amp pages | Sakshi

ట్రంప్‌, పుతిన్‌ తొలి భేటీలో ఏం చర్చిస్తారు!

Published on Thu, 05/11/2017 - 15:54

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌​ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌​ పుతిన్‌ తో జూలైలో భేటీ కానున్నారు. హాంబర్గ్‌ లో జరగనున్న జీ20 దేశాల సదస్సులో భాగంగా వీరిద్దరూ ప్రత్యేకంగా సమావేశమై ప్రధాన సమస్యలపై చర్చిస్తారని రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌ తెలిపారు. గురువారం ట్రంప్‌ ను కలిసిన తర్వాత ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జనవరిలో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక రష్యా అధినేత పుతిన్‌ తో ట్రంప్‌ తొలి భేటీ ఇదే కానుంది. సిరియాలో ఉగ్రవాదంపై రష్యాతో పాటు తమ సేనల సంయుక్త పోరుకు స్వస్తి చెబుతున్నట్లు అమెరికా ఉన్నతాధికారులు తెలిపారు.

ఇటీవల రష్యా అధినేతకు ట్రంప్‌ కాల్‌ చేసి ప్రమాదకరమైన ఉత్తరకొరియా అంశంపై మాట్లాడారు. అణ్వస్త్ర పరీక్షలకు దూరంగా ఉండాలన్న అమెరికా హెచ్చరికలను ఏమాత్రం లేక్కచేయని ఉత్తరకొరియా అధినేత కిమ​ జోంగ్‌ ఉన్‌.. తమ క్షిపణి పరీక్షలను అవసరమైతే రెట్టింపుచేస్తామని హెచ్చరించిన విషయంపై చర్చించారు. అమెరికా ఆంక్షలకు భయపడి మిస్సైళ్లు, అణుపరీక్షలపై వెనక్కితగ్గే ప్రసక్తే లేదని కిమ్‌ స్పష్టంచేసిన నేపథ్యంలో రష్యా సాయంతో ఉత్తరకొరియాను ఢీకొట్టాలని ట్రంప్‌ భావిస్తున్నారు. ది క్రెమ్లిన్‌ వెబ్‌ సైట్‌ మాత్రం పుతిన్‌, ట్రంప్‌ తమ వ్యక్తిగత పనులకే అగ్రతాంబూలం ఇవ్వనున్నట్లు పేర్కొంది. మరోవైపు ట్రంప్‌ ఆ దేశంలోని అత్యున్నత దర్యాప్తు విభాగమైన ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌ జేమ్స్‌ కొమెను పదవి నుంచి తొలగించిన విషయం తెలిసిందే.

Videos

విశాఖకే జై కొట్టిన టిడిపి

Watch Live: కర్నూలులో సీఎం జగన్ ప్రచార సభ

అంతా మాయ..సేమ్ 2 సేమ్.. 2024 మోదీ ఎన్నికల స్పీచ్ పై డిబేట్

కాసేపట్లో కర్నూలులో సీఎం జగన్ ప్రచారం

ఎన్నికల ప్రచారంలో మంత్రి రోజాకు అపూర్వ స్వాగతం

పచ్చ మద్యం స్వాధీనం..

బాబును నమ్మే ప్రసక్తే లేదు..

మహిళలపైనా పచ్చమూకల దాష్టీకం..

నేడు సీఎం జగన్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే

విజనరీ ముసుగేసుకున్న అవినీతి అనకొండ

Photos

+5

SRH Vs LSG Photos: హైదరాబాద్‌ vs లక్నో సూపర్‌ జెయింట్స్‌..ఉప్పల్‌ ఊగేలా తారల సందడి (ఫొటోలు)

+5

How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)

+5

HBD Pat Cummins: సన్‌రైజర్స్‌ కెప్టెన్‌ సాబ్.. ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

కుటుంబ సభ్యులతో శ్రీవారి సేవలో టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి ‘నైనా జైస్వాల్‌’ (ఫొటోలు)

+5

Lok Sabha Polls: మూడో విడత పోలింగ్‌.. ఓటేసిన ప్రముఖులు

+5

Lok Sabha Polls 2024 Phase 3: లోక్‌సభ 2024 మూడో విడత పోలింగ్‌ (ఫొటోలు)

+5

AP Heavy Rains Photos: మారిన వాతావరణం.. ఏపీలో కురుస్తు‍న్న వానలు (ఫొటోలు)

+5

పెళ్లి చేసుకున్న తెలుగు సీరియ‌ల్ న‌టి (ఫోటోలు)

+5

మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)

+5

మాచర్లలో సీఎం జగన్‌ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)