amp pages | Sakshi

షట్‌డౌన్‌కు తాత్కాలిక బ్రేక్‌

Published on Sun, 01/27/2019 - 04:12

వాషింగ్టన్‌: అమెరికాలో గత 35 రోజులుగా కొనసాగుతున్న షట్‌డౌన్‌కు పాక్షికంగా తెరపడింది. రాజకీయ ఒత్తిడికి తలొగ్గిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఫిబ్రవరి 15 వరకూ ప్రభుత్వం నడిచేందుకు అవసరమైన నిధుల విడుదలకు ఆమోదముద్ర వేశారు. ఈ బిల్లును కాంగ్రెస్‌లోని ఉభయసభలు మూజువాణీ ఓటుతో ఆమోదించగా, ట్రంప్‌ సంతకం చేయడంతో చట్టంగా మారింది. దీంతో దాదాపు 8,00,000 మంది ఫెడరల్‌ ఉద్యోగులకు ఈ నెల వేతనాలు అందనున్నాయి. రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం 3 వారాల్లోగా అమెరికా–మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణం, వలసవిధానంపై ఇరుపార్టీలు ఓ అంగీకారానికి రావాలి.

డెమొక్రాట్లకు మినహాయిపు కాదు..
షట్‌డౌన్‌ ముగిసిన నేపథ్యంలో వైట్‌హౌస్‌లో శుక్రవారం(స్థానిక కాలమానం) నిర్వహించిన మీడియా సమావేశంలో ట్రంప్‌ మాట్లాడుతూ.. ‘వలసల్ని సమీక్షించే హోంల్యాండ్‌ సెక్యూరిటీ విభాగానికి ఏడాది కాలానికి అవసరమైన నిధుల్ని కేటాయించే విషయమై ఉభయ సభలతో త్వరలోనే చర్చిస్తా. 35 రోజులుగా వేతనాలు లేక ఇబ్బంది పడుతున్న 8 లక్షల మంది ఫెడరల్‌ ఉద్యోగులకు పూర్తి నెల జీతాన్ని అందిస్తాం. షట్‌డౌన్‌ను ఎత్తివేస్తూ నేను తీసుకున్న నిర్ణయం డెమొక్రాట్లకు ఇచ్చిన మినహాయింపు కానేకాదు. సరిహద్దులో బలమైన గోడ లేదా ఉక్కు కంచె నిర్మించడం తప్ప మనకు మరో ప్రత్యామ్నాయం లేదు. ఫిబ్రవరి 15లోగా  ఆమోదయోగ్య ఒప్పందం కుదరకుంటే మళ్లీ షట్‌డౌన్‌ తప్పదు’ అని అన్నారు.

హెచ్‌1బీ ప్రీమియం ప్రాసెసింగ్‌ రేపటి నుంచే
హెచ్‌–1బీ వీసాల ప్రీమియం ప్రాసెసింగ్‌ను సోమవారం నుంచి పునఃప్రారంభించనున్నట్లు అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) ప్రకటించింది. వార్షిక పరిమితి (మొత్తం 85,000) కిందకు వచ్చే అన్ని రకాల హెచ్‌–1బీ వీసా కోటాలకు ప్రీమియం ప్రాసెసింగ్‌ సోమవారం నుంచి ప్రారంభమవుతుందని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. ఈ పరిమితి కిందకు రాని పలు ఇతర ఉద్యోగాలకు సంబంధించిన హెచ్‌–1బీ ప్రీమియం ప్రాసెసింగ్‌ ఫిబ్రవరిలో తిరిగి ప్రారంభమవుతుందని సమాచారం. ప్రీమియం ప్రాసెసింగ్‌ కింద దరఖాస్తుదారులు నిర్దిష్ట మొత్తంలో ఎక్కువ రుసుమును చెల్లిస్తే కేవలం 15 రోజుల్లోనే వారి దరఖాస్తుపై నిర్ణయం తీసుకుంటారు.

Videos

రిజర్వేషన్లపై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

ఈనాడు, ఆంధ్రజ్యోతి ఫేక్ న్యూస్ పై దేవులపల్లి ఫైర్

చిన్న పిల్లలు కూడా చెప్తారు నువ్వు చేసిన దోపిడీ..!

Watch Live: సీఎం జగన్ బహిరంగ సభ @నెల్లూరు

చంద్రబాబుకు ఓటేస్తే పథకాల ముగింపు సీఎం జగన్ మాస్ స్పీచ్

పవన్ మీటింగ్ అట్టర్ ఫ్లాప్

వీళ్లే మన అభ్యర్థులు.. ఆశీర్వదించి గెలిపించండి

సంక్షేమ పథకాలపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

డీబీటీకి చంద్రబాబు మోకాలడ్డు.. ఆగిన చెల్లింపులు

హోరెత్తిన హిందూపురం.. బాలయ్య ఓటమి గ్యారంటీ

Photos

+5

నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)

+5

ఆయ‌న‌ 27 ఏళ్లు పెద్ద‌.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవ‌రీ న‌టి?

+5

భార్యాభర్తలిద్దరూ స్టార్‌ క్రికెటర్లే.. అతడు కాస్ట్‌లీ.. ఆమె కెప్టెన్‌!(ఫొటోలు)

+5

చంద్రబాబు దిక్కుమాలిన రాజకీయాలు: సీఎం జగన్

+5

గుడిలో సింపుల్‌గా పెళ్లి చేసుకున్న న‌టుడి కూతురు (ఫోటోలు)

+5

ధ‌నుష్‌తో విడిపోయిన ఐశ్వ‌ర్య‌.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)

+5

కనిగిరి.. జనగిరి: జగన్‌ కోసం జనం సిద్ధం (ఫొటోలు)

+5

పెదకూరపాడు ఎన్నికల ప్రచార సభ: పోటెత్తిన జనసంద్రం (ఫొటోలు)

+5

అకాయ్‌ జన్మించిన తర్వాత తొలిసారి జంటగా విరుష్క.. KGFతో బర్త్‌డే సెలబ్రేషన్స్‌

+5

Swapna Kondamma: బుల్లితెర న‌టి సీమంతం.. ఎంతో సింపుల్‌గా ఇంట్లోనే.. (ఫోటోలు)