amp pages | Sakshi

కంట‌త‌డి పెట్టిస్తోన్న జార్జ్ ఫ్లాయిడ్ వీడియో

Published on Wed, 06/03/2020 - 21:02

వాషింగ్టన్‌: జార్జ్ ఫ్లాయిడ్ అనే న‌ల్ల‌జాతీయుడిని అమెరికా పోలీసులు చిత్ర‌హింస‌లు పెట్టి చంపిన సంగ‌తి తెలిసిందే. అత‌ని మ‌ర‌ణంతో అమెరికా అట్టుడికిపోతోంది. అమెరికాలో న‌ల్ల‌జాతీయుల‌పై దాడుల‌కు నిర‌స‌న‌గా ఆందోళ‌న‌కారులు వీధుల్లోకి వ‌స్తూ నిర‌స‌న‌లు చేప‌డుతున్నారు. ముఖ్యంగా జార్జ్ మ‌ర‌ణం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కుంగ‌దీసింది. జార్జ్ పంచ‌ప్రాణాలైన‌ అత‌ని ఆరేళ్ల‌ కుమార్తె జియాన తండ్రి లేని బిడ్డ‌గా మారింది. తాజాగా వీరిద్ద‌రి ఆప్యాయ‌త‌, ప్రేమానురాగాల‌కు ప్ర‌తీక‌గా ఉన్న ఓ వీడియోను మాజీ ఎన్‌బీఏ ఆట‌గాడు, జార్జి ఆప్త స్నేహితుడు స్టీఫెన్ జాక్స‌న్ సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో ఆ చిన్నారి తండ్రి భుజాల‌పై కూర్చుని "డాడీ చేంజ్‌డ్ ద వ‌ర‌ల్డ్" (నాన్న ప్ర‌పంచాన్నే మార్చివేశాడు) అంటూ కిల‌కిల‌ న‌వ్వుతూ చెప్తోంది. (అమెరికాలో ఆందోళనలు; ఒబామా స్పందన)

'నిజంగానే డాడీ లోకాన్ని మార్చేశాడం'టూ స్టీఫెన్ సోష‌ల్ మీడియాలో రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు భావోద్వేగానికి లోన‌వుతున్నారు. 'ఇది చూస్తుంటే సంతోషం, క‌న్నీళ్లు ఒకేసారి త‌న్నుకొస్తున్నాయి' అంటూ ఓ నెటిజ‌న్ పేర్కొన్నాడు. కాగా మే 25న మిన్నెసొటాలో ఓ పోలీసు.. జార్జ్ ఫ్లాయిడ్ వేడుకుంటున్నా విన‌కుండా అత‌ని మెడ‌పై ఎనిమిది నిమిషాల‌కుపైగా మోకాలితో నులుముతూ అత్యంత దారుణంగా చంపిన విష‌యం తెలిసిందే. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌జాగ్ర‌హం పెల్లుబిక‌డంతో శుక్ర‌వారం స‌ద‌రు పోలీసును అధికారులు అరెస్ట్ చేశారు. (నలుగురు పోలీసులకు శిక్ష పడాలి: జార్జ్‌ భార్య)

Videos

లోక్ సభ స్థానాలపై లెక్కలు ప్రకటించుకున్న పార్టీలు

లోక్ సభ స్థానాలపై లెక్కలు ప్రకటించుకున్న పార్టీలు

పల్నాడు జిల్లాలో ఘోర ప్రమాదం

ఏపీ ఎన్నికలపై సీఎం జగన్ ట్వీట్

జేసీకి భారీ షాక్..ఆస్తులు అటాచ్ చేసిన ఈడీ

అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో

ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!

ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR

టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..

అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు

Photos

+5

త్రినయని సీరియల్‌ నటి కన్నుమూత.. తిరిగి వచ్చేయంటూ భర్త ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

హీరోగా యూట్యూబర్‌ నిఖిల్.. సంగీత్‌ సినిమా లాంఛ్‌ (ఫోటోలు)

+5

Royal Challengers Bengaluru: తిరుమ‌ల శ్రీవారి సేవ‌లో ఆర్సీబీ క్రికెట‌ర్లు (ఫొటోలు)

+5

పిఠాపురం: సీఎం జగన్‌ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)

+5

CM Jagan Kaikalur Meeting: కైకలూరు.. జనహోరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ రోడ్‌ షో: జనసంద్రమైన చిలకలూరిపేట (ఫొటోలు)

+5

తాగుడుకు బానిసైన టాలీవుడ్‌ హీరోయిన్‌.. జీవితమే తలకిందులు.. ఒక్కసారిగా.. (ఫోటోలు)

+5

కడపలో సీఎం జగన్‌ ఎన్నికల రోడ్‌ షో: ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

పుత్తూరులో సీఎం జగన్‌ రోడ్‌ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)

+5

రాజంపేట సభ: జననేత కోసం పోటెత్తిన అభిమానం (ఫొటోలు)