amp pages | Sakshi

హాంకాంగ్‌పై చైనా పెత్తనం.. షాకిచ్చిన ట్రంప్‌!

Published on Sat, 05/30/2020 - 15:13

వాషింగ్టన్‌: ప్రపంచ వాణిజ్య ప్రధాన కేంద్రాల్లో ఒకటిగా పేరొందిన హాంకాంగ్‌ను పూర్తిస్థాయిలో తమ గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు చైనా తీసుకున్న నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ మండిపడ్డారు. దీర్ఘకాలంగా హాంకాంగ్‌ సంపాదించుకున్న పేరుప్రతిష్టలు, వైభవాన్ని కాలరాసేలా డ్రాగన్‌ విపరీత చర్యకు పాల్పడిందని విరుచుకుపడ్డారు. హాంకాంగ్‌ను పూర్తిస్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఉద్దేశించిన వివాదాస్పద జాతీయ భద్రతా బిల్లుకు చైనా పార్లమెంట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన ట్రంప్‌ శుక్రవారం శ్వేతసౌధంలో మాట్లాడుతూ.. ‘‘హాంకాంగ్‌ ప్రజలకు ఇది తీరని విషాదం. కేవలం వారికి మాత్రమే కాదు.. చైనా ప్రజలకు.. చెప్పాలంటే ప్రపంచం మొత్తానికి ఇదో పెను విషాదం’’ అని పేర్కొన్నారు. (స్వేచ్ఛకు సంకెళ్లు: మరో వివాదంలో చైనా)

అదే విధంగా హాంకాంగ్‌పై చైనా ఆధిపత్య ధోరణిని నిరసిస్తూ.. అగ్రరాజ్యం హాంకాంగ్‌కు కల్పించిన ప్రత్యేక వెసలుబాట్లను రద్దు చేయాలని తన పాలనా యంత్రాంగాన్ని ఆదేశించినట్లు తెలిపారు.  ‘‘హాంకాంగ్‌కు కల్పించే ప్రత్యేక సదుపాయాలను తొలగించే ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించాను. నేరస్తుల అప్పగింత, ఎగుమతుల నియంత్రణ, సాంకేతికత  ఉమ్మడి వినియోగం తదితర పలు కీలక ఒప్పందాలపై ఇది ప్రభావం చూపుతుంది’’ ట్రంప్‌ పేర్కొన్నారు. అంతేగాక అమెరికా యూనివర్సిటిల్లోని కొంతమంది చైనీస్‌ విద్యార్థులపై నిషేధం విధించనున్నట్లు తెలిపారు. తమ వాణిజ్య రహస్యాలను తెలుసుకునేందుకు చైనా ప్రభుత్వం దీర్ఘకాలంగా ప్రయత్నిస్తోందని.. ఈ క్రమంలో చైనా మిలిటరీతో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న విద్యార్థులపై నిషేధం విధించేందుకు ఆదేశాలు జారీ చేశారు. (డబ్ల్యూహెచ్‌ఓతో సంబంధాలు రద్దు : ట్రంప్)

చైనా పునరాలోచించాలి.. ప్రసక్తే లేదు!
హాంకాంగ్‌పై చైనా చట్టాన్ని అమెరికాతో పాటుగా బ్రిటన్‌, జపాన్‌ కూడా తీవ్రంగా ఖండించాయి. చైనా నిర్ణయంపై పునరాలోచన చేయాలని.. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా ఈ అంశంపై చర్చ జరగాల్సి ఆవశ్యకత ఉందన్నాయి. 1984 నాటి అప్పగింత ఒప్పందాన్ని చైనా ఉల్లంఘించిందని బ్రిటన్‌ మండిపడింది. ఆ ఒప్పందం ప్రకారం 2047 వరకు హాంకాంగ్‌ స్వతంత్రంగా కొనసాగేందుకు చైనా అంగీకరించిందని.. ఈ మేరకు యునైటెడ్‌ నేషన్స్‌ వద్ద రిజిస్ట్రేషన్‌ కూడా జరిగిందని పేర్కొంది. ఇక ఈ అమెరికా, బ్రిటన్‌ విమర్శలపై స్పందించిన యూఎన్‌ చైనా విభాగం..‘‘చైనా అంతర్గత వ్యవహారమైన హాంకాంగ్‌ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా సహించం. భద్రతా మండలిలో దీని గురించి ఎటువంటి చర్చ జరుగబోదు. యూఎస్‌, యూకే డిమాండ్లకు అర్థం లేదు’’అని ఓ ప్రకటన విడుదల చేసింది.(వారంలోగా చైనాపై కఠిన చర్యలు: ట్రంప్‌)

Videos

చంద్రబాబుపై సిదిరి అప్పలరాజు కామెంట్స్

చంద్రబాబుకు భారీ షాక్..ఇక టీడీపీ ఆఫీస్ కు తాళం పక్కా

వాలంటీర్లపై చంద్రబాబు రెండేళ్ళ కుట్ర

వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం ఖాయం: వంగా గీత

దద్దరిల్లిన కనిగిరి..పాపిష్టి కళ్లు అవ్వాతాతలపై పడ్డాయి

డీబీటీకి పచ్చ బ్యాచ్ మోకాలడ్డు

గుడివాడ అమర్నాథ్ భార్య ఎన్నికల ప్రచారం

లోకేష్, ఆనంకు మేకపాటి విక్రమ్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

పవన్ కు యాంకర్ శ్యామల అదిరిపోయే కౌంటర్..

బాబుకు ఓటు వేస్తే కొండచిలువ నోట్లో తల పెట్టడమే

సింగరేణిపై కుట్ర..

నరసాపురం, క్రోసూరు, కనిగిరిలో హోరెత్తిన జగన్నినాదం

నేడు మూడు నియోజకవర్గాల్లో సీఎం జగన్ ప్రచార సభలు

లోకేష్ కామెడీ..మార్చి 13న ఓటెయ్యండి..

అవ్వాతాతలపై కూటమి కాలకూట విషం.. బాబుకు విజయ్ బాబు కౌంటర్

షర్మిలకు హైకోర్టు మొట్టికాయలు

సీఎం జగన్ స్పీచ్ కి దద్దరిల్లిన కనిగిరి

ప్రత్యేక హోదా వెనుక బాబు కుట్ర దేవులపల్లి అమర్ ఏమన్నారంటే ?

చంద్రబాబు మేనిఫెస్టోపై జగన్ స్ట్రాంగ్ కౌంటర్

“ప్రాసలు పంచులతో” బాబు పరువు తీసేసిన జగన్

Photos

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ vs రాజస్థాన్ రాయల్స్‌.. తళుక్కుమన్న తారలు (ఫొటోలు)

+5

Vyshnavi: కొత్తిల్లు కొన్న బుల్లితెర నటి.. గ్రాండ్‌గా గృహప్రవేశం (ఫోటోలు)

+5

పోటెత్తిన అభిమానం.. దద్దరిల్లిన ఏలూరు (ఫొటోలు)

+5

సీఎం జగన్‌ కోసం పాయకరావుపేట సిద్ధం​(ఫొటోలు)

+5

బొబ్బిలి: జననేత కోసం కదిలిలొచ్చిన జనసంద్రం (ఫొటోలు)

+5

Kalikiri Meeting Photos: జగన్‌ వెంటే జనం.. దద్దరిల్లిన కలికిరి (ఫొటోలు)

+5

టాలీవుడ్‌లో టాప్ యాంకర్‌గా దూసుకుపోతున్న గీతా భగత్ (ఫొటోలు)

+5

జగనన్న కోసం మైదుకూరులో జనసంద్రం (ఫొటోలు)

+5

టంగుటూరులో జగనన్న కోసం పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)

+5

ధగధగా మెరిసిపోతున్న 'నాగిని' బ్యూటీ మౌనీరాయ్ (ఫొటోలు)

+5

నన్ను మరిచిపోకండి అంటూ ఫోటోలు షేర్‌ చేసిన పాకిస్థానీ నటి మహిరా ఖాన్

+5

కాస్మొటిక్ సర్జరీలు : యాక్టర్స్‌ విషాద మరణాలు (ఫొటోలు)