆయిల్‌) లాంటి మందులు పనిచేయవని లండన్‌ బ్రిడ్జ్‌ ఆస్పత్రిలో కన్సల్టెంట్‌ కార్డియోలజిస్ట్‌గా పనిచేస్తున్న సందీప్‌ పటేల్‌ తెలియజేస్తున్నారు.

పదేళ్ల వయస్సు పిల్లల్లో ప్రతి నలుగురికి ఒకరికి చొప్పున చెవి పోటు వస్తుందని, ప్రతి ముగ్గురిలో ఇద్దరికి డాక్టర్లు యాంటీబయాటిక్స్‌ను సూచిస్తారని, వాస్తవానికి వైరస్‌ వల్ల చెవిపోటు వస్తుంది కనుక యాంటీబయాటిక్స్‌ డోస్‌ సరిపోదని బ్రిటన్‌ ఈఎన్‌టీ స్పెషలిస్టుల అధ్యక్షుడు టోని నెరులా తెలియజేస్తున్నారు. వైరస్‌ వల్ల వచ్చే చెవిపోటు ఎలాంటి మందులు వాడనవసరం లేకుండానే 48 గంటల్లో దానంతట అదే తగ్గిపోతుందని ఆయన చెబుతున్నారు. ఓ మోస్తరు మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు వాడే ఏ యాంటీడిప్రెషన్‌ మందులు పనిచేయవని లండన్‌ యూనివర్శిటీ కాలేజ్‌ అధ్యాపకుడు, పలు క్లినికల్‌ పత్రాల రచయిత జోన్న మాంక్రిఫ్‌ చెబుతున్నారు. ఇది కేవలం అపోహ మాత్రమేనని ఆయన అంటున్నారు. ఇన్ని జబ్బులకు వాడే మందుల వల్ల ప్రయోజనం లేదని, తగ్గుతుందనుకోవడం ఒట్టి భ్రమేనని వైద్య నిపుణులు చెబుతున్నా.. వీటి వాడకం ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే అంతా మార్కెట్‌ మాయాజలం.

Videos

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

ముస్లిం మహిళలతో కలిసి వైఎస్ భారతి ప్రార్థన

ల్యాండ్ టైటిల్ యాక్ట్ అంటే ఏంటో చెప్పి చంద్రబాబు కళ్ళు తెరిపించిన జగన్

జగన్ ను కదలనివ్వని జనాభిమానం @హిందుపూర్

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @పలమనేరు (చిత్తూరు జిల్లా)

వీళ్ళే మన అభ్యర్థులు.. మీ ఆశీర్వాదం కావాలి

ల్యాండ్ టైటిల్ యాక్ట్ పై సీఎం జగన్ సీరియస్

కూటమి పై సీఎం జగన్ అదిరిపోయే పంచులు..!

కేవలం ప్రజల ఆశీస్సులు కోసం పనిచేసే ఏకైక ప్రభుత్వం

మండుటెండను లెక్కచేయని అభిమానం...!

మండుటెండను లెక్కచేయని అభిమానం..!

విడుదల రజిని సమక్షంలో భారీ చేరికలు

ఎన్నికల ప్రచారంలో వైఎస్ భారతి..!

హిందూపూర్ కి చేరుకున్న సీఎం జగన్ జనంతో కిక్కిరిసిన రోడ్లు

అంతా బాబే చేశారు

గొడుగు పట్టిన వాడి గుండెల్లో పొడిచిన బాబు

ది లీడర్..!

Photos

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)